For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎడమ చేతిలో ఉండే గార్డియన్ ఏంజిల్ రేఖ సూచించే విషయాలు మీకు తెలుసా?

  |

  గార్డియన్ ఏంజెల్ రేఖ మీ అరచేతుల్లో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మీ అరచేతిని పరిశీలిస్తే అర్థమవుతుంది.

  పాల్మిస్ట్రీ అనేది పురాతన కళ. ఇది భారత దేశంలోనే ఉద్భవించిందని తెలుస్తోంది. అప్పటి నుంచి, ఇది చైనా, ఈజిప్టు, గ్రీస్ మరియు యూరోప్ కు వ్యాప్తి చెందింది. పాల్మిస్ట్రీని మూఢనమ్మకంగా కొట్టిపారేసేవారు ఉన్నా కూడా దీనిని పురాతన శాస్త్రమని నమ్మేవారూ లేకపోలేరు.

  "ఎంతో మంది వైద్యులు అలాగే సైకాలజిస్ట్ లు ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు అరచేతుల్లోని రేఖలను చూడటం ద్వారా ఒక వ్యక్తి ఒక్క వ్యక్తిత్వం, ఆరోగ్యం మరియు సైకలాజికల్ స్థితుల గురించి గమనించవచ్చని తేల్చారు."

  guardian angel line on your palm

  ఇప్పటి వరకు మనం హార్ట్ లైన్, హెడ్ లైన్, లైఫ్ లైన్ మరియు ఫేట్ లైన్ వంటి నాలుగు ముఖ్య రేఖల గురించే తెలుసుకున్నాం. ఇవి ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క లక్షణాలని, సంబంధ బాంధవ్యాలని, జీవిత గమ్యాలని నిర్దేశిస్తాయి తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలో గార్డియన్ ఏంజెల్ లైన్ అనేది ప్రాచుర్యం పొందుతోంది. ఇది మన చుట్టూ మంచి ఎనర్జీ ఉందని తెలియచేస్తుంది.

  1. గార్డియన్ ఏంజెల్ లైన్

  1. గార్డియన్ ఏంజెల్ లైన్

  ఈ రేఖలు అరుదుగా ఉంటాయి. శక్తివంతమైనవి. కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులు చనిపోయినప్పుడు ఈ రేఖలు ఎడమ చేతిలో ఏర్పడతాయి. ఈ లైన్ అనేది మీతో పాటు వారి ఆత్మ ప్రయాణిస్తోంది అని చెప్పేందుకు చిహ్నంగా ఏర్పడతాయి.

  ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఈ రేఖలు ఎడమ అరచేతిలో కనిపిస్తాయి. ఇవి మీకు దగ్గరివారు మరణించినప్పుడు మాత్రమే ఏర్పడతాయి. వారి ఆత్మ మీ చుట్టూనే తిరుగుతోందని తెలియచేస్తాయి ఈ రేఖలు. ఈ లైన్ అనేది అరుదుగా ఏర్పడుతుంది. ఈ రేఖను మీ చేతిలో గమనించకపోతే నిరాశచెందకండి.

  2. శక్తివంతమైనది

  2. శక్తివంతమైనది

  ఈ రేఖ అనేది అత్యంత శక్తివంతమైనది. మిమ్మల్ని ఒకరు బాగా గమనిస్తున్నారని ఈ రేఖ స్పష్టం చేస్తుంది. మీ నుంచి నెగటివ్ ఎనర్జీని పంపించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఈ రేఖ వెల్లడిస్తుంది. మీకు దక్కాల్సిన వాటిని మీకు దక్కేలా చేసేందుకు వారు ప్రయత్నిస్తారని తెలియచేస్తుంది.

  వారు ఈ లోకంలో లేకపోయినా కూడా వారి ఆత్మ మీతోనే ఏంజెల్ లా ప్రయాణం చేస్తోంది. కష్టకాలంలో మిమ్మల్ని ఆడుకుంటుంది.

  3. గార్డియన్ ఏంజెల్ ను లొకేట్ చేయడమెలా

  3. గార్డియన్ ఏంజెల్ ను లొకేట్ చేయడమెలా

  ఇప్పుడు మీరు ఆ రేఖను గుర్తించేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మొదటగా మీరు చేతులను శుభ్రంగా కడిగి వాటిని మాయిశ్చరైజ్ చేయండి. రోజంతా హడావిడిగా ఉండటంతో చేతులు రఫ్ గా మారతాయి. దుమ్మూ, ధూళి చేతులపై పేరుకుంటుంది. చేతిలోని రేఖలన్నీ గజిబిజిగా ఉంటాయి. కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తే రేఖలు కొంచెం స్పష్టతను పొందుతాయి.

  గార్డియన్ ఏంజెల్ అనే రేఖ లైఫ్ లైన్ (ప్రారంభంలో ఒక పారలెల్ లైన్) మరియు హెడ్ లైన్ ను జాయిన్ చేస్తూ పైపైకి వెళ్లే ఒక కర్వ్. ఇది ఎక్కడైతే హెడ్ లైన్ నుంచి విడిపోతుందో అది మీరు ఏ ఏజ్ లో మీరు మీ దగ్గరి వారిని కోల్పోతారో తెలియచేసేందుకు చిహ్నం.

  4. గార్డియన్ లైన్ ప్రాముఖ్యత

  4. గార్డియన్ లైన్ ప్రాముఖ్యత

  ఈ లైన్ యొక్క ప్రాముఖ్యం ఏంటంటే, మీరు గార్డియన్ ఏంజెల్ ను మీ అవసరానికి పిలిస్తే వారు తప్పక రెస్పాండ్ అవుతారు. ఇదే పామిస్ట్రీలోని గొప్పతనం. ఎన్నో రేఖలు జీవితం గురించి వివరిస్తాయి. ఈ విషయాన్ని నిపుణులు స్పష్టం చేశారు. మొత్తానికి మీ ఎడమ చేతిలో ఉండే గార్డియన్ ఏంజిల్ రేఖ ఈ విషయాలన్నీ సూచిస్తుంది.

  English summary

  Have a Guarding Angel line on your left palm? Find out what it means

  The Guardian Line this line is believed to be quite powerful, as it tells you that you have someone watching over you. There is someone who is making the effort to keep bad and evil things away from you and protects you if you have this line on your palm.
  Story first published: Tuesday, June 12, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more