బాత్ రూంలో తమ ప్రాణాలు పోగొట్టుకున్న సినీతారల లిస్ట్

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఈమధ్య నటి శ్రీదేవి చనిపోగానే, ఆమె మరణం చుట్టూ చాలా అనుమానాలు, రహస్యాలు ఏర్పడ్డాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అలా చనిపోవటం ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.

కానీ మీకు తెలుసా శ్రీదేవి ఒక్కతే బాత్ రూంలో తన ప్రాణాలు కోల్పోయిన సెలబ్రిటీ కాదని? ఇంకా చాలామంది ప్రముఖ తారలు బాత్ రూంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ రోజు బోల్డ్ స్కైలో బాత్ రూంలో చనిపోయిన ఇతర తారల గురించి తెలుసుకుందాం!

సినీతారలైన ఎల్విస్ ప్రెస్లే, జూడీ గార్లాండ్ ఇంకా చాలామండి బాత్ రూంలోనే తమ ప్రాణాలు విడిచారు. వారెవరో తెలుసుకోటానికి చదవండి.

శ్రీదేవి

శ్రీదేవి

ఆమె మరణవార్త ఇంకా మనల్ని కలచివేస్తూనే ఉంది. శ్రీదేవి భారతదేశంలో మొదటి స్త్రీ సూపర్ స్టార్ అయిన కథానాయిక. తన అసలుపేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్, నివేదికల ప్రకారం ఆమె దుబాయ్ లో బస చేసిన హోటల్ బాత్ రూం టబ్ లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి చనిపోయారు.

ఎల్విస్ ప్రెస్లే

ఎల్విస్ ప్రెస్లే

అతను ‘ద కింగ్’ గా ప్రసిద్ధుడు. ఆయన చనిపోవటానికి చాలామంది డ్రగ్స్ ఎక్కువ తీసుకోవటం కారణం అని నమ్ముతున్నారు. ప్రపంచంలోని గొప్ప గాయకుల్లో ఒకరైన అతను మెంఫిస్, టేన్నెస్సీలోని తన భవనం గ్రేస్ లాండ్ మాన్షన్ లో బాత్ రూంలో చనిపోయి కన్పించారు.

జిమ్ మారిసన్

జిమ్ మారిసన్

ఇతను ప్రసిద్ధ బ్యాండ్ ‘ద డోర్స్’ కి ప్రధాన గాయకుడు. అతను బాత్ టబ్ లో చనిపోయే సమయానికి తన వయస్సు కేవలం 28 ఏళ్ళే. కథనాల ప్రకారం, తన చావుకి కారణం ప్రపంచానికి అస్సలు తెలీదు, ఎందుకంటే పరీక్షించిన వైద్యులు తన చావుకి సంబంధించి ఎటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. శరీరానికి పోస్టుమార్టం కూడా జరగలేదు.

క్లాడె ఫ్రాంకోయిస్

క్లాడె ఫ్రాంకోయిస్

అతను ఓ గాయకుడు, పాటల రచయిత కూడా. ఫ్రాన్స్ దేశానికి జాతీయ సంపదగా కూడా పిలవబడిన క్లాడె ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో చనిపోయాడు. విరిగిపోయిన బల్బ్ ను నీళ్ళు నిండిన టబ్ లో నుంచుని సరిచేస్తుండగా, ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోయాడు.

జూడీ గార్లాండ్

జూడీ గార్లాండ్

ఆమె బాత్ రూంలో కొత్తగా పెళ్ళిచేసుకున్న భర్త పక్కన చనిపోయి కన్పించిండి. నివేదికల ప్రకారం, తన చావుకి కారణం బార్బిట్యురేట్’స్ డ్రగ్ అధిక డోస్ లో తీసుకోవటం అని చెప్పబడింది.

లెన్నీ బ్రూస్

లెన్నీ బ్రూస్

అతను ఒక ప్రసిద్ధ స్టాండప్ కమెడియన్, రచయిత ఇంకా వృత్తిపరంగా ఒక సాంఘిక విమర్శకుడు కూడా. అసలు పేరు లెనార్డ్ ఆల్ఫ్రెడ్ ష్కెనెడర్. కానీ లెన్నీ బ్రూస్ గానే ప్రసిద్ధుడు. అతని చావు మార్ఫిన్ అధిక డోస్ వలన జరిగింది. హాలీవుడ్ హిల్స్ లోని తన ఇంటి బాత్ రూంలో అతని శరీరం కనుగొన్నారు.

రాబర్ట్ జోసెఫ్ పాస్టరెల్లి

రాబర్ట్ జోసెఫ్ పాస్టరెల్లి

అమెరికన్ నటుడైన ఇతను టాయిలెట్ లో కుడిచేతికి సిరంజి గుచ్చబడి, చనిపోయి కన్పించాడు. పోస్టుమార్టం చేసాక, మెడికల్ రిపోర్టుల ప్రకారం అతను హెరాయిన్ అధిక డోసు అయి చనిపోయాడని తేలింది.

అన్ని చిత్రాల సోర్స్ ; వికీకామన్స్

English summary

Celebs Who Lost Their Lives In A Bathroom

It was not Sridevi alone who has lost her life in a bathroom, there are other celebs too who have lost their lives in such a way. From Elvis Presley, Jim Morrison, Claude Francois, Judy Garland, Lenny Bruce to even Robert Joseph Pastorelli, these celebs have been known to have died in a bathroom.