Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
హాస్పిటల్ బెడ్ మీద చావుబ్రతుకుల్లో చివరి కోరికగా “ది డాన్స్” పాట పాడిన వ్యక్తి
హాస్పిటల్ బెడ్ మీద చావుబ్రతుకుల్లో చివరి కోరికగా “ది డాన్స్” పాట పాడిన వ్యక్తి
మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తి మరికొన్ని క్షణాల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అంటే, ఆ భాద వర్ణనాతీతంగా ఉంటుంది. అవునా?, క్రమంగా వీలైనంత ఎక్కువ సమయం వారితోనే కేటాయించేలా ఉంటారు అంతేకాకుండా వారితో కొన్ని జ్ఞాపకాలను, మధుర క్షణాలను పంచుకుంటూ వారికి మానసిక స్థైర్యాన్ని అందిస్తూ, మరోపక్క చావు అనివార్యం అని తెలిసినప్పుడు ప్రశాంతమైన చావుని ప్రసాదించాలని మనసులో కోరుకుంటూ ఉంటారు కూడా.
ఇక్కడ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక వ్యక్తి పాటపాడుతున్న వీడియో చూడండి. చావు బ్రతుకుల్లో కూడా, హాస్పిటల్ బెడ్ మీద చేరి పాట పాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ పాటను రికార్డ్ చేసిన కొన్ని రోజులకే ఈ వ్యక్తి చనిపోయాడు కూడా. భావోద్వేగానికి గురిచేసే ఈ వీడియోను మీరు కూడా చూడండి.

ఈ వీడియో గురించిన మరిన్ని వివరాల కోసం, ఈ వ్యాసం చదవండి.
అతని గురించి:
మార్క్ రైట్ కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నాడు. కొలంబియా, మిస్సోరి జోన్ మొత్తానికి 30 ఏళ్ళకు పైగా అతను అగ్నిమాపక సిబ్బందిలో ఒకరిగా ఉన్నాడు. అతను పెద్ద పేగు కాన్సర్ గురవడం మూలంగా, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. మరియు విస్తృతమైన కీమోథెరపీకి అతని శరీరం తీవ్రంగా ప్రభావితమైంది. అయినప్పటికీ, శరీరంలో కాన్సర్ కణాలు, అతని కాలేయ, శోషరస గ్రంధులు మరియు ఊపిరితిత్తులకు కూడా వ్యాపించాయి.
ఈ పాటను పాడటం అతని చివరి కోరికలలో ఒకటిగా మారింది:
మార్క్ అతను తన చివరి దశలో ఉన్నాడని తెలుసుకుని, తన జీవితాన్ని ముగించే ముందు, తన పాటతో చివరి కోరికను తీర్చుకోవాలని సంకల్పించాడు. అతని సహచరులు అండగా ఉండగా, గిటార్ మ్యూజిక్ ప్లే అవుతుండగా, గార్త్ బ్రూక్ పాట "ది డాన్స్" పాడాలని కోరుకున్నాడు. క్రమంగా అతని కోరికను తీర్చే ప్రయత్నంలో స్నేహితులు, కుటుంబం కూడా సహకారం అందించారు.
అతని అభిమాన సంగీతకారునికి అతని వీడియోను చూపించారు !
నివేదికల ప్రకారం, గొప్ప పేరెన్నికగల సంగీతకారుడు అయిన “గార్త్ బ్రూక్స్” నకు మార్క్ యొక్క వీడియోను చూపించారు. క్రమంగా గార్త్ బ్రూక్స్, మార్క్ మరియు అతని గానం గురించిన నైపుణ్యాలను ప్రశంసించాడు కూడా. మార్క్ తన అభిమాన సంగీతకారుడి నుండి అటువంటి పొగడ్తలను పొందేందుకు అర్హత కలిగి ఉండేలా నైపుణ్యాన్ని ప్రదర్శించాడని బలంగా చెప్పగలం.
ప్రియమైన వారు చావు బ్రతుకుల్లో ఉంటే భరించడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో వారికి మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రపంచంలో కొన్ని అంశాలుపోతే తిరిగిరావు. ప్రాణంకూడా అలాంటిదే మరి.
మరియు భావోద్వేగ కథలను చదవాలనుకుంటున్నారా? తాజా నవీకరణలకోసం మా విభాగాన్ని తరచూ తనిఖీ చేయండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications