సెక్స్ సరోగేట్ థెరఫీ గురించి ఎప్పుడైనా విన్నారా ?

Subscribe to Boldsky

మీకెప్పుడైనా ఎందుకు చాలామంది వేశ్యాగృహాలవైపుకు మొగ్గు చూపుతున్నారు అన్న అనుమానం వచ్చిందా? డిప్రెషన్ స్థాయిలు పెరగడం, హార్మోను ప్రభావాలవలన నియంత్రణా శక్తి లేకపోవడం, మానసిక సంఘర్షణలు, ఆకతాయితనాలు ఇలా అనేకం వీటికి కారణం.

ఇక్కడ సెక్స్ సరోగేట్స్ అనే అంశంమీద చెప్పబడుతుంది , ఇది సెక్స్ థెరపీ కి వివాదపూరిత మరో అర్ధమనే చెప్పాలి.

Everything You Need To Know About The Sex Surrogate Therapy

ఏదైనా విషయం గురించిన పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఎవరైనా ఎవరికైనా వివరణ ఇవ్వగలము, కాబట్టి ఈ ప్రపంచంలో ఉపయోగం లేనిది అనేది ఏదీ ఉండదు , దృష్టికోణం మీదనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. కేవలం ఈ వ్యాసం అవగాహన కోసం మాత్రమే అని గ్రహించగలరు.

అసలు ఏమిటీ ఈ సెక్స్ సరోగశీ:

అసలు ఏమిటీ ఈ సెక్స్ సరోగశీ:

ఈ మానసిక సంబంధ చికిత్స లింగభేధంలేకుండా చేసేది. కానీ ఎక్కువగా వ్యంద్యత్వ సమస్యలతో భాధ పడే పురుషులకు ఎక్కువగా అవసరమవుతుంది.

వీళ్ళు వేశ్యా వాటికలలో పని చేసేవారు కాదు, ప్రొఫెషనల్స్:

వీళ్ళు వేశ్యా వాటికలలో పని చేసేవారు కాదు, ప్రొఫెషనల్స్:

ఈ సెక్స్ సరోగేట్స్ అనేది కూడా ఒక హోదా , మిగిలిన అన్నీ వృత్తుల లాగానే ఇది కూడా. కానీ వీరు వేశ్యావాటికలలో ఉండేవారు కాదు, అలాగని ఆన్లైన్ లో ప్రకటనలు ఇచ్చుకునేవారు కూడా కాదు. వీరికి ఖాతాదారులు మానసిక వైద్యుల నుండి సూచింపబడుతారు. పేషoట్ మానసిక పరిస్థితుల దృష్ట్యా, తప్పనిసరి పరిస్థితుల్లో మానసిక వైద్యులు ఈ పద్దతిని సూచిస్తుంటారు. తద్వారా వీరి సమస్యల నివారణకై సెక్స్ సరోగేట్స్ పని చేస్తుంటారు.

ఈ ప్రక్రియ ఇలా సాగుతుంది.. !

ఈ ప్రక్రియ ఇలా సాగుతుంది.. !

ఈ సెక్స్ సరోగేట్స్ ఎక్కువగా మాటలాడడం ద్వారానే చికిత్సను ప్రారంభిస్తారు, మాటలే వీరి ఆయుధంగా ఉంటాయి. అవసరాన్ని నిర్ధారించుకుని స్పర్శ , ఉద్దీపన వంటి చర్యలకు పూనుకోవలసి వస్తుంది. తద్వారా రోగి మానసిక పరిస్థితిని అంచనా వేసి, డాక్టర్ కు నివేదిస్తారు. ఒకవేళ సంబంధం కొనసాగాల్సిన పరిస్తితి వస్తే ఇది అన్నిటికన్నా చివరి స్టెప్ గా సూచించడమైనది. కానీ ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే.

ఒక సెక్స్ వర్కర్ ఈ పని గురించి ఇలా తెలిపారు :

ఒక సెక్స్ వర్కర్ ఈ పని గురించి ఇలా తెలిపారు :

ఒక సెక్స్ వర్కర్ ను ఈ పని గురించి తెలుపమని అడగగా ఆవిడ చెప్పిన విషయాలు "నేను ఒక వైద్యుడు సూచించిన ఖాతాదారునికై గదిలో, లైట్స్ ఆపివేయబడి , రూమ్ వెచ్చగా ఉండునట్లు అన్నిటా సమస్యలు లేకుండా సిద్దపరచి ఎదురుచూస్తూ ఉన్నాను. ఇంతవరకు అతని గురించిన ఎటువంటి వివరాలు కూడా నాకు తెలీదు, కానీ వైద్యులు చెప్పిన విషయాలను బట్టి ఇతను తన భాగస్వామితో భాధాకరమైన సంబoదాన్ని కొనసాగిస్తున్నాడు. మరియు వ్యంద్యత్వ శీఘ్రస్ఖలన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు అని మాత్రం తెలుసు.

ఒక సెక్స్ వర్కర్ ఈ పని గురించి ఇలా తెలిపారు :

ఒక సెక్స్ వర్కర్ ఈ పని గురించి ఇలా తెలిపారు :

నిజానికి ఈ కాలంలో 10 మందిలో 4,5 మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాకూడా, బయటకు చెప్పడానికి సిగ్గుపడి డిప్రెషన్ స్థాయిలలో నలుగుతున్నారు. ఇలాంటి సమస్యలు అనేకం ఇతను ఎదుర్కుంటున్నకారణంగా అధిక ఒత్తిడులకు, మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారు. ఈ సమస్యను దూరం చేయడానికే నేను ఇక్కడ ఉన్నది, కానీ చివరిగా నేను వీరి జీవితాన్ని ప్రభావితం చేసేలా మాత్రం ఉండకూడదు. స్పర్శ మరికొన్ని ఇతర చర్యల ద్వారా వీరి సమస్యలను తగ్గించడమో లేదా , వైద్యుల దృష్టికి తీసుకెళ్ళడం మాత్రమే మా పని ఉంటుంది. ఒక్కోసారి సెక్స్ కూడా అనివార్యం , కానీ అది కూడా వైద్యంలో భాగంగానే చేస్తాం" తద్వారా అనేక సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం కూడా. మరలా వీరు మాతో ఎటువంటి సంబంధాలను కలిగి ఉండరు.

ఇది చట్టరీత్యా నేరం:

ఇది చట్టరీత్యా నేరం:

నిజం, ఇలాంటి సెక్స్ సరోగేట్స్ కేవలం కొన్ని దేశాలలో మాత్రమే చట్టబద్దం. ఇజ్రాయిల్ వంటి దేశాలలో ముఖ్యంగా. ఆస్ట్రేలియా వంటి దేశాలలో రహస్యంగా ఈ పద్దతి అమలులో ఉంది. దీనికి కారణం వివాదపూరితమైన అంశాలు కావడమే. మన దేశంలో ఇది చట్టరీత్యా నేరం. నిజం వారి వారి వాతావరణ పరిస్థితులు సంప్రదాయక నడవడికల ప్రకారం, మానసిక రోగాల కారణంగా చట్టాలు నిర్దేశితమవుతాయి.

మరి మహిళలకు:

మరి మహిళలకు:

మహిళలకు కూడా ఈ థెరపీ అందుబాటులో ఉంది. ఆయా మానసిక పరిస్థితులను బట్టి వైద్యులు నిర్దేశిస్తారు. మనదేశంలో మాత్రం ఈపద్దతి అమలులో లేదు, దీనికి అనేకకారణాలు ఉన్నాయి. కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరియు చట్ట రీత్యా అనేక సమస్యలు కూడా ఉంటాయి. కావున మనదేశంలో ఊహకు కూడా అందని విషయమే అవుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Everything You Need To Know About The Sex Surrogate Therapy

    Sex surrogate therapy is a process in which the sex workers do not just offer sex, but rather closure and affection. These sex workers do it for men who have either intimacy issues or suffer from erectile dysfunction. It is not only women who do the service, there are also men who offer their services.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more