For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఏటీఎం కార్డు ఎవరికైనా దొరికితే పిన్ అవసరం లేకుండానే డబ్బులు డ్రా చేసేయొచ్చు,భార్యది భర్త వాడకూడదు

ఆన్‌లైన్‌లో మీ ఖాతా నుంచి డబ్బులను మరో ఖాతాకు బదిలీ చేయాలంటే బ్యాంకు మీ ఫోన్‌కు ఒక పాస్‌వర్డ్‌ను పంపుతుంది. దీన్నే ఓటీపీ అంటారు. ఏటీఎం కార్డు మోసాలు, డెబిట్ కార్డు మోసాలు, ఏటీఎం కార్డు హ్యాకింగ్

|

చాలా మంది నిబంధనలు తెలియకుండానే ఏటీఎం కార్డును ఎడాపెడా వాడేస్తుంటారు. దీంతో సమస్యల బారిన పడుతుంటారు. బెంగళూరు నగరంలోని జరిగిన ఒక సంఘటనకు కోర్టు ఇచ్చిన ఒక తీర్పే ఇందుకు నిదర్శనం. బెంగళూరు నగరంలోని మర్తనహళ్ళికి చెందిన వందన అనే మహిళ రూ. 25,000 సొమ్ము డ్రా చేసుకు రమ్మని తన ఎస్‌బీఐ ఏటీఎం కార్డును, పిన్‌ నంబర్‌ను భర్త రాజేష్‌కు ఇచ్చింది. రాజేష్‌ ఏటీఎం కార్డును వాడగా, డబ్బు రాలేదు కాని.. ఆ మొత్తం ఖాతాలో డెబిట్‌ అయినట్లు (అంటే డ్రా చేసినట్లు) వచ్చింది.

నాన్‌ ట్రాన్స్ ఫరబుల్‌

నాన్‌ ట్రాన్స్ ఫరబుల్‌

ఇది జరిగింది 2013 నవంబర్‌ 14న. ఈ వ్యవహారాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్ళారు దంపతులు. అయితే ఎస్‌బీఐ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎందుకంటే ఏటీఎం కార్డు నాన్‌ ట్రాన్స్ ఫరబుల్‌. అంటే వేరొకరికి ఇవ్వరాదు. ఏటీఎంని వాడింది వందన (ఏటీఎం కార్డు ఓనర్‌) కాదు కాబట్టి.. తాము ఆమె పిటీషన్‌ను స్వీకరించలేమని స్పష్టం చేసింది.

గర్భిణీగా ఉండడం వల్లే

గర్భిణీగా ఉండడం వల్లే

ఇక బెంగలూరులోని 4వ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌ను వందన ఆ్రశయించింది. ఆ సమయంలో గర్భిణీగా తాను కదలలేని స్థితిలో ఉన్నందువల్ల తన భర్తకు కార్డు ఇచ్చినట్టు వివరించింది. డబ్బు రాలేదని తెలిసిన వెంటనే రాజేష్‌.. బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారని వందన పిటీషన్‌లో పేర్కొంది.

ఏటీఎం మెషిన్ లో రూ. 25,000 అధికం

ఏటీఎం మెషిన్ లో రూ. 25,000 అధికం

ఎంతో కష్టపడి సంపాదించిన ఏటీఎం సీసీటీవీ ఫుటేజీని కూడా ఫోరమ్‌ ఎదుట పెట్టింది. అలాగే ఆర్‌టీఐ చట్టం ద్వారా సదరు ఏటీఎం మెషిన్ నుంచి సొమ్ము జమ, విత్‌డ్రాయల్‌ డేటాను కూడా సంపాదించింది. లెక్క ప్రకారం ఆ ఏటీఎం మెషిన్ లో రూ. 25,000 అధికంగా ఉన్నట్లు తేలింది.

పిన్‌ షేర్‌ చేసినందున

పిన్‌ షేర్‌ చేసినందున

అయితే సదరు ఏటీఎంలో అదనపు క్యాష్‌ లేదంటూ ఎస్‌బీఐ కోర్టుకు తెలిపింది. దీంతో వ్యవహారం అంబుడ్స్‌మన్‌ దగ్గరకు వెళ్ళింది. పిన్‌ షేర్‌ చేసినందున... ఈ పిటీషన్‌ను స్వీకరించనని అంబుడ్స్‌మన్‌ కూడా తేల్చారు. మూడున్నరేళ్ళు వందన కోర్టు చుట్టూ తిరిగారు.

పిన్‌ మరొకరితో షేర్‌ చేసుకోకూడదు

పిన్‌ మరొకరితో షేర్‌ చేసుకోకూడదు

ఏటీఎంలో జరిపిన లావాదేవీ సక్రమంగా ఉన్నట్లు ఎస్‌బీఐ రికార్డులు, లాగ్‌లతో సహా కోర్టుకు సమర్పించింది. ఎట్టకేలకు మే 29న కోర్టు వందన కేసును కొట్టివేసింది. ఆమె సెల్ఫ్ చెక్‌ లేదా ఆథరైజేషన్‌ లెటర్‌ ఇచ్చి సొమ్ము విత్‌డ్రా చేసుకోవాల్సిందని.. పిన్‌ను మరొకరితో షేర్‌ చేసుకోవడంతో ఆమె వాదన చెల్లదని కోర్టు తేల్చింది.

ఏటీఎం కార్డులను బ్లాక్‌ చేశాయి

ఏటీఎం కార్డులను బ్లాక్‌ చేశాయి

ఇక పెద్దనోట్ల రద్దుకు కొన్ని రోజుల ముందు బ్యాంకులు కొన్ని లక్షల ఏటీఎం కార్డులను బ్లాక్‌ చేశాయి. కారణం ఏటీఎం యంత్రాల ద్వారా వాటి సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారు. వారు ఆ కార్డులను క్లోన్‌ చేసి (మళ్లీ సష్టించి) డబ్బులు లాగేసే ప్రమాదం ఉందని అనుమానించిన బ్యాంకులు ముందు జాగ్రత్తగా కార్డులను బ్లాక్‌ చేశాయి. అప్పటికే 641 ఖాతాల్లో డబ్బులు కాజేశారు. ఒక్కసారిగా లక్షల కార్డులను బ్లాక్‌ చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.

మీ కార్డు దుర్వినియోగమైనట్లే లెక్క

మీ కార్డు దుర్వినియోగమైనట్లే లెక్క

సైబర్‌ నేరగాళ్లు కార్డు వినియోగంపై అంతగా అవగాహన లేని గ్రామీణ ప్రాంతాలపై దృష్టిసారిస్తుంటారు. ఆన్‌లైన్‌లో మీ ఖాతా నుంచి డబ్బులను మరో ఖాతాకు బదిలీ చేయాలంటే బ్యాంకు మీ ఫోన్‌కు ఒక పాస్‌వర్డ్‌ను పంపుతుంది. దీన్నే ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్‌) అంటారు. మీ ప్రమేయం లేకుండా మీ ఫోన్‌కి ఓటీపీ వస్తే.. మీ కార్డు దుర్వినియోగమైనట్లే లెక్క. వెంటనే బ్యాంకుకు ఫోన్‌ చేసి కార్డును బ్లాక్‌ చేయించాలి.

పిన్‌ ఎవరికీ చెప్పకూడదు

పిన్‌ ఎవరికీ చెప్పకూడదు

ఏటీఎంలలో మీరు నగదు డ్రా చేసేటపుడు పిన్‌ నంబరును ఎవరికీ తెలియకుండా.. ఎవరూ చూడకుండా ఎంటర్‌ చేయాలి. మీ కార్డును కూడా ఇతరులకు ఇవ్వకూడదు. పిన్‌ను ఎవరికీ చెప్పకూడదు. మీ కార్డు పోతే వెంటనే బ్యాంకుకు ఫోన్‌ చేసి బ్లాక్‌ చేయించాలి.

జాగ్రత్తగా వ్యవహరించాలి

జాగ్రత్తగా వ్యవహరించాలి

కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటపుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఫోన్‌.. మీ కంప్యూటర్‌ కాకుండా ఇతరుల ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా లావాదేవీలు చేయొద్దు. ఎందుకంటే వారు వివిధ సాఫ్ట్‌వేర్‌లతో మీ కార్డు, మీ పిన్‌ వివరాలను తెలుసుకునే ప్రమాదం ఉంటుంది. సైబర్‌ కేఫ్‌లు, పబ్లిక్‌ వైఫైల్లో కార్డు ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయొద్దు. సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా దృష్టిసారించేది వీటిపైనే.

మీ సిమ్‌ను క్లోన్‌ చేసి

మీ సిమ్‌ను క్లోన్‌ చేసి

ఎప్పుడూ క్రెడిట్‌.. డెబిట్‌ కార్డులను.. ఫోన్‌ను ఒకే చోట ఉంచవద్దు. మీ కార్డు.. ఫోన్‌ దొంగకు దొరికితే క్షణంలో మీ ఖాతాలో డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లించేస్తారు.మీ ఫోన్‌కి ఎక్కువ సేపు సిగ్నల్‌ లేకపోయినా కాల్స్‌ రాకపోయినా మీరు అనుమానించాలి. ఎందుకంటే మీ సిమ్‌ను క్లోన్‌ చేసి దాని ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి.. మీ డబ్బులను కాజేసే అవకాశం ఉంటుంది. ఫోన్‌కి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు.. వెబ్‌ లింక్‌లు, ఈమెయిళ్లను ఓపెన్‌ చేయొద్దు.

ఫోన్‌లో నమోదు చేసుకుంటారు

ఫోన్‌లో నమోదు చేసుకుంటారు

చాలా మంది తమ అకౌంట్‌ నంబరు, పిన్‌, ఏటీఎం కార్డు వివరