For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిస్నీ లాండ్ అంటే ఇష్టం ఉండొచ్చు, మరీ ఇంతనా?

|

జీవితంలో ఒక్కసారైనా డిస్నీ లాండ్ వెళ్లాలని అందరికీ ఒక కోరికైతే ఉంటుంది. ఎవరైనా తరచుగా అక్కడికి వెళ్తుంటే, కుతూహలంగా అనిపిస్తుంది. కానీ వారానికోసారి చొప్పున 300 పైన డిస్నీలాండ్ సందర్శించిన కుటుంబాన్ని చూస్తే విస్తుపోవడం గారెంటీ. అవునా ? నిజంగా రికార్డ్ బ్రేక్ అంశమే.

ఇక్కడ డిస్నీ లాండ్ మీద మక్కువతో వారంతంలో డిస్నీలాండ్ను మాత్రమే సందర్శిస్తున్న ఈ కుటుంబం గురించిన వివరాలను మీతో పంచుకోబోతున్నాము. ఈ కుటుంబంలో మొత్తంగా నలుగురు ఉన్నారు, వీరికి డిస్నీ లాండ్ అంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికే 300 పైన డిస్నీ లాండ్ సందర్శించిన వీరు, ఈ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగించాలని చూస్తున్నట్లుగా ఉంది.

Disney-Obsessed Family Visit Disneyland Every Week In Costume

వారంతరంలో ప్రతి వారమూ, డిస్నీ లాండ్ మాత్రమే సందర్శించే ఈ క్రేజీ కుటుంబం వివరాలు మీకోసం.

డిస్నీ లాండ్ అంటే ఇష్టం ఉండొచ్చు, మరీ ఇంతనా?

కాలిఫోర్నియా, నార్వాక్ ప్రాంతంలో నివసిస్తిన్న ఈ రువాల్కబాస్ ఫామిలీ, డిస్నీ లాండ్ పక్కనే ఇల్లు కలిగి ఉంది. క్రమంగా ప్రయాణ ఖర్చులు పెద్దగా ఉండవు కాబట్టి, తరచూ డిస్నీ లాండ్ చూసే వెసులుబాటు ఉంటుంది. కానీ, మరీ వారానికోసారి అంటే మాత్రం విడ్డూరమే అవుతుంది. ఏదైనా వ్యాపారం దృష్ట్యా అనుకుంటే పొరపాటే. వారాంతరం విడిది కోసం వీరు డిస్నీ లాండ్ మాత్రమే ఎంచుకుంటుంటారు.

ప్రతి సారీ, ఈ ఫామిలీ డిస్నీ లాండ్ సందర్శించే సమయంలో, ఈ కుటుంబ సభ్యులందరూ వేర్వేరు కార్టూన్ పాత్రల దుస్తులు ధరించి వినూత్నంగా తయారవుతుంటారు. ఈ దుస్తులను తయారు చేయడం తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని, ఆ పిల్లల తల్లి జెన్నిఫర్ అంటుంది.

ఈ తతంగమంతా కుట్టుమిషన్ నేర్చుకున్నప్పటి నుండి జరుగుతూ వచ్చింది. తను హౌస్-వైఫ్ గా ఉన్న కారణాన, వ్యాపకంగా ప్రారంభించిన ఈ అలవాటు, నేడు అందరికీ ఒక న్యూస్ అయింది. ఇప్పటికి తన 6 ఏళ్ళ పాప “రిలే” కోసం 60 దుస్తులను తయారు చేయగా, తన 2 సంవత్సరాల బాబు “లియాం” కోసం 20 దుస్తుల వరకూ చేసినట్లు తెలిపింది. ఈ దుస్తులన్నీ, వారి అభిరుచుల దృష్ట్యా అభిమాన కార్టూన్ పాత్రల ప్రకారం చేసినవి.

ఖర్చులు నిర్వహించడానికి, జెన్నిఫర్ ఈ దుస్తుల మెటీరియల్ను స్థానిక దుకాణంలో కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. క్రమంగా తనకు డబ్బు ఆదా చేసుకోవడంలో సహాయపడుతుందని తెలిపింది.

జెన్నిఫర్ తను చేసిన దుస్తులను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం ప్రారంభించినప్పటి నుండి ఆమెకు మంచి స్పందన వచ్చింది మరియు అప్పటినుండి ఆమె తన సొంత డిస్నీ కాస్ట్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించి డబ్బు సంపాదిస్తూ ఉంది కూడా!

తమాషాగా ప్రారంభించిన ఈ అలవాటు జీవనోపాధిగా మారిపోయింది. ఈ బిజినెస్ ద్వారా తను కూడా సంపాదనలో పడడం మూలంగా, వీరు అలవాటును కొనసాగించగలుగుతున్నారు.

నిజంగా క్రేజీ ఫామిలీ అని అనిపిస్తుంది కదా ? ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, సరదా అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Disney-Obsessed Family Visit Disneyland Every Week In Costume

The Ruvalcabas family lives right next door to Disneyland in a town called Norwalk in California. The family is known to visit Disneyland every week dressed up as different characters! The mother creates all the outfits herself from scratch, and the family of four reckon that they have visited the park more than 300 times!
Story first published: Monday, August 20, 2018, 13:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more