For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ డాక్టర్ కొరుకుతూ చేసే మసాజ్ ను ఒక్కసారి చేయించుకుంటే చాలు

|

ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్తే వాళ్లకు వచ్చిన రోగానికి మంచి చికిత్స చేయించి పంపిస్తారు. కానీ ఆ డాక్టరమ్మ మాత్రం కాస్త వెరైటీ. వచ్చిన పేషేంట్లకు వింత ట్రీట్ మెంట్ ఇచ్చి పంపిస్తున్నారు. అయినా పేషెంట్స్ మాత్రం ఆ డాక్టర్ వద్దకు రావడానికి చాలా ఇష్టపడుతున్నారు.ఆ డాక్టర్ పేరు డోర్తి స్టెయిన్. కొందరు డాక్టర్ డాట్ అని కూడా అంటుంటారు. ఈమె 30 సంవత్సరాలుగా క్లినిక్ నడుపుతోంది.

ఒళ్లంతా కొరుకుతూ మసాజ్ చేయడం అనే ప్రక్రియను డాక్టర్ డోర్తి స్టెయిన్ అవలంబిస్తోంది. న్యూజెర్సీ లో ఈమె ఈ ట్రీట్ మెంట్ ను పేషెంట్స్ కు అందిస్తున్నారు. ఇలాంటి మసాజ్ దాదాపుగా ప్రపంచంలోనే ఎవరూ చేయడం లేదు.

ఎలా స్టార్ట్ చేసింది

ఎలా స్టార్ట్ చేసింది

డాక్టర్ డాట్ ఈ టెక్నిక్ ను తన ఐదేళ్లప్పుడే కనుగొనింది. చిన్నప్పుడు ఆమె తన తల్లికి ఇలాంటి చికిత్స చేసేది. ఆమె చేతులను, శరీరాన్ని సున్నితంగా కొరికేది. దీంతో తన తల్లికి చాలా హ్యాపీగా ఉండేది. ఆమె చేతులు బాగా గట్టిపడేవి. నిస్సత్తువ కోల్పొయిన చేతులకు ఏదో తెలియని శక్తి వచ్చేది.

15 ఏళ్లకే మొదలుపెట్టింది

15 ఏళ్లకే మొదలుపెట్టింది

ఇక డాక్టర్ డోర్తి స్టెయిన్ తన 15 ఏళ్లకే కొరకడం ద్వారా మసాజ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ థెరపిలో ఆమె 15 ఏళ్లకే ఫేమస్ అయిపోయింది. న్యూజెర్సీలో ఈమె ఈ మసాజ్ ను ప్రారంభించింది. ఆమె మర్దనా చేసే తీరుకు అందరూ ముగ్దులైపోయేవారు.

రాక్ బ్యాండ్

రాక్ బ్యాండ్

ఆమె మొదట రాక్ బ్యాండ్ డెఫ్ లెప్పార్డ్ సభ్యులకు మసాజ్ చేసేది. వారి ద్వారా చాలా మంది తెలుసుకుని ఆ మసాజ్ ను ఒక్కసారి తాము రుచి చూద్దామని ఆమె దగ్గరకు వెళ్లేవారు.చాలామంది బ్యాండ్ సభ్యులు, సంగీత కళాకారులు ఈమె రెగ్యులర్ కస్టమర్స్.

చాలా సంవత్సరాలు ఫ్రీగా సేవలు అందించింది

చాలా సంవత్సరాలు ఫ్రీగా సేవలు అందించింది

డాక్టర్ డోర్తి స్టెయిన్ ఇలా వ్యక్తులను కొరుకుతూ చేసే మసాజ్ ను ప్రారంభించినా.. ఈమె మొదటు ఎవ్వరి దగ్గర కూడా డబ్బు తీసుకునేకాదు. చాలా సంవత్సరాల పాటు ఈమె ఫ్రీగానే సర్వీస్ అందించింది. దీంతో ఈమెకు పెద్ద నెట్ వర్క్ ఏర్పడింది.

ఇప్పుడు గంటకు ఇంత

ఇప్పుడు గంటకు ఇంత

1994 వరకు ఈమె ఫ్రీగా సర్వీస్ అందించింది. తర్వాత ఈమె డబ్బులు తీసుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం గంటకు $ 150 మరియు $ 250 డాలర్లు ఈమె దగ్గర మసాజ్ చేయించుకునేవారి దగ్గరి నుంచి వసూలు చేస్తుంది.

ఆమె క్లయింట్స్

ఆమె క్లయింట్స్

డాక్టర్ డోర్తి స్టెయిన్ దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో చాలామంది సెలబ్రెటీస్ కూడా ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజ్జాల్లో చాలామంది ఈమె క్లయింట్స్ గా ఉన్నారు. కాటి పెర్రీ, ఎమినెం, రాబర్ట్ ప్లాంట్, మరియు కోర్ట్నీ లవ్ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఈమె దగ్గర కొరికించుకుంటూ మసాజ్ చేయించుకుంటారు.

కొరకండం ఏంటి

కొరకండం ఏంటి

డాక్టర్ డోర్తి వైద్యురాలు అయి ఉండి ఇలా మనుషులను కొరుకుతూ మసాజ్ చెయ్యడం ఏమిటని చాలామంది అనుకుంటారు. కానీ ఆమె వైద్యురాలిగా కన్నా ఇందులోనే ఎక్కువగా స్టడీ చేసింది కాబట్టి ఈమె దీన్నే ప్రొఫెషన్ గా ఎంచుకుంది.

టెక్నిక్స్

టెక్నిక్స్

అయితే కొరకడంలో కూడా ఆమె చాలా టెక్నిక్స్ పాటిస్తుంది. అలాగే మసాజ్ ఆయిల్ తో అలాగే ఆయిల్ లేకుండా కూడా చేస్తూ ఉంటుంది. చాలా రకాల ఔషదాలు కూడా ఉపయోగిస్తుంది. బాడీ మొత్తం రిలీఫ్ అయ్యేలా చాలా టెక్నిక్స్ డాక్టర్ డోర్తి పాటిస్తుంది.

ఒక్కసారి చేయించుకుంటే

ఒక్కసారి చేయించుకుంటే

డాక్టర్ డోర్తి చేసే కొరకడం అనే మసాజ్ కు వైద్య పరంగా మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు. ఇది ఈమె సొంతంగా చేసుకుంటున్న మసాజ్ మాత్రమే. అయితే ఒక్కసారి డాక్టర్ డోర్తి దగ్గర కొరికించుకునే మసాజ్ చేయించుకుంటే మాత్రం తప్పకుండా రెగ్యులర్ గా ఆమె కస్టమర్ అవుతారంట.

English summary

doctor dot aka dorothy stein who is famous for biting her clients

doctor dot aka dorothy stein who is famous for biting her clients..Dorthy Stein, aka Dr Dot, has been following for over 30 years now and the strange bit is, she has made a name for herself in this field where even celebrities visit her. Check on more details of Dorthy Stein, aka Dr Dot, and her bizarre massaging techn
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more