For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పగింతలప్పుడు ఈ తండ్రీ-కూతుళ్ళ భాదను చూస్తే మీ కళ్ళల్లో కూడా నీళ్ళు ఆగవు

|

పెళ్లి., ఆనందోత్సాహాలకు, భావోద్వేగాలకు, చుట్టాల పలకరింపులకు, స్నేహితుల ఆదరణకు, విందు, వినోదం, సంగీతం, నృత్యం, ముచ్చట్లు మొదలైన అనేక అంశాలకు ప్రధాన నిలయం. ఇద్దరి మనసులను పెళ్లి అనే బంధంతో ముడివేసి, జీవిత గమనానికి దారులు సుగమం చేసే అద్బుతమైన వేడుక పెళ్లి.

ముఖ్యంగా అప్పగింతలప్పుడు, తమ నుండి దూరమవుతున్న బిడ్డల గురించిన ఆలోచనలతో సతమతమయ్యే తల్లిదండ్రుల కన్నీళ్ళలో కనిపించే ప్రేమ, సంతోషాల నడుమ భావోద్వేగాలు అనిర్వచనీయం.

ఈ భావోద్వేగాల వెనుక అనేక అంశాలు నిఘూడగుప్తం. తర్వాతి భవిష్యత్ దగ్గర నుండి, వారి బాగోగుల దాకా ప్రతి అంశమూ ఒక సంశయంగా మెదళ్ళను తొలిచేస్తుంటే ఆపుకోలేని భావోద్వేగం, కన్నీళ్ళ రూపంలో ఉబికి వచ్చే అద్భుతమైన క్షణాలు అవి.

ఇక ఈ వీడియో కిందకు వస్తే, తాను అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డకు పెళ్లి చేసి పంపే క్రమంలో కూతురితో చివరిసారిగా డాన్స్ చేస్తూ భావోద్వేగాలకు లోనవుతున్న తండ్రి, చూపరులను కూడా కంటతడి పెట్టించాడు.

ఎన్నో జ్ఞాపకాలను తండ్రితో కలిగి ఉన్న ఆ నవవధువు, తండ్రి ప్రేమ దూరమవుతుందేమో అన్న భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్ళపర్యంతమైంది. ఒక పక్క తండ్రిని వీడుతున్నానన్న బాధ, మరో పక్క తన తండ్రిని ఓదార్చడం మరియు తన క్షేమం గురించిన ధైర్యాన్ని ఇవ్వడం వంటి భావోద్వేగాలు ఆమె కళ్ళల్లో ప్రస్పుటంగా కనిపించిన ఈ వీడియో, ఇప్పుడొక వైరల్.

అనేక అసంబద్దమైన వీడియోలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన ఇంటర్నెట్లో, ఇటువంటి తులసి మొక్కలు మనుషుల్లోని ప్రేమను వెలికితీయగలవని విశ్లేషకుల అభిప్రాయం.

తను మూడేళ్ళ వయసులోని మాటలను వెనుక వస్తున్న ఆహ్లాదకరమైన మెలోడీ పాటలో జోడించడం, పాటకు అనుగుణంగా తండ్రితో నృత్యం చేయడం ద్వారా ఒక బహుమతిని ఇచ్చిన ఆ నవవధువు చర్యకు, ఆ తండ్రి సంభ్రమాశ్చర్యాలకు లోనై బిడ్డను కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం ఎంతో హృద్యంగా కనిపించింది.


ఆ చిట్టిపాపాయి గొంతును పాట మద్యలో వినగానే, ఇంత చిన్నబిడ్డ అంతలోకే పెళ్లి వయసుకు వచ్చి నన్ను వీడి వెళ్లిపోతుందా అన్న ఆశ్చర్యానికి లోనైనట్లుగా కనిపిస్తుంది. నిజంగా ఇటువంటి అద్భుతమైన క్షణాలు ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు మాత్రమె దక్కే వరం అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈ క్షణాలు జీవిత కాలంలో ఒక్కసారే వచ్చినా, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు.


అవును ఎక్కడికెళ్ళినా మనం అమ్మ, నాన్న చాటు బిడ్డలమే మొదట, తర్వాతే భాగస్వామి. అవునా? వారి భయం కూడా, మనకు వచ్చే భాగస్వామి వారిలా మనల్ని చూసుకుంటారా లేదా ? అన్న ప్రశ్న నుండే వస్తుంది. ఆ ప్రేమ అనిర్వచనీయం. అటువంటి ప్రేమలు ఈ లోకంలో అడుగడుగునా ఉండబట్టే, మానవ సంబంధాలు ఒక తాటిన ఇంకా నడుస్తున్నాయి. ఏమైనా మాట్లాడితే పాశ్చాత్య పోకడ అంటారు.. ఏం పాశ్చాత్యులకు ప్రేమలు, భావాలు ఉండవా? అని ప్రశ్న వేస్కుంటే అందరూ మనలాంటి సాటి మనుషులే కదా స్పురిస్తుంది. ప్రేమకు ప్రాంతానికి సంబంధం లేదు. ప్రేమ ఎక్కడ ఉన్నా, ఆ బంధం ఎన్నటికీ పదిలంగా ఉంటుంది.


మీకు ఈ వీడియో చూస్తుంటే మీ తండ్రితో గడిపిన జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నాయా? జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా, తల్లిదండ్రుల ప్రేమ ముందు అది ఎన్నటికీ సాటి రాదు. దేవుడు జన్మని మాత్రమే ఇస్తే, తల్లిదండ్రులు జీవితాన్ని బహుమతిగా ఇస్తారు. ఎటువంటి స్వార్ధంలేకుండా మన ఉన్నతి గురించి నిరంతరం కలలు కంటూ, మన భవిష్యత్ మార్గాలను నిర్మించే నిస్వార్ధమైన ప్రేమను పంచే తల్లి దండ్రుల ప్రేమ ముందు దేవుడైనా తల దించాల్సిందే. ఈ వీడియో తండ్రీ కూతుళ్ళ ప్రేమకు తార్కాణంగా మిగిలిపోతుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అటువంటి తండ్రీకూతుళ్ళకు ఈ వీడియో అంకితమివ్వాల్సిందే.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Bride Surprises Her Dad While Dancing And Plays A Recording Of Her Voice

Weddings have this exciting effect on people, sometimes even the toughest ones can't stay immune to the whole ceremony, and it is no wonder that they shed a tear or two during someone's special day. A video was shared online where a father-daughter's emotions were seen as the daughter played her childhood recording.