For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దీపావళికి మీకు నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వదగిన ఉత్తమమైన స్మార్ట్ ఫోన్

ప్లిప్ కార్ట్ అందుబాటులో ఉన్న వేలకొలదీ ఉత్పత్తుల్లో, దీపావళి బహుమతుల కోసం ఎంచుకోదగిన వాటిలో స్మార్ట్ఫోన్లు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాయి. వాటిలో Realme తాజా స్మార్ట్ఫోన్లు ఈ దీపావళి మహోత్సవం సమయంలో ఇవ్వద

By Chaitanyakumar Ark
|

భారతీయులకు పండుగలంటే మక్కువ ఎక్కువ. పండుగ నాడు ఇష్టపడే ప్రత్యేకమైన విషయం ఏదైనా ఉంది అంటే, అది మొదటగా బహుమతులే ఉంటాయి. నిజమైకదా. బహుమతులు ఇవ్వడం, పొందడం అనేది భారతీయ పండుగలలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఈ విషయాన్ని, ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం "ఫ్లిప్కార్ట్" మీకు సులభతరం చేసింది. ముఖ్యంగా ఈ ఇ-కామర్స్ వెబ్సైట్ తన "ఫెస్టివ్ ధమాకా సేల్" ఆఫర్స్ అమ్మకాలతో తిరిగి ముందుకు వచ్చింది. క్రమంగా మీరు మీ ప్రియమైనవారి కోసం నూతన ఉత్పత్తులను తక్కువ ధరలకే కొనుగోలుచేసే అవకాశముంటుంది. ప్లిప్ కార్ట్ అందుబాటులో ఉన్న వేలకొలదీ ఉత్పత్తుల్లో, దీపావళి బహుమతుల కోసం ఎంచుకోదగిన వాటిలో స్మార్ట్ఫోన్లు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాయి. వాటిలో Realme తాజా స్మార్ట్ఫోన్లు ఈ దీపావళి మహోత్సవం సమయంలో ఇవ్వదగిన గొప్ప బహుమతిగా చెప్పవచ్చు.

భారతీయ మార్కెట్లో అనతికాలంలోనే ఇంతకుముందెన్నడూ చూడని సరసమైన ధరలకే ఉత్తమ ఫీచర్లను కలిగి, వినియోగదారుల ఆదరాభిమానాన్ని చూరగొన్న Realme మిగిలిన అన్ని బడ్జెట్, ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లని తోసి రాజులా ముందుకు సాగిపోతుంది.

realme smartphones

దాని బిల్డ్- క్వాలిటీ, అత్యుత్తమ కెమరా పనితనం, స్పీడ్, మరియు అద్భుతమైన బాటరీ పర్ఫార్మెన్స్ కూడుకుని వినియోగదారుల విశ్వసనీయతను కాపాడుకుంది. అన్ని వర్గాలవారిని, అన్ని తరగతుల వారిని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకే రియల్ మిని అందుబాటులో ఉంచడం ఆహ్వానించదగిన విషయం. మీరు నాణ్యత గురించి రాజీపడకూడదని కోరుకుంటూ, మీ బడ్జెట్ మార్క్ దాటకూడదు అని భావిస్తున్నవారైతే, Realme మీకు బెస్ట్ బ్రాండ్ చాయిస్ అని చెప్పవచ్చు.ఈ సంస్థ ఇటీవలే పర్ఫార్మెన్స్ ఆధారిత బడ్జెట్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఇవి ఫ్లిప్కార్ట్లో "ఫెస్టివ్ ధమకా సేల్" లో భాగంగా ప్రత్యేకంగా అందుబాటులో ఉండన్నాయి.

ఈ జాబితాలో Realme C1, Realme 2 , Realme 2 ప్రో ప్రధానంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు వాటి వాటి అత్యద్భుతమైన లక్షణాలతో, ఆయా ధరలలో మీకు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయనడంలో ఆశ్చర్యమే లేదు. వాటి వివరాలను ఒకసారి చూడండి.

Realme C1 ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త రాజుగా వెలిగిపోతుంది. దీని ధర రూ.6,999, అయినా ఇది 4230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని స్నాప్డ్రాగన్ 450 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2GB RAM మద్దతుతో కూడుకుని ఎటువంటి లాగ్స్ లేకుండా ఉత్తమమైన పనితీరును నిర్ధారిస్తుంది. 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో కూడుకుని ఉన్న ఈ స్మార్ట్ఫోన్, దాని ధర పరిధిలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా, 256 GB మెమరీ వరకు విస్తరించదగినదిగా కూడా ఎక్స్పాన్డబుల్ మెమరీ దీని సొంతం. 13 MP + 2 MP యొక్క డ్యూయల్ రేర్ కెమరా సెటప్ కలిగి, 5MP ఫ్రంట్ కెమరా కలిగి పదునైన చిత్రాలను ఇవ్వగలిగేలా రూపొందించబడింది. ఇంత తక్కువ ధరలో కూడా ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉండడం నిజంగా ఆశ్చర్యపరచే విషయమే అని చెప్పాలి. ఫోన్ టచ్ స్క్రీన్ 6.2 ఇంచెస్ వైడ్ డిస్ప్లేతో వస్తుంది.

