ప్రతి ఒక్కరు వాలెంటైన్స్ డే గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ రోజుని తెలుగులో ప్రేమికుల రోజు అని పిలుస్తారు. ఈ రోజు గురించి తెలుసుకొవాల్సిన విషయాలు, తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ నిజాలన్నీ కూడా చాలా తియ్యగా, నేటి సమాజ పోకడలకు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా, ఈ రోజుకు సంబంధించిన నిజాలను ఎవ్వరు సవివరంగా చెప్పలేదు.

13 Interesting Facts You Didn’t Know About Valentine’s Day

అసలు ఈ ప్రేమికుల రోజు ఎలా మొదలైంది ? దీని యొక్క చరిత్ర ఏంటి అనే విషయం మీకు తెలుసా ? ఈ వాలెంటైన్స్ డే కు సంబంధించిన నిజాలు మరియు దీని యొక్క పుట్టుక గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

13 Interesting Facts You Didn’t Know About Valentine’s Day

ఈ వ్యాసంలో వాలెంటైన్స్ డే కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు చాలా మందికి తెలియనివి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనం ఒకసారి రోమన్ కాలం నాటికి వెళ్ళాలి :

మనం ఒకసారి రోమన్ కాలం నాటికి వెళ్ళాలి :

చరిత్ర ప్రకారం వాలెంటైన్స్ డే అనేది రోమన్ కాలం నుండి ఉన్నదని చెబుతారు. ఆ కాలంలో యుద్ధ సమయంలో పురుషులు ఎవరు స్త్రీలని వివాహం చేసుకోకూడదు అనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను అప్పటి చక్రవర్తి క్లాయూడీఎస్ 2 ఆమోదించడం జరిగింది. కానీ, వాలెంటైన్ అనే మత గురువు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారు. ఎప్పుడైతే రాజుకు ఈ విషయం తెలిసిందో వాలెంటైన్ ని జైలులో నిర్బంధించారు. జైల్లో ఉండగా ఆ జైలు అధికారి కుమార్తెకు ఈయన ఒక ఉత్తరం రాసి " మీ వాలెంటైన్ నుండి " అని సంతకం చేసాడు.

వాలెంటైన్ కార్డ్స్ పైన ఎప్పుడు కానీ సంతకం చేయరు.

వాలెంటైన్ కార్డ్స్ పైన ఎప్పుడు కానీ సంతకం చేయరు.

విక్టోరియా కాలం నుండి కూడా వాలెంటైన్స్ రోజున ఇచ్చే కార్డు పై సంతకం చేస్తే దురదృష్టంగా భావిస్తారు.

ఈ కార్డులు ఇచ్చే ఆచారం :

ఈ కార్డులు ఇచ్చే ఆచారం :

ఒక అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం ఒక బిలియన్ కార్డులు వాలెంటైన్స్ డే రోజున ఇచ్చి పుచ్చుకుంటారట. క్రిస్టమస్ తర్వాత ఇంత ఎక్కువగా ఒక విషయం కోసం కార్డులు ఇచ్చి పుచ్చుకునే రోజు వాలెంటైన్స్ డే అని అధ్యయనము వెల్లడించింది.

ఒంటరిగా ఉండే వారు ఈ రోజుని ఎలా జరుపుకుంటారంటే :

ఒంటరిగా ఉండే వారు ఈ రోజుని ఎలా జరుపుకుంటారంటే :

ఎవరైతే వ్యక్తులు ఒంటరిగా ఉంటారో, వారు ఎవరు గాని కోపం తెచ్చుకోరు మరియు కలత చెందరు. ఎందుకంటే ఈ రోజుని ఒంటరిగా ఉండే వాళ్ళకి ఆవాహన కల్పించే రోజుగా కూడా భావిస్తారు.

ఈరోజున వికారమైన ఆహారాలను తింటారు :

ఈరోజున వికారమైన ఆహారాలను తింటారు :

చరిత్ర ప్రకారం, మధ్య యుగ కాలం నుండి కూడా స్త్రీలు కొన్ని వికారమైన ఆహారాన్ని తినేవారట. ఇలాంటి వికారమైన ఆహారం తినడం ద్వారా, వీరు వారి భవిష్యత్తు భర్తలను ఊహించుకునే విధంగా చేస్తాయి అని నమ్ముతారు.

ఈరోజు సెలవు దినంగా ప్రకటించారు :

ఈరోజు సెలవు దినంగా ప్రకటించారు :

1537 వ సంవత్సరంలో హెన్రి VII అనే ఇంగ్లాండ్ కు చెందిన రాజు ఫిబ్రవరి 14 వ తేదీని సెలవు దినంగా ప్రకటించి, ఈ రోజుని వాలెంటైన్స్ డే గా జరుపుకోమని అధికారికంగా చెప్పడం జరిగింది.

మొదటి డబ్బా చాక్లేట్లు ఎప్పుడు ఉత్పత్తి అయ్యాయంటే :

మొదటి డబ్బా చాక్లేట్లు ఎప్పుడు ఉత్పత్తి అయ్యాయంటే :

ఈ సెలవు దినాన్ని పురస్కరించుకొని రిచర్డ్ క్యాడ్బరి అనే వ్యక్తి 1800 సంవత్సరం మొదట్లో మొదటిసారి డబ్బా చాక్లేట్లు ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఇక అప్పటి నుండి చాక్లేట్లను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం మొదలయ్యింది.

చాక్లేట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి :

చాక్లేట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి :

కొన్ని గణాంకాల ప్రకారం ఒక్క వాలెంటైన్స్ డే రోజు మాత్రమే హృదయాకారంలో ఉండే చాక్లేట్ల డబ్బాలు 35 మిలియన్లు అమ్ముడుపోతున్నాయట.

సాధారణంగా పురుషులు ఈ రోజున పూలను బహుమతిగా ఇస్తుంటారు :

సాధారణంగా పురుషులు ఈ రోజున పూలను బహుమతిగా ఇస్తుంటారు :

కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ రోజున పూలను కొనే వారిలో 73% మంది పురుషులే ఉంటారట. మిగతా 27% మంది స్త్రీలు ఉంటారని చెబుతున్నారు.

ఎరుపు రంగు పూలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది :

ఎరుపు రంగు పూలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది :

శుక్రుడికి ఎరుపురంగు గులాబీ అంటే విపరీతమైన ఇష్టం. ఈమె రోమన్ దేవత. ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. అందుచేతనే ఈ రోజు ఎరుపు రంగు గులాబీలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆ తర్వాత లేత ఎరుపు రంగు మరియు బుర్గున్డి రంగు పూలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

స్త్రీలు ఎక్కువగా బహుమతులను కొంటుంటారు :

స్త్రీలు ఎక్కువగా బహుమతులను కొంటుంటారు :

ఈ రోజున పురుషులు ఎక్కువగా పూలను కొంటుండగా, స్త్రీలు మాత్రం బహుమతులను ఎక్కువగా కొంటుంటారట. ఈ రోజు బహుమతులు కొనే వారిలో 85% మంది స్త్రీలే ఉంటారట.

ఈ రోజున వివాహ ప్రతిపాదనలు అత్యధికంగా ఉంటాయి :

ఈ రోజున వివాహ ప్రతిపాదనలు అత్యధికంగా ఉంటాయి :

ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున సాధారణంగా సగటున 2 లక్షల 20 వేల పెళ్లి ప్రతిపాదనలు నమోదవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందట.

ప్రతి సంవత్సరం జూలియట్ చిరునామాకు ఉత్తరాలు వస్తుంటాయి :

ప్రతి సంవత్సరం జూలియట్ చిరునామాకు ఉత్తరాలు వస్తుంటాయి :

రోమియో మరియు జూలియట్ ఇటలీ దేశంలోని, వెరోనా నగరంలో ఉండేవారు. ప్రతి వాలెంటైన్స్ డే రోజున జూలియట్ ని ఉద్దేశిస్తూ కనీసం వెయ్యి ఉత్తరాలు ఈ నగరానికి చేరుతాయట.

English summary

13 Interesting Facts You Didn’t Know About Valentine’s Day

We all celebrate Valentine's day and learning about the history of this day makes it more interesting, as this day's history has its own uniqueness. From unheard facts to the most popular ones, there is a lot more about Valentine's day, than it being just the day of love!
Story first published: Saturday, February 10, 2018, 9:00 [IST]
Subscribe Newsletter