For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 ప్రతి ఒక్కరికీ లక్కీ నంబర్, ఎందుకో తెలుసా?

|

భారత క్రికెటర్, మాజీ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీద నంబర్ 7 ప్రభావాన్ని మనం చూశాం. అయినప్పటికీ, అతని విజయవంతమైన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితం యొక్క ప్రధాన క్రెడిట్, స్పష్టంగా అతని కృషి, మరియు పట్టుదలకే వెళుతుంది. అయితే మరచిపోకూడని అంశం కూడా ఉంది, అదే నంబర్.

న్యూమరాలజీ 7 మరియు దాని శక్తి:

న్యూమరాలజీ 7 మరియు దాని శక్తి:

కొందరు వ్యక్తులు వారి పుట్టిన తేదీ సంఖ్యలను వారి అదృష్ట సంఖ్యలుగా గుర్తించారు, కానీ న్యూమరాలజీ ప్రకారం, నంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా లక్కీ నంబర్ వలె పరిగణించబడుతుంది. ఈ ప్రపంచంలో అనేకమంది తమ తమ వృత్తి, మరియు జీవన సంబంధిత అంశాలలో ఈ అంకెకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చి, అనేక లాభాలను గడించారు కూడా.

7 యొక్క సానుకూల శక్తి ప్రభావాలు :

7 యొక్క సానుకూల శక్తి ప్రభావాలు :

ప్రతి సంఖ్య దాని స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లు మీరు ఇదివరకే తెలుసుకున్నారు, కానీ 7అంకెకు ఉన్న ప్రాముఖ్యత మిగిలిన ఏ అంకెకు కూడా లేదు. నేడు, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతల దృష్ట్యా , ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమిస్తుందో మీకు తెలియజేస్తున్నాము. మరియు ఈ నంబర్ ఎక్కువగా అనుసరించే వారిపట్ల, చూపే అసాధారణమైన సానుకూల ప్రభావాల గురించి తెలుసుకోడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది.

7 నంబర్ తరచుగా వస్తున్న ఎడల :

7 నంబర్ తరచుగా వస్తున్న ఎడల :

న్యూమరాలజి, ఆధ్యాత్మికతతో కలిసినప్పుడు, ఇది అనేక సూచనలుగా రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి యొక్క జీవన మార్గంలో, పునరావృతoగా తరచుగా వస్తున్న ఎడల, తేలికగా తీసుకోకూడదు. ఇవి భవిష్యత్తులో అనేక సానుకూల అంశాలకు సూచనలుగా ఉండగలవు.

7 నంబర్ వలన కలిగే ఆద్యాత్మిక ప్రయోజనాలు:

7 నంబర్ వలన కలిగే ఆద్యాత్మిక ప్రయోజనాలు:

ఆధ్యాత్మిక విషయాల ప్రకారం, నంబర్ 7 సత్యాన్ని అన్వేషిస్తుంది; ముఖ్యంగా ఈ నంబర్ ఏ మతానికీ సంబంధించినదిగా ఉండదు, అన్ని మతాల వారికీ అనుకూలమైన నంబర్ వలె ఉంటుంది. దీనిని అనుసరించే వారికే దీని యొక్క ప్రభావవంతమైన శక్తి గురించి తెలుస్తుంది. మీ జీవన మార్గాన, ఈ అంకె యొక్క పునరావృతము ఏమి సూచిస్తుందో తెలుసుకోవడానికి, ఈ వ్యాసం దోహదపడుతుంది .

 నంబర్, చివరికి వారి లక్ష్యాన్ని సాధించడానికి సహాయం చేస్తుంది.

నంబర్, చివరికి వారి లక్ష్యాన్ని సాధించడానికి సహాయం చేస్తుంది.

ఒక వ్యక్తి తరచూ తన జీవిత ప్రయాణంలో ఈ 7 అనే నంబర్ పునరావృతమవడాన్ని చూసినట్లయితే, అతను / ఆమె ఇప్పటి వరకు సరైన మార్గంలో ఖచ్చితంగా ఉండే ఉంటారు, మరియు అదే మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. ఈ నంబర్, చివరికి వారి లక్ష్యాన్ని సాధించడానికి సహాయం చేస్తుంది.

 వ్యాపార కార్యక్రమాలలో నంబర్ 7

వ్యాపార కార్యక్రమాలలో నంబర్ 7

ఒకవేళ వ్యక్తి తరచుగా తన వ్యాపార కార్యక్రమాలలో నంబర్ 7 ను తరచుగా ఎదుర్కొంటున్నట్లయితే, నెలలో 7 వ తేదీన గడువుతో కూడిన ప్రాజెక్టులను పొందడం, ప్రాజెక్ట్ పూర్తవడం లేదా అదే విధంగా 7 అనే అంకె ప్రభావం కనపడేలా వేతనంతో డబ్బును పొందడం మొదలైనవి పునరావృతమవుతూ కనిపిస్తాయి. ఇటువంటి అంశాలు, వృత్తిపరమైన లక్ష్యాలనందు విజయం సాధించడానికి మీకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పబడింది. మీరు తరచుగా పునరావృతమయ్యే అంశాలను నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి.

నంబర్ 7 ను ఎక్కువగా అనుసరించే వారు,

నంబర్ 7 ను ఎక్కువగా అనుసరించే వారు,

నంబర్ 7 ను ఎక్కువగా అనుసరించే వారు, ఎల్లప్పుడూ మంచి సామర్ధ్యంతో, అదృష్టంతో కూడుకుని ఉంటారు. ప్రత్యేకంగా, 777 లేదా ఈ సిరీస్ ఉండేలా తమ జీవితంలో ఏవైనా అంశాలు తారసపడినట్లయితే, దైవానుగ్రహముగా భావించబడుతుంది. మరియు జీవితంలోని ప్రతి దశలో సహాయపడుతూ, ఎటువంటి దురదృష్టం చెంత చేరకుండా కాపాడగలదు. అందుచేతనే ఎక్కువగా, తమ వాహనాల నంబర్ 7 తో ఉండేలా ఎంచుకుంటూ ఉంటారు.

నంబర్ 7 యొక్క వ్యక్తిత్వ లక్షణాలు:

నంబర్ 7 యొక్క వ్యక్తిత్వ లక్షణాలు:

జ్యోతిషశాస్త్రంలో, నంబర్ 7 నెప్ట్యూన్ గ్రహానికి అధిక ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది ముఖ్యంగా చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. కావున ఈ నంబర్ అనుసరించే వారు అత్యంత స్వతంత్రులుగా ఉంటారు. దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు, మరియు కృషి, పట్టుదల, నిబద్దత అధికంగా కలిగిన వారై ఉంటారు. వారి అవిశ్రాంత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి లక్ష్యాలలో అవరోధాలు కలిగించాలని ప్రయత్నించినా, అది వారి ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయలేదు.

నంబర్ 7 మరికొన్నివ్యక్తిత్వ లక్షణాలు:

నంబర్ 7 మరికొన్నివ్యక్తిత్వ లక్షణాలు:

ఈ సంఖ్యను అనుసరించే వారు, సత్యవాక్కు కలిగి ఉంటారు, మరియు నిరంతర విద్యార్ధివలె ఆలోచనలు చేస్తుంటారు. ఎటువంటి విషయాలలో అయినా నిజానిజాలు తెలుసుకోకుండా ప్రవర్తించడం వీరికి నచ్చని అంశంగా ఉంటుంది. ఒక శాస్త్రీయ దృక్పధంతో కూడిన వ్యక్తిత్వంతో మరియు సమాధానాల కోసం నిరంతర అన్వేషణలు చేస్తూ అవిశ్రాంత కృషిని కలిగి ఉంటారు. వారు తార్కిక విషయాలను, వాదనలను మరియు ఇతర ప్రాపంచిక విషయాలను పరిశోధించడానికి ఉత్సాహం కలిగి ఉంటారు. మరియు ఒక శాస్త్రవేత్త, న్యాయ సలహాదారు, పెట్టుబడిదారు, మంత్రి లేదా టీచర్ వంటి వృత్తులలో ఎక్కువగా కొనసాగుతుంటారు.

English summary

Here's why number 7 is 'Lucky' for all

In spirituality, number 7 symbolizes the seeker of truth; the number itself isn’t committed to any religion, but those who follow its grace are devoted to a singular power. To know what seeing the repetition of this number signifies, keep reading…
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more