ఆమె రోజూ తన ఆరులీటర్ల చనుబాలను పిండేది.. వాటిని ఏం చేసేదో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

ప్రతి స్త్రీ జీవితంలో కచ్చితంగా తాను తల్లి కావాలని కోరుకుంటుంది. బిడ్డకు జన్మనిచ్చినప్పుడు స్త్రీ ఎంతో ఆనందం చెందుతుంది. మాతృత్వం అందించే అనుభూతి ఆడవారికి మరపురానిది.

అయితే బిడ్డపుట్టడంవరకుఒక ఎత్తు అయితే పుట్టాక బిడ్డ బాగోగులు చూసుకుంటూ పెంచడం అనేది మరో ఎత్తు.

బిడ్డ పెరుగుదలలో మొదటి దశ బిడ్డకు తన పాలు ఇవ్వడం. ప్రస్తుత జీవన పరిస్థితుల వల్ల చాలామందికి తల్లులకు సరిగ్గా పాలు పడట్లేదు.

వారు పడే చెప్పలేనివి

వారు పడే చెప్పలేనివి

అలాంటి సందర్భంలో తల్లులు పడే బాధ చెప్పలేనిది. తమ బిడ్డకు తల్లి చనుబాలు తాపాలని ఆరాటపడే తల్లులు చాలామంది ఉంటారు. ఒక మహిళ కూడా ఇలాంటి సమస్యనే మొదట ఎదుర్కొంది. తర్వాత ప్రసవంలో తనకు బిడ్డ పుట్టాక ఆమె చనుబాలు మోతాదుకు కంటే ఎక్కువగానే పడ్డాయి. ఆ పాలను ఆమె ఏమి చేసిందనేదే ఈ కథ.

తల్లిపాల దానం

తల్లిపాల దానం

తల్లిపాల దానం అనేది చాలా అరుదుగా వింటుంటాం. ఎందుకంటే ప్రతి తల్లి ఆ పాలను తన బిడ్డకోసమే వినియోగించాలనుకుంటుంది. అయితే ఒక మహిళ మాత్రం గతంలో తల్లిపాలను దానం చేసి వార్తల్లో నిలిచారు.

అండర్సన్‌ సెయిర్రా

అండర్సన్‌ సెయిర్రా

అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రం బేవెర్టన్‌కు చెందిన 30 ఏళ్ల అండర్సన్‌ సెయిర్రా ఇలా తల్లిపాలను దానం చేసి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. సెయిర్రాకు ఇద్దరు పిల్లలు. తొలిసారి పుట్టిన పాప నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించింది.

మొదటి సారి ఇబ్బంది

మొదటి సారి ఇబ్బంది

ఆ సమయంలో ఆండర్సన్ సెయిర్రా నుంచి పాల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో దాతలపై ఆధారపడాల్సి వచ్చింది. రెండోసారి పాప పుట్టినపుడు మాత్రం ఆ శిశువుకి పాలు అందించే స్థితిలోనే ఉండటంతో దాతలపై ఆధారపడాల్సిన అవసరం రాలేదు.

వృథా చేయకూడదనుకుంది

వృథా చేయకూడదనుకుంది

అయితే తల్లిపాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో వృథా చేయకూడదని భావించారు ఆండర్సన్ సెయిర్రా. తల్లిపాలను దానం చేయాలని నిర్ణయించుకుంది.

రోజుకు ఐదుసార్లు

రోజుకు ఐదుసార్లు

తనకు తొలిసారి పాప పుట్టినపుడు ఇబ్బందులు కలిగాయి.అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఉపయోగపడతాయని అండర్సన్‌ ఈ నిర్ణయానికి వచ్చింది. రోజుకు ఐదుసార్లు తన చనుబాలను సేకరించేంది.

8 గంటలకు పైగా సమయం

8 గంటలకు పైగా సమయం

అలా తను చనుబాలను తీసి భద్రపరచడానికి 8 గంటలకు పైగా సమయం కేటాయించేది అండర్సన్‌. ఈ విధంగా తన చనుబాలను దానం చెయ్యడం ద్వారా ఎంతో మంది చిన్నారులను ఆదుకుంది అండర్సన్‌ సెయిర్రా. అందులో వచ్చే తనకు ఎందులోనూ లేదు అనేది అండర్సన్‌ సెయిర్రా అభిప్రాయం.

ఆరు లీటర్ల పాలు

ఆరు లీటర్ల పాలు

ఉదయం నిద్ర లేచిన తరువాత, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌, మిడ్‌నైట్‌ తరువాత పాలను సేకరించేది అండర్సన్‌. రోజుకు 1.7 గ్యాలన్ల (6లీటర్లకు పైగా) పాలను సేకరించేది.

ఫ్రిజ్ లో నిల్వ ఉంచేది

ఫ్రిజ్ లో నిల్వ ఉంచేది

ఆ ప్యాకెట్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసేది అండర్సన్‌ సెయిర్రా. అవసరమైన వారికి తల్లి చనుబాలను పాలను సరఫరా చేసేంది. ఇక మిగిలిన పాలను మిల్క్‌ బ్యాంక్‌కు పంపించేది. అలా 600 గ్యాలన్లకు పైగా తల్లి చనుబాలను ఆమె సరఫరా చేసింది.

చాలా రిస్క్

చాలా రిస్క్

ఇలా చెయ్యడం చాలా రిస్క్ అయినా కూడా ఎంతోమంది చిన్నారులకు తల్లిపాలను అందించే ఆనందంలో ఆ రిస్క్ తనకు కనబడేది కాదంటది అండర్సన్‌ సెయిర్రా.

ఎన్ని పాలు వస్తే అన్ని పాలను

ఎన్ని పాలు వస్తే అన్ని పాలను

ఇంత పెద్దమొత్తంలో తల్లిపాలను తాను సేకరిస్తున్నందున తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని కూడా ఆమె మొదట్లో కాస్త భయపడింది. కానీ డాక్టర్లను సంప్రదించి తనకు ఎలాంటి ఆపాయం లేదని తెలుసుకున్నాక తన నుంచి ఎన్ని పాలు వస్తాయో అన్ని పాలను మొత్తం సేకరించేది.

భరోసాగా నిలిచింది

భరోసాగా నిలిచింది

ఆండర్సన్‌కు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ ద్వారా అధిక తల్లి పాలు లభించేవట. ఆమెకు రెండున్నరేళ్ల పాప ఉండడం, రెండో పాప పుట్టి ఆరు నెలలే కావడంతో తనకు లభించే అధిక తల్లిపాలను దానం చేసి ఎంతో మంది తల్లులకు భరోసాగా నిలిచింది.

అండర్సన్ మనస్సు గొప్పది

అండర్సన్ మనస్సు గొప్పది

చాలా మంది పిల్లల ఆకలి తీర్చుతున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉందని అత్యంత సంతోషం చెందేది అండర్సన్. ఏమయినా అమ్మతనపు ఆప్యాయత చాలా గొప్పది. అదీ తన పిల్లలకే కాకుండా లోకంలో పాలు సరిపడని చిన్నారులందరికీ మాతృత్వపు మాధుర్యాన్ని పంచిన అండర్సన్ మనస్సు చాలా గొప్పది.

3000 లీటర్లకు పైగా

3000 లీటర్లకు పైగా

పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న తల్లులంతా చనుబాలను దానం చేయాలని ఆమె బాగానే ప్రచారం చేపట్టింది. మొత్తానికి ఈ ఎలిజబెత్ ఆండర్సన్ సెయిర్రా 3000 లీటర్లకు పైగా తల్లి పాలను దానంగా అందజేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అండర్సన్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుదాం.

Image Credit

English summary

elisabeth anderson sierra donates breastmilk puerto rican family

elisabeth anderson sierra donates breastmilk puerto rican family.. Elisabeth Anderson-Sierra, 29, from Beaverton, Oregon, devotes a staggering ten hours a day to pumping her milk - which she describes as her 'labor of love', admitting that it has become like a full-time job. The mom-of-two was diagnosed with Hyperlactation Syndrome in 2014 which means she produces around 225oz, or 1.75 gallons, of breastmilk a day.
Story first published: Thursday, March 8, 2018, 18:16 [IST]