ఈ బ్రాండ్ మరొక సమర్పణ, Realme 2, రెండు శక్తివంతమైన వైవిధ్యభరితమైన వేరియంట్లతో వస్తుంది. 3GB RAM + 32GB మరియు 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో ఇంటర్నల్ స్టోరేజ్, మెమరీ కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు విస్తరించదగినదిగా ఉంటుంది. Realme 2, 1.8 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్ కలిగి అద్భుతమైన పనితీరును కనపరచేలా రూపొంచించబడింది. క్రమంగా మంచి గేమింగ్ అనుభూతిని కూడా అందివ్వగలదు. 13MP + 2MP రేర్ కెమెరా సెటప్ కలిగి, సెల్ఫీ ప్రేమికులకు 8 MP తో కూడిన ఫ్రంట్ షూటింగ్ షూటర్ ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ సిమ్ మద్దతుతో కూడుకుని ఉంటుంది. ఫేస్ అన్లాక్, ఫింగర్ప్రింట్ స్కానింగ్ సహా అన్నిరకాల బేసిక్ సెన్సార్లలో కూడుకుని వినియోగదారుల అంచనాలను మించి ఉంటుంది. అంతేకాకుండా 168 గ్రాములు బరువున్న సొగసైన స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

Realme 2 తాజా వెర్షన్, Realme 2 ప్రో 6.3 అంగుళాల పొడవును కలిగి, ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా బడ్జెట్ సెగ్మెంట్లోనే డ్యూడ్రాప్ స్క్రీన్ అందించే మొట్టమొదటి స్మార్ట్ఫోన్ ఇది. తాజా ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తుంది. అత్యంత ప్రభావవంతమైన చిప్సెట్ అయిన సుప్రీం ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 600 చిప్సెట్ కలిగి అత్యంత శక్తివంతంగా ఉంది. మల్టీటాస్కింగ్ నిర్వహణకు సంబంధించి, స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేందుకు మీ అభిరుచులకు తగినట్లుగా మూడు వేర్వేరు RAM రకాల్లో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.

realme 2 ప్రో 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్లో మాత్రమే కాకుండా శక్తివంతమైన 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో కూడా వస్తుంది. అది కూడా మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్లోనే. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అత్యత్తమ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. Realme 2 ప్రో మిమ్ములను ఫోటోగ్రాఫర్స్ చేయగలదు అనడంలో అతిశయోక్తి లేదు. 16 MP + 2 MP రేర్ కెమెరా సెటప్ కలిగి, అన్ని రకాల లైటింగ్ కండిషన్లలో శక్తివంతమైన మరియు ప్రకాశవంతమైన చిత్రాలను ఇవ్వగలదు. Realme 2 ప్రో రేర్ కెమెరా ఐఎంఎక్స్ 398 తో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సామర్ధ్యాలను కలిగి ఉంటుంది, ఇది వన్ ప్లస్ 5T వలె ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా మీ సోషల్ నెట్వర్కింగ్ స్టోరీస్ కోసం అత్యుత్తమ సెల్ఫీలను అందివ్వగలదు.

ధర, లభ్యత :

అక్టోబర్ 24 న ప్రారంభమై, అక్టోబర్ 28 వరకు కొనసాగుతున్న దీపావళి "ఫెస్టివ్ ధమకా సేల్" సమయంలో ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్స్ ధరల వివరాలు.

• Flipkart.com లో కేవలం రూ.6,999 మాత్రమే Realme సి1 స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ సేల్ అక్టోబర్ 24, 2018న 2 PM నుండి ప్రారంభమవుతుంది.
• Realme 2 మరియు Realme 2 ప్రో సేల్ అక్టోబర్ 24, 2018న అర్ధరాత్రి 0:00 గంటలకు ప్రారంభమవుతుంది.
• అంతేకాకుండా, అమెజాన్.ఇన్ లో కూడా RealMe 1 ప్రత్యేకంగా రూ.9,990 ధరకు 4GB RAM + 64GB ROM వేరియంట్, శక్తివంతమైన 6GB RAM + 128GB ROM వేరియంట్ రూ. 11.990 రూపాయలకు లభ్యంకానుంది. హీలియో P60, 6GB RAM + 128 GB ROM తో ఉన్న Realme 1, 12000 రూపాయలలోపు నిస్సందేహంగా ఎంచుకోదగిన ఉత్తమ ఎంపికలలో ఒకటిగా ఉంది.

realme smartphones

Realme 2 పొందాలని ఆలోచన చేస్తున్నవారికి, అక్టోబర్ 24, 2018 అర్ధరాత్రి ఫ్లిప్కార్ట్లో డైమండ్ బ్లూ Realme 2 యొక్క స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని తెలియజేయడమైనది.

ఆఫర్స్ గురించిన పూర్తి వివరాలు :

Realme 2 Pro Realme 2

Realme C1

Open-sale date 0:00 hrs Oct 11 0:00 hrs Oct 11 12 noon Oct 11
AXIS 10%-discount price Starting from Rs.12591 Starting from Rs.8091 Rs.6999
Complete mobile protection Rs.99 Rs.99 Rs.99
Buyback guarantee 70% 50% for all brands No
No-cost EMI Yes Yes Yes
Jio offer Up to Rs.4450 Up to Rs.4200 Up to Rs.4450
Exchange offer Minimum Rs.500 for all brands Minimum Rs.500 for all brands No
Free case cover and screen protector Yes Yes Yes

మీకు ఇంకనూ Realme స్మార్ట్ఫోన్ల సరికొత్త శ్రేణిని కొనుగోలు చేసేందుకు తగినన్ని కారణాలు కనపడని ఎడల, మార్కెట్లో మరో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్తో Realme C1 స్మార్ట్ఫోన్ కు పోలిక ఉంది - అదే Redmi 6A.

ఈ ధరలో Realme C1 పోటీలో మైళ్ల దూరం ముందు ఉందనే చెప్పవచ్చు. Redmi 6A తో పోల్చినప్పుడు అది 5.45-అంగుళాల స్క్రీన్తో వస్తుంది, కానీ Realme సి1 6.2 అంగుళాల స్క్రీన్ కలిగి 720 x 1520 పిక్సల్స్ రిసల్యూషన్ కూడుకుని వస్తుంది. క్రమంగా మల్టీమీడియా వినియోగానికి మంచి స్మార్ట్ఫోన్ వలె పనిచేస్తుంది. అంతేకాక, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఆకట్టుకునేలా 81.2% స్క్రీన్-టు-బాడీ రేషియోలో Realme సి1 ఆకర్షణీయంగా ఉంటుంది. రియల్మీ C1 తో పోల్చినప్పుడు, Redmi 6A 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. కావున ఆ ధరలో realme C1 గుడ్ చాయిస్ అవుతుందని చెప్పవచ్చు.

realme smartphones

స్నాప్డ్రాగన్ 450 CPU మద్దతుతో మీరు realme C1తో మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందగలరు. Redmi 6A మీడియా టెక్ హీలియో A22 చిప్సెట్ శక్తిని కలిగి ఉంటుంది. Redmi 6A తో పోల్చినప్పుడు Realme C1 కెమెరా పనితనంలో కూడా మెరుగైన షూటర్ అనిపించుకుంటుంది. Realme C1 డ్యూయల్ లెన్స్ కెమెరా హార్డ్వేర్ డ్రివెన్ బొకె ఎఫెక్ట్ కలిగి అద్భుతమైన పనితీరు ప్రదర్శించగలదు. అయితే రెడ్మి 6A కేవలం ఒక కెమెరాను మాత్రమే కలిగి ఉండడం చేత, realme C1 వలె పోట్రైట్ షాట్స్ తీయలేదు. Redmi 6A లో తక్కువగా 3000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది, కానీ, రియల్మీ C1 రెడ్మీ 6A కన్నా మెరుగ్గా, 4230mAh సామర్ధ్యంతో కూడిన బ్యాటరీ యూనిట్ మద్దతుతో కూడుకుని ఉంటుంది.

ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ? అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఉత్సవానికి సిద్దం కండి. క్రమంగా మీ పండుగలను మరింత ప్రత్యేకమైనవిగా మలచండి.

English summary

Gift Your Loved Ones The Best Smartphone This Diwali

The brand Realme is making all the right buzz in the Indian markets due to its credibility to churn out feature-rich smartphones at amazing prices. Moreover, it has appealed to every age group, offering phones in every price segment. If you do not want to compromise on the quality but want to stay within your budget, Realme is the brand for you.
Story first published: Friday, October 26, 2018, 15:23 [IST]
Desktop Bottom Promotion