For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కడ చేసిన తప్పుకు అక్కడే శిక్ష అంటారు కదా? ఇతని విషయంలో అదే జరిగింది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది మరి.

|

మనకు తరచుగా “నో స్మోకింగ్ జోన్స్” అని బోర్డులు కనిపిస్తుంటాయి. బహిరంగ ప్రదేశాలలో, పెట్రోల్ బంకుల్లో, హాస్పిటల్ పరిసరాల్లో మొదలైన ముఖ్య విభాగాలలో. కానీ ధూమపాన ప్రియులలో సగానికిసగం వీటిని విస్మరిస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కల వారిని పరోక్ష ధూమపానానికి గురిచేస్తూ వారి ప్రాణాలతో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, అవేర్నెస్ ప్రోగ్రాములను మీడియా ద్వారా జనాల్లోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వం మీద ప్రతివిమర్శలు చేస్తూ కాలం వెళ్ళదీస్తుంటారు. ఆసుపత్రి బెడ్ మీద కానీ జ్ఞానోదయం కలగదు ఇటువంటి వారికి.

పరోక్ష ధూమపానం కాసేపు పక్కన పెడితే, గ్యాస్ స్టేషన్లలో ధూమపానం వీరి ప్రాణాలకు కూడా ముప్పని తెలిసీ, అక్కడ కూడా ధూమపానానికి పూనుకుంటూ ఉంటారు కొందరు మహానుభావులు. మానసిక వైఫల్యమో లేక, ఏమీ కాదులే అన్న నిర్లక్ష్యధోరణి వలనో తెలీదు కానీ, ఎన్ని ప్రమాదాలు జరిగినా చలనం మాత్రం రావడం లేదు కొందరిలో అన్నది జగమెరిగిన సత్యం. ఉదాహరణకు కళ్ళ ముందే హెల్మెట్ వేసుకోక ప్రమాదాలబారిన పడుతున్న వారిని చూసి కూడా, హెల్మెట్ వినియోగించని కొందరు బైక్ రైడర్స్ వలె.

Man Got Instant Karma For Being A Jerk!

ఎక్కడ చేసిన తప్పుకు అక్కడే శిక్ష అంటారు కదా? ఈ వీడియోలో అదే జరిగింది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా.

ఇక వీడియో విషయానికి వస్తే, సిగరెట్ ఆపడానికి నిరాకరించిన ఒక వ్యక్తి పట్ల సహనం కోల్పోయిన గ్యాస్ స్టేషన్ వర్కర్, రూల్స్ అతిక్రమించిన ఇతని చేతిలోని సిగరెట్ ఆపే ప్రయత్నంలో భాగంగా చేసిన పని అనేకమందికి కనువిప్పు కలిగించడమే కాకుండా, ఇంటర్నెట్లో ఒక వైరల్ అయింది.

అసలేం జరిగిందంటే:

సి.సి.టీ.వీ ఫుటేజ్లో కనిపించిన వివరాల ప్రకారం, రష్యాలోని బల్గేరియా, సోఫియా ప్రాంతంలో ఒక గ్యాస్ స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్లోని వ్యక్తి బయట వ్యక్తులతో వాగ్వాదానికి దిగడం, సహనం కోల్పోయిన పనివారు అతనిపైన మంటలను ఆర్పివేసే గ్యాస్ పరికరంతో, సిగరెట్ ఆర్పడం వంటివి రికార్డ్ అయ్యాయి.

సిగరెట్ ఆపివేయడానికి నిరాకరిచడం కారణంగానే అతను ఈ పనికి పూనుకోవలసి వచ్చినట్లు నివేదికల ద్వారా తెలిసిన సమాచారం.

మొండిఘటాలకు సరైన గుణపాఠం చెప్పినట్లు ఈ గాస్ స్టేషన్ వర్కర్స్ చేసిన పనిని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రశoసిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? గ్యాస్ స్టేషన్ వర్కర్ చేసిన పని సరైనదే అని భావిస్తున్నారా.

మద్యపానం తన మరియు తన కుటుంబాన్ని మాత్రమే నాశనం చేస్తే, ధూమపానం చుట్టుపక్కల వారి మీద కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆఖరికి పసిపిల్లలను ముద్దు చేసే క్రమంలో కూడా ధూమపానాన్ని వీడడం లేదు. మావరకు ఇటువంటి చర్యలు ఎంత పెరిగితే అంత మంచిదని భావిస్తున్నాము. క్రమంగా ఇతరులకు హాని కలిగేలా ధూమపానానికి పూనుకునేవారి ఆలోచనలలో మార్పు వస్తుందన్న అభిలాష.

“ప్రత్యక్ష మరియు పరోక్ష ధూమపానం మీకే కాదు మీ ప్రియమైన వారి ఆరోగ్యానికి కూడా హానికరం”

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Man Got Instant Karma For Being A Jerk!

When you read a board that states "no smoking in this area", it does mean there is a reason they do not wish you to do so!One such place is a gas station or a petrol pump where we know that smoking at these places can be hazardous; however, there are those douche bags who wish to break the laws to stay cool and end up in a tragic situation!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more