For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న పిల్లలు ప్రాణాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ కఫీల్‌ నిపా వైరస్ తో హీరో అయ్యాడు

కేరళలో విజృంభిస్తున్న అరుదైన వైరస్‌ నిపాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం నివారణ చర్యలను ముమ్మరం చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరవి విజయన్ సేవలందించేందుకు కేరళ వస్తానన్న కఫీల్ ఖాన్ కు స్వాగతం పలికారు.

|

కేరళలో విజృంభిస్తున్న అరుదైన వైరస్‌ నిపాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం తగిన నివారణ చర్యలను ముమ్మరం చేసింది. వైరస్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్‌ వైద్యులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆహ్వానించారు. ఈ మేరకు నిపా వైరస్‌ బాధితులకు చికిత్స చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ తెలిపారు.

వైద్యసేవలందిస్తాం

వైద్యసేవలందిస్తాం

ఇక పలువురు వైద్యులు, వాలంటీర్లు తాము రోగులకు అంకితభావంతో వైద్యసేవలందిస్తామని ముందుకు వస్తున్నారు. వైద్యసేవలందించేందుకు తాను కేరళ వస్తానని డాక్టర్ కఫీల్ ఖాన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరవి విజయన్ సేవలందించేందుకు కేరళ వస్తానన్న కఫీల్ ఖాన్ కు స్వాగతం పలికారు.

సంతోషకరం

సంతోషకరం

కఫీల్ ఖాన్ లాంటి వైద్యులు నిపా రోగులకు వైద్యసేవలందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని సీఎం వ్యాఖ్యానించారు. ప్రాణాలకు తెగించి వైద్యసేవలందిస్తున్న వైద్యుల్లో కఫీల్ ఖాన్ ఒకరని సీఎం వ్యాఖ్యానించారు.

కఫీల్ ఖాన్ కు ధన్యవాదాలు

కఫీల్ ఖాన్ కు ధన్యవాదాలు

‘అమాయకులైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నాకు అవకాశం ఇవ్వండి' అంటూ కఫీల్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీనికి స్పందించిన విజయన్‌ నిపా బాధితులకు ఉచితంగా వైద్యం చేసేందుకు కేరళ వస్తున్న డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌కు ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు.

అమాయకుల ప్రాణాలు కాపాడేందుకు

అమాయకుల ప్రాణాలు కాపాడేందుకు

"నేను ఈ రోజు సహర్ తర్వాత ఫజర్ నమాజు చదివి నిద్రపోయేందుకు యత్నించగా సోషల్ మీడియాలో నిపా వైరస్ వ్యాప్తి గురించి తెలిసి నిద్ర పట్టలేదు. అందుకే నిపా వైరస్ వల్ల అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు తనకు కాలికట్ వైద్యకళాశాలలో సేవలందించేందుకు అనుమతించాలని అభ్యర్థించాను " అంటున్నారు డాక్టర్ కఫీల్.

లినీ స్ఫూర్తి

లినీ స్ఫూర్తి

నర్సు లీని నిపా రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు విడవడం తనకు స్ఫూర్తినిచ్చిందని కఫీల్ ఖాన్ నర్సు లీనిని ప్రశంసించాడు.సిస్టర్ లీనీని స్పూర్తిగా తీసుకొని నిపా రోగులకు సేవలందిస్తూ ప్రాణ త్యాగం చేసేందుకు తాను సిద్ధమని డాక్టర్ కఫీల్ ఖాన్ ప్రకటించారు.

బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు

బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు

కాగా గత ఏడాది ఆగస్ట్‌లో గోరఖ్‌పూర్‌ని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో ఆక్సిజన్‌ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలో కఫీల్‌ఖాన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కఫీల్‌ఖాన్‌ ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చాక భావోద్వేగానికి గురయ్యారు.

చాలా కుంగిపోయాను

చాలా కుంగిపోయాను

‘నేను మానసికంగా చాలా కుంగిపోయాను. నెలల తర్వాత నా కుటుంబాన్ని కలిశాను. నేనేం తప్పు చేశాను? అసలు నన్ను ఎందుకు అరెస్ట్‌ చేశారు? జైల్లో గంటల తరబడి మధన పడేవాడిని. ఓ వైద్యుడిగా.. ఓ భారతీయుడిగా... అంతకు మించి ఓ తండ్రిగా... నేను చేయాల్సింది చేశాను. పిల్లల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు తెప్పించాను. కానీ, వారి చావుకు నేను కారణమంటూ నాపై నిందలేయటంతో ప్రాణం పోయినంత పనైయ్యింది ' అంటూ బాధపడ్డాడు.

ఆయన స్పందించలేదు

ఆయన స్పందించలేదు

‘ నా భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ చేతుల్లోనే ఉంది. జైల్లో ఉండగా నా విషయంలో ఆయన స్పందించలేదు. కనీసం ఇప్పుడైనా కనికరించి నాపై సస్పెన్షన్‌ ఎత్తేస్తే.. తిరిగి విధుల్లో చేరి సేవలు కొనసాగిస్తా. లేకుంటే ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం నరకం అనుభవించాల్సిందే' అంటూ కఫీల్‌ బాధపడ్డారు.

బకాయిలు చెల్లించక

బకాయిలు చెల్లించక

‘నిధుల నిలిపివేతతో ఆక్సిజన్‌ సరఫరా కంపెనీకి బకాయిలు చెల్లించలేకపోయామని.. దీంతో సదరు కంపెనీ ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా నిలిపేసిందని, 14 సార్లు సదరు కంపెనీ లేఖలు రాసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది' అని ఆయన పేర్కొన్నారు.

హీరోగా అభివర్ణిస్తూ

హీరోగా అభివర్ణిస్తూ

గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో గతేడాది ఆగస్ట్‌లో ఆక్సిజన్‌ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ సమయంలో సొంత డబ్బులతో కఫీల్‌ఖాన్‌ సిలిండర్లు తెప్పించి చికిత్స అందించటంతో ఆయన్ని హీరోగా అభివర్ణిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు వెలిశాయి.

కల్పిత కథనాలు సృష్టించారని

కల్పిత కథనాలు సృష్టించారని

అయితే ఆస్పత్రిలో ఆక్సీజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు సృష్టించారని, అసలు పిల్లల మరణానికి కారకుల్లో కఫీల్‌ కూడా ఒకరని ఆస్పత్రి వర్గాలు దర్యాప్తు బృందానికి నివేదించాయి.

షబిస్తా ఖాన్‌ నడుపుతుందంటూ

షబిస్తా ఖాన్‌ నడుపుతుందంటూ

గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్‌ అయిన కఫీల్‌ భార్య షబిస్తా ఖాన్‌ నడుపుతుందంటూ ఆరోపించాయి. ఈ పరిణామాలతో కఫీల్‌ ఖాన్‌పై వైద్య విభాగం వేటు వేయగా.. తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్ కోసం కఫీల్ కుటుంబసభ్యులు ఆరుసార్లు ప్రయత్నించారు. చివరకు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినందున కస్టడీలో కఫీల్ ఉండాల్సిన అవసరం లేదని కోర్టు ఆయన్ని విడుదల చేసింది.

మళ్లీ హాట్ టాఫిక్

మళ్లీ హాట్ టాఫిక్

అయితే కఫీల్ ఇప్పుడు నిపా వైరస్ బాధితులకు వైద్యం అందించేందుకు ముందుకు వచ్చి మళ్లీ హాట్‌టాపిక్ అయ్యారు. గతం గురించి ఎలా ఉన్నా కఫీల్‌ఖాన్ మంచి మనసును అభినందించాలి అంటున్నారు నెటిజన్లు.

లినీ కుటుంబానికి అండగా..

లినీ కుటుంబానికి అండగా..

ఇక నిపా వైరస్‌ సోకిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ కన్నుమూసిన కేరళ నర్సు లినీ పుతుస్సెరికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటూ ఇద్దరు పిల్లలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిసాయం చేస్తామని ప్రకటించింది. అలాగే ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి చనిపోయిన మిగిలిన కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

English summary

dr kafeel from gorakhpur offers to help in nipah virus crisis lesser known facts about Kafeel

dr kafeel from gorakhpur offers to help in nipah virus crisis lesser known facts about Kafeel
Story first published:Wednesday, May 23, 2018, 17:31 [IST]
Desktop Bottom Promotion