TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మీ చేతి వేళ్ళ పొడవు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయా?
మీ చేతి వేళ్ళ పొడవు ఆధారంగా ఇతరులు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోగల అవకాశం ఉంది. ఇక్కడ ఇమేజ్ లో మీకు 3 చేతుల బొమ్మలు చూపబడ్డాయి. , A,B,C లతో సూచించబడి.
ప్రతి ఒక్క దానిలో ఉంగరపు వేలు , చూపుడు వేలు మరియు మద్యవేలు కాస్త భిన్నమైన లేదా సమానమైన పొడవు కలిగి ఉన్నాయి. మీ ఎడమ చేతితో ఈ మూడింటినీ పోల్చి చూసి సరైనడాన్ని ఎన్నుకోండి.
చాలామంది దీనిని కొట్టిపారేస్తుంటారు, కానీ ఫలితాలు చూసినవారు మాత్రం దీనిలో మర్మ తెలుసుకుంటారు. ఇక్కడ కొన్ని సాంకేతిక ఆధారాలతో కూడా నిరూపితమై ఉంటాయి. ఆ విషయాన్ని మాత్రం మరచిపోవద్దు.
Phrenology ద్వారా ఈ విషయాలను గూర్చి విశదీకరించబడినది. నిజానికి ఈ Phrenology మనుషుల పుర్రె, మరియు ఎముకల నిర్మాణం ద్వారా వ్యక్తిత్వాన్ని చెప్పగలిగే సైన్స్.
దీని ద్వారా మీ వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకోండి:
A : ఆకర్షణీయంగా మరియు కార్యసాధకులుగా :
ఒకవేళ మీ చేతి ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా పెద్దదిగా ఉంటే మీరు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. మరియు ఎటువంటి పరిస్థితులలో అయినా అంతర్ముఖునిగా వ్యవహరిస్తుంటారు అనగా వీరిలో వీరే మాట్లాడుకోవడం, తమ అంతరాత్మతో చర్చలు చేయడం వంటివి చేస్తుంటారు.
మరియు వీరు దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉంటారు, అనేకమైన సమస్యలకు పరిష్కార మార్గంగా కూడా ఉంటారు. కావున సైంటిస్ట్, ఇంజినీర్, సోల్జర్,క్రాస్ వర్డ్ , చెస్ మాస్టర్ లుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
B : ఆత్మస్థైర్యం పట్టుదల కలిగిన వ్యక్తులు వీరు :
ఒకవేళ ఉంగరపు వేలు , చూపుడు వేలు కన్నా చిన్నదిగా ఉంటే, వీరు ఆత్మస్థైర్యం కలిగి పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు.
ఏదైనా పని చేయునప్పుడు ఒంటరిగా ఆ పని పూర్తిచేయునట్లుగా ఉంటారు, అలాగని వీరు అందరికీ దూరంగా ఉంటున్నట్లు కాదు. పని మీద అంత పట్టుదల కలిగిన వారుగా ఉంటారు. లక్ష్యసాధన దిశగా వీరి పయనం కొనసాగుతూ ఉంటుంది. ఇతరులు వీరి దిశలో అడ్డు రావడాన్ని సహించలేరు.
ఉన్నదానితో సంతృప్తి చెందడం, పట్టుదలతో ప్రయత్నించి సాధించుకోవడం వీరి లక్షణాలుగా ఉంటాయి.
C : మానసిక శాంతి కై :
ఉంగరపు వేలు, చూపుడు వేలు సమాంతరంగా ఉన్న వీరు అధికంగా మనశ్శాంతి కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఎక్కువగా వ్యవస్థీకృత ఆలోచనలు చేస్తుంటారు. ఎక్కువగా తమ భాగస్వాముల పట్ల శ్రద్దతో, ప్రేమగా ఉంటారు. కానీ వీరికి వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకుంటే , వీరిలో రెండవ కోణం కూడా కనిపిస్తుంది. ఆ కోణం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. కావున వీరికి వ్యతిరేక ఆలోచనలు చేసే ప్రయత్నాలు చేయకుండా మంచి వైపే ఉండునట్లు చూసుకోవాలి.