For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం నుండి శనివారం వరకు ఈ ఏడు పనులను చేయడం ద్వారా, మంచి పేరు ప్రతిష్టలతో పాటు సిరిసంపదలు కూడా మీ సొంతమవుతాయి.

|

జీవితంలో ఒడిదుడుకులు, సుఖదుఃఖాలు అనేవి సర్వసాధారణం. కానీ, మనిషి దుఃఖాలను, కష్టాలను అనుభవించడానికి మాత్రం ఎన్నటికీ సిద్దంగా ఉండడు. పేపర్లలో టీవీలలోని వాణిజ్య ప్రకటనలు, హంగూ ఆర్భాటాలతో కూడిన అభిమాన నటులు లేదా నాయకుల వస్త్ర, వేషధారణ లేదా మరే ఇతర అంశాలనైనా ప్రేరణగా తీసుకుంటూ వారివలెనే తాము కూడా కనపడాలన్న ఆలోచనలతో స్థోమతను మరచిపోయి మరీ ఖర్చులు చేస్తుంటారు అనేకులు. క్రమంగా అప్పులపాలవ్వడం, ఆర్ధిక స్థితిగతులు కూడా నెమ్మదిగా తగ్గడం జరుగుతుంటుంది. ఏది ఏమైనా స్థోమతను మించి చేసే ఖర్చు, ఎన్నటికీ కష్టాలనే మిగులుస్తుంది.

మీ కోరిక ఎంతవరకు సరైనది?

వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్న కొలదీ, ఈ విషయాలన్నీ కేవలం కోరికలు మరియు కలలుగా మనం గ్రహిస్తాము. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిఉంటుంది. కానీ కలల నుండి మేల్కుని మీ జీవితాన్ని సార్ధకత చేసుకునేలా, మీకంటూ కావలసినవి సమకూర్చేలా చేయగల అంశాల గురించిన వివరాలను మీముందు పొందుపరుస్తున్నాము.

అనేక జీవితాలు:

ఇక్కడ పుట్టిన ప్రతిమనిషీ భిన్నమైన రూపాలతో, భిన్న సంస్కృతుల మద్యనే పుడతాడు. కానీ ఒకవయసుకు వచ్చే దాకా చుట్టుపక్కల జరుగుతున్న విషయాల మీద అవగాహన ఉండదు. కానీ మనిషి పెరుగుతున్న విదివిదానాలను పుట్టినతేది, సమయం, రాశి చక్ర గుర్తులు, కర్మ మొదలైనవి ప్రభావితం చేస్తుంటాయని పండితులు చెబుతుంటారు. క్రమంగా వారి వారి గ్రహస్థితులను అనుసరించి వారి జీవితం నడుపబడుతుంది. మన విధివిధానాలు మన చర్యలు, మరియు జన్మకుండలిలోని గ్రహాల స్థితిగతులు మరియు మానవకృషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిలో అన్ని అంశాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పబడింది. కనుక మనం ఎలా జీవించాలో, ఎలా మరణించాలో అన్నది కేవలం మన నియంత్రణలో ఉంటుందని చెప్పబడింది.

పురాతన గ్రంథాలు:

మన పవిత్ర గ్రంథాలు మనకు మంచి అదృష్టం, సంపద, పేరు మరియు ఖ్యాతిని తీసుకునిరావడంలో సహాయపడే అనేక రహస్యాలను కలిగి ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ వాటిలో పొందుపరచబడినవి కాకుండా, అందులో ఉన్నాయి అంటూ కొన్ని అబద్దాలకు తెరలేపి, స్వార్ధానికి సైతం వాడుకుంటున్న వారిని కూడా మనం తరచూ చూస్తుంటాము. కావున ఎటువంటి అనుమానాలున్నా, మీ దేవాలయ పూజారిని లేదా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులను సంప్రదించడం ద్వారా సరైన రీతిలో దైవిక కార్యాలను చేసి దేవుని కృపకు పాత్రులవగలరు. ఏది ఏమైనా, కలల సాకారానికి గ్రహస్థితులతో పాటు మానవ కృషి కూడా అవసరమని గుర్తించాలి.

గమనిక...

ఇక్కడ పొందుపరచబడిన 7 రహస్యాలను పాటించడం ద్వారా, పేరు ప్రఖ్యాతలు పెరగడమే కాకుండా, ఆర్ధిక స్థితిగతులు కూడా మెరుగవుతాయని చెప్పబడింది.

ఆదివారం నుండి శనివారం వరకు ఈ ఏడు పనులను చేయడం ద్వారా, మంచి పేరు ప్రతిష్టలతో పాటు సిరిసంపదలు కూడా మీ సొంతమవుతాయి.

ఆదివారం

ఆదివారం

ఈ రోజున, మీ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ముందు, తమలపాకును తినడం లేదా మీతో పాటు తీసుకుని వెళ్ళడం చేయాలి. ప్రతి ఆదివారం ఆచారంగా పాటించడం మూలంగా మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది.

సోమవారం

సోమవారం

వారంలో మొదటిరోజు సానుకూల ప్రభావాలతో ప్రారంభంకావాలని అనుకుంటే, మీ ఇల్లు వదిలి వెళ్ళేముందు ఒకసారి అద్దంలో మిమ్ములను మీరు చూసుకోవలసి ఉంటుంది. మీ గృహానికి సింహద్వారానికి (గృహంలోపల) కుడి పక్కగా అద్దాన్ని ఉంచడం మంచిదిగా సూచించబడినది.

మంగళవారం

మంగళవారం

ఈరోజు హనుమంతునికి కేటాయించబడిన రోజు, కావున ఉదయాన్నే అల్పాహారానికి ముందే హనుమాన్ చాలిసా పారాయణం చేయడం ఉత్తమంగా సూచించబడినది. మరియు ఇంటినుండి బయటకు వెళ్లేముందు, ఏదైనా బెల్లం వంటి తీపి పదార్ధాన్ని తీసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందగలరని చెప్పబడినది..

 బుధవారం

బుధవారం

బుధవారం నాడు పనికోసం బయటకు వెళ్ళడానికి ముందు, పుదీనా లేదా కొత్తిమీర ఆకులను నమలడం చేయడం మంచిది. ప్రతి బుధవారం దీన్ని ఒక ఆచారంగా పాటించడం ద్వారా మార్పును చూడగలుగుతారు.

గురువారం

గురువారం

ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ముందు ఎవైనా తృణ ధాన్యాలను లేదా జీలకర్ర లేదా ఆవాలను స్వీకరించడం మంచిదిగా సూచించబడినది. ఇంటినుండి పూర్తిగా బయటకు అడుగుపెట్టేదాకా, వాటిని నమలడం లేదా కడగడం చేయరాదు. వాటిని ముడిపదార్ధాలుగానే ఉండనివ్వండి.

శుక్రవారం

శుక్రవారం

హిందూమతంలో శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా కీర్తించబడుతుంది. కావున శుక్రవారం నాడు ఇంటి నుంచి బయలుదేరే ముందు కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగును (ఏ ఉప్పు లేదా చక్కెరను జోడించకుండా) తీసుకోవడం మంచిదిగా సూచించబడినది.

 శనివారం

శనివారం

అల్లం తినడం ద్వారా కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పటికే మనకు తెలుసు, కానీ మన అదృష్టానికి కూడా కారణం కా

గలదని ఎవరికి తెలుసు? ప్రతి శనివారం, నెయ్యితో కలిపి చిన్న ముక్కలుగా తరిగిన అల్లం తీసుకోవడం మంచిదిగా సూచించబడినది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

From Monday To Sunday, Do These 7 Things Each Day For Name, Fame And Wealth!

Who doesn’t want to live a life without struggles and sorrow? Don’t we wish to live life like our favourite celebrity or politician or role model, associating with big names, featuring in ads/movies, getting all the attention and not to forget the finances?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more