For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాజీ హీరోయిన్ రమ్య చూపంతా ప్రధాని మోదీపైనే ఎందుకో తెలుసా? అక్కడ మొత్తం దివ్యస్పందన హస్తమే !

శాండల్‌వుడ్ నటీమణి రమ్య అలియాస్ దివ్యస్పందన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.రమ్య, కాంగ్రెస్ సోషల్ మీడియా, దివ్య స్పందన రమ్య, రమ్య ట్విట్టర్, రమ్య పేటీఎం, రమ్య నరేంద్ర మోదీ, రమ్య రాహుల్ గాంధీ

|

శాండల్‌వుడ్ నటీమణి రమ్య అలియాస్ దివ్యస్పందన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకటీ రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించిన రమ్య కన్నడ నాట స్టార్ పొలిటీషియన్. ఒక దశలో దేశంలోని యంగెస్ట్ ఎంపీల్లో ఒకరిగా నిలిచిందీమె. మండ్యా స్థానం నుంచి ఉప ఎన్నికలో ఎంపీగా గెలిచి అప్పట్లో సంచలనం రేపింది. పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన రమ్య గత సార్వత్రిక ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయింది.

పొలిటికల్ కామెంట్లతో

పొలిటికల్ కామెంట్లతో

రమ్య తరచూ తన పొలిటికల్ కామెంట్లతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వారిపై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై రమ్య ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాను రమ్య ఉపయోగించనట్లు ఎవరూ ఉపయోగించరేమో.

పార్టీనీ ఎలా ప్రచారం చేసుకోవాలో

పార్టీనీ ఎలా ప్రచారం చేసుకోవాలో

గతంలో ఒకసారి కొంతమంది యూత్ తో సమావేశమై సోషల్ మీడియా ద్వారా పార్టీనీ ఎలా ప్రచారం చేసుకోవాలో తెలిపిన విధానం చూస్తే అందులో ఆమె ఆరి తేరినట్లు కనిపిస్తుంది. ఏకంగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మన పార్టీ గురించి ఒక రేంజ్ లో ప్రచారం చేద్దామని రమ్య పిలుపునిచ్చిన వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.

ఓటు హక్కును వినియోగించుకోకపోవడం

ఓటు హక్కును వినియోగించుకోకపోవడం

ఇలాంటి నేపథ్యం ఉన్న రమ్య ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ వాళ్లకు దొరికింది. తాజాగా కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడంతో రమ్య విమర్శల పాలైంది. మండ్యాలోని కేఆర్ రోడ్డులో, పీఎల్డీ పోలింగ్ బూత్‌లో రమ్య ఓటు ఉందట. దాన్ని ఈమె వినియోగించుకోలేదని తెలుస్తోంది.

బిజీగా

బిజీగా

ఎక్కడ బిజీగా ఉండిందో కానీ, రమ్య ఓటు వేయాలేదట.ప్రధాని మోడీతో సహా అందరి బాధ్యతల గురించి ప్రశ్నించే రమ్య ఒక ఓటర్‌గా ఓటు హక్కును వినియోగించుకునే తన బాధ్యతను పూర్తి చేయకపోవడంపై విమర్శలు బాగానే వచ్చాయి.

వ్యంగ్యాస్త్రం

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తరచూ రమ్య వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడూతూ ఉంటుంది. తాజాగా ఈమె ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది.

అతిపెద్ద డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం అస్త్రంగా ఈ మాజీ హీరోయిన్ ట్విటర్లో విమర్శలు సంధించి దుమారం రేపింది.

పే టు మోదీ

పేటిఎం అంటే ‘‘పే టు మోదీ'' అని అర్ధం వచ్చేలా ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. లోగోపై బీజేపీ గుర్తు కమలంతో పాటు ‘‘పే టు మోదీ కరో'' (మోదీకి డబ్బు చెల్లించండి..'') అంటూ ట్యాగ్‌లైన్ జతచేసింది. ‘‘పేటిఎం పేరుతో మీ డబ్బుమోదీ జేబులోకి వెళ్తున్నట్టుగానే.. ఆ యాప్‌ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది..'' అంటూ రమ్య వ్యాఖ్యానించింది.

మోదీధరించిన లోరో పియానా జాకెట్

మోదీధరించిన లోరో పియానా జాకెట్

ఇక కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి మొదటిసారి కర్ణాటకకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అప్పట్లో రమ్య సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది. మోదీధరించిన లోరో పియానా జాకెట్ చాలా బాగుంది. అది 17,000 యూరోలు ఉంటుంది. చాలా చీఫ్ కదా.. ఎవరి క్రెడిట్ కార్డులో తీసుకున్నారో అంటూ అప్పట్లో ఒక సంచలన ట్వీట్ రమ్య చేశారు.

హీరోయిన్ రమ్య హస్తమే

హీరోయిన్ రమ్య హస్తమే

ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అన్నివిధాలుగా అండగా రమ్య నిలబడుతోందని ఒక ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు ఫోలోవర్స్ పెరగడం వెనక ఈ మాజీ హీరోయిన్ రమ్య హస్తమే ఉందంటున్నారు. రమ్య రాహుల్ గాంధీకి క్లోజ్ ఫ్రెండ్ కూడా. అందుకే రమ్యకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు రాహుల్.

ఎంపీగా ఎన్నికయ్యారు

ఎంపీగా ఎన్నికయ్యారు

2012లో రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరింది. తరువాత కర్ణాకటలోని మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ట్విట్టర్‌లో రమ్యకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె చేసే ట్వీట్లు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఎక్కువగా మోదీని టార్గెట్ చేసి ఈమె చేసే ట్వీట్స్ వైరల్ అయిపోతుంటాయి.

దివ్య స్పందన

రమ్య ఇప్పుడు కాంగ్రెస్‌ డిజిటల్ కమ్యూనికేషన్స్‌కి అధినేత్రి. ఇక రమ్య అసలు పేరు.. దివ్య స్పందన. సినిమాల్లో నటించడం మొదలెట్టాక.. రమ్యగా పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఈమె రాకముందు.. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ , ఫేస్ బుక్ పేజీలకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు.

కలిసి నటించారట

కలిసి నటించారట

గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించిందని...అందులో రమ్యతో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిసి నటించారు కూడా. ఈ వీడియోలో రాహుల్, రమ్య, నవీన్ జిందాల్, ప్రియాదత్‌లు నటించారు. రాహుల్ గాంధీ యువ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రమ్య ఈ ప్రయత్నం చేయించారట.

ఇక ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్యకు సంబంధించిన విషయాలు బయటపడేలా చేసింది కూడా రమ్యనే.

ప్రధాని మోదీపైనే

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బీజేపీకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడానికి రమ్య అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మొత్తానికి మాజీ హీరోయిన్ రమ్య టార్గెట్ మొత్తం ఎప్పుడూ ప్రధాని మోదీపైనే ఉంటుంది. కాంగ్రెస్ ను హైలెట్ చేయడం కోసమే రమ్య ప్రధానిపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంటుంది.

English summary

How Divya Spandana Has Turned Around Congress's Social Media Game

How Divya Spandana Has Turned Around Congress's Social Media Game
Story first published:Friday, June 1, 2018, 9:54 [IST]
Desktop Bottom Promotion