For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షవర్ బాత్ సమయంలో ఈ అలవాట్లు కూడా మీ వ్యక్తిత్వాన్ని సూచించగలవని తెలుసా? ఆ రహస్యాల గురించిన వివరాలు మీకోసం

|

రోజంతా పని ఒత్తిడి, అవిశ్రాంతత మొదలైన అనేక కారణాలవలన డస్సిపోయిన శరీరానికి, ఉపశమనం షవర్ బాత్. కానీ ఇది పరిశుభ్రత వరకు మాత్రమే పరిమితం కాలేదు, స్నానపు అలవాట్లు కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించిన వివరాలను వెల్లడిస్తాయని అధ్యయనాలు నిరూపించాయి. ఇక్కడ 10రకాల స్నానపు అలవాట్లను పొందుపరచబడి ఉన్నవి. ఇవి మిమ్మల్ని మీకు పూర్తిస్థాయిలో పరిచయం చేయడమే కాకుండా, ఇతరుల గురించి కూడా ఒక ఆలోచనను ఇవ్వగలవు.

1. రెప్పపాటులో షవర్ పూర్తి చేస్తున్నారా?

1. రెప్పపాటులో షవర్ పూర్తి చేస్తున్నారా?

షవర్ కోసం సమయాన్ని కేటాయించడం, నెమ్మదిగా ప్రతి నీటిబొట్టును ఆస్వాదిస్తూ స్నానానికి ఉపక్రమించడం వంటివి కాకుండా, వీలైనంత త్వరగా షవర్ ముగించాలని భావిస్తున్నవారైతే, మీరు నిరంతరం మీ దైనందిక నియామకాలకు కట్టుబడి ఉండేవారని అర్ధం. స్నానం కన్నా విలువైన అంశాలు దైనందిక జీవితంలో ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచన మీదిగా ఉంటుంది. ఇది మీ పనియందుగల నిబద్దతను సూచిస్తుంది కూడా. మరియు మీ జీవితానికి అధిక ప్రాధాన్యతనివ్వటానికి ఇష్టపడుతారని, అంతేకాకుండా, మీ కుటుంబసభ్యుల మరియు స్నేహితులకోసం అధికసమయం వెచ్చించాలని కోరుకునే వారుగా ఉంటారని చెప్పబడింది.

మీరు శ్రద్ధగల వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఇతరులకు సహాయపడే క్రమంలో భాగంగా మీ సాయశక్తులా కృషిచేసే అలవాటును కలిగి ఉంటారు. మీ స్నానపు అలవాటు మీ రూమ్మేట్స్ అత్యంత సానుకూలంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. దీనికి కారణం, బాత్రూం తలుపుతట్టి పిలిచేవరకు కాలయాపన చేయరు కాబట్టి.

2. పగటి కలలు కంటున్నారా?

2. పగటి కలలు కంటున్నారా?

షవరింగ్ అనేది మీ దృష్టిలో వేరే ప్రపంచం! స్నానాన్ని మీ ఊహాత్మక ప్రపంచంలోకి మిమ్ములను తీసుకెళ్ళే రవాణాసాధనంగా భావిస్తారు. ఒక్కోసారి షవర్ కింద వర్షానుభూతికి లోనై, ఆ కలల ప్రపంచంలోనే ఉండిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ప్రాపంచిక గోడల మద్య సమస్యలతో కట్టుబడి ఉండడం కన్నా, షవర్ కిందే మీకు స్వేచ్చాస్వాతంత్ర్యాలు లభించిన అనుభూతికి లోనవుతుంటారు. మీరు ఎప్పటికీ శక్తివంతులుగా మరియు సృజనాత్మకమైన ఆలోచనలు కలిగినవారిగా ఉంటారు. ఇతరులు మిమ్ములను అభిమానించడానికి ప్రధానకారణాలుగా ఈలక్షణాలు ప్రస్పుటిస్తూ ఉంటాయి.

3. షవర్ ప్రారంభం కాకముందే, కిందకు చేరుతున్నారా?

3. షవర్ ప్రారంభం కాకముందే, కిందకు చేరుతున్నారా?

అనేకమందిలా కాకుండా, షవర్ నుండి నీరు ప్రారంభం కాకముందే, షవర్ కింద అడుగుపెట్టే అలవాట్లు ఉన్నవారైతే, మీరు ప్రమాదాలతో ఆటలాడుకునే వ్యక్తిగా చెప్పవచ్చు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా లెక్కచేయక ముందుకుసాగే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితులలో అయినా విజయం మీకే వరించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తుంటారు. మీరు స్వేచ్ఛాయుతమైన ఆలోచనలను కలిగి ఉంటారు, మరియు నిస్సందేహంగా మీకు స్నేహితులు కూడా ఎక్కువే.

4. బాత్రూం సింగరా మీరు?

4. బాత్రూం సింగరా మీరు?

అనేకమందికి పాటలు పాడడం ఇష్టంగా ఉంటుంది, కానీ నలుగురిలో పాడడానికి బిడియాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇటువంటి వారు ఎక్కువగా షవర్ సమయాన్ని, పాటల సమయంగా మార్చుకుంటూ ఉంటారు. నిజానికి ఈదేశంలో అనేకమంది సింగింగ్ టాలెంట్, షవర్ కిందే మరుగున పడిపోతూ ఉందంటే అతిశయోక్తి కాదు. వీరు షవర్ సమయాన్ని, స్వేచ్చాయుత ప్రపంచంలో విహరించడానికి అనువైన సమయంగా భావిస్తూ ఉంటారు. క్రమంగా ఇతరులు ఏమనుకుంటున్నారోనన్న ఆలోచన కూడా లేకుండా సంతోషంగా పాటలకు ఉపక్రమిస్తుంటారు. నిజానికి కుటుంబసభ్యులతో అధిక సమయం వెచ్చించాలని, వారితో సంతోషంగా గడపాలన్న ఆలోచనలు చేస్తుంటారు. కుటుంబంలో ఎవరికి ఎటువంటి భాద కలిగినా తమకు కలిగినట్లుగా భావించే సున్నిత స్వభావులై ఉంటారు.

5. జాబితా తయారీదారులా?

5. జాబితా తయారీదారులా?

వీరు నిజంగా భిన్నస్వభావులే అని చెప్పాలి. నిరంతరం బిజీ ప్రపంచంలో కాలం వెళ్లదీసే వీరు, తమ ప్రణాళికల గురించి ఆలోచించాల్సిన సమయంకూడా ఉండని వారిగా ఉంటారు. కావున ఎటువంటి జాబితా నిర్మించుకోవాలని అనుకున్నా, ఎటువంటి ఆలోచనలు చేయాలని భావించినా షవర్ సమయాన్ని తమకు అనుకూలమైన సమయంగా భావిస్తూ ఉంటారు. మరియు పరద్యానమన్న మాటకు తావులేకుండా, సరిగ్గా రోజు గురించి ఆలోచించదగిన సమయంగా వీరికి షవర్ సమయం ఉంటుంది. ఈ అలవాటు మీ కార్యాచరణల అభివృద్దిలో సహాయపడుతుంది!

6. షవర్ కింద పళ్ళు తోముతున్నారా?

6. షవర్ కింద పళ్ళు తోముతున్నారా?

స్నానం చేస్తున్న సమయంలోనే దంత ధావనం మీ అలవాట్లలో ఒకటిగా ఉంటే, ఒకే సమయంలో వేర్వేరు పనులను నిర్వహించగలిగే మల్టీ-టాస్కర్ వలె ఉండే అవకాశాలు ఉన్నాయి. సమయాన్ని వృధాచేయకూడదు అన్న ఆలోచన మీది. క్రమంగా మీ దృష్టిలో ప్రతిక్షణం ముఖ్యమైనదే అన్నభావన కలిగిన వారిగా ఉంటారు. మరియు గడువులోపు పనులను పూర్తిచేయాలన్న పట్టుదల కారణంగా ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ ఈ ఒత్తిడి మీకు అసహనాన్ని, అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. అయినప్పటికీ, మీ వృత్తినిబద్దత మీ సమయాన్ని, డబ్బుని మరియు శక్తిని ఆదాచేయడంతో పాటు, సంఘంలో పేరుప్రఖ్యాతలను తీసుకుని వస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టల కాన్సెప్ట్ ఎప్పటికీ మీకు లాభాన్నే తెస్తుంది.

7. విలాసవంతమైన స్నానాన్ని ఇష్టపడుతున్నారా?

7. విలాసవంతమైన స్నానాన్ని ఇష్టపడుతున్నారా?

సులభమైన జీవితాన్ని కోరుకుంటూ, నెమ్మదిగా, ప్రతిక్షణాన్ని పూర్తిస్థాయిలో ఆనందించేలా ఆలోచనలు చేస్తుంటారు కొందరు. మీ మానసిక స్థితిగతులను, ఒత్తిళ్లను తొలగించడానికి మీ శరీరానికి ఇవ్వవలసిన సరైన మద్దతుగా ఇటువంటి స్నానాన్ని ఎంచుకుంటూ ఉంటారు. స్నానాన్ని ఎక్కువసేపు చేయడమే కాకుండా, సమయాన్ని అధికంగా కేటాయించడం, స్నానంలో ఆచరించవలసిన ప్రతి అంశాన్ని సక్రమంగా పూర్తిచేస్తూ ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇలాంటి అలవాటు ఉండే వారు సహజంగా ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు.

8. లూఫా అలవాటు ఉందా?

8. లూఫా అలవాటు ఉందా?

మీ షవర్ అవసరాల జాబితాలో లూఫా ఉంటే, మీరు చిన్నచిన్న విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిపూర్ణ ఫలితాలను ఇచ్చే వ్యక్తులుగా ఉన్నారని అర్ధం. ప్రతి అంశాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటూ వృత్తి పరమైన అంశాలలోనే కాకుండా, కుటుంబం మరియు సహోద్యోగుల వద్ద కూడా తెలివైన మరియు నిబద్దత కలిగిన వారిగా గుర్తింపుని పొందుతారు.

9. ఐస్-వాటర్ స్నానాలను ఇష్టపడుతుంటారా?

9. ఐస్-వాటర్ స్నానాలను ఇష్టపడుతుంటారా?

కొందరికి ఈ అలవాటు ఉంటుంది. వీరికి వేడి లేదా వెచ్చని నీళ్ళతో స్నానం చేయడం కన్నా, తీవ్రమైన చల్లదనంటి కూడిన నీటితో స్నానం చేయడానికే సుముఖత ప్రదర్శిస్తుంటారు. ఈ స్నానం మీ నరాలను ప్రశాంతపరిచేలా సహాయపడుతుందని మీ భావన. ఇటువంటి స్నానం అలవాటుగా కలిగి ఉన్నవారైతే, మీరు స్వీయ-అవగాహన కలిగి ఉన్న వ్యక్తులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

10. అవసరమైతే తప్ప స్నానం చేయం.

10. అవసరమైతే తప్ప స్నానం చేయం.

స్నానం అనేది తప్పదు కాబట్టి చేయాలి అన్న భావన వీరిది. వీరికి స్నానానికి సమయం కేటాయించడం కూడా ఇష్టం ఉండదు. ఒక్కోసారి రోజుల తరబడి కూడా స్నానం చేయరు. ఒక్కోసారి మర్చిపోతుంటారు కూడా. మీ రూమ్మేట్స్ మాత్రం మిమ్ములను బాగా ఇష్టపడుతారు, ఎందుకంటే, వారికి మీరు ఆటంకం కాదు కాబట్టి.

English summary

Do you know your shower habits can reveal a lot about your personality? Unlock the secrets here…

When it comes to showering, it is not just about personal hygiene! Studies have proved that shower habits reveal a lot about the personality of a person. Here are 10 showering habits that will make you understand yourself or others better:
Story first published: Thursday, September 6, 2018, 16:35 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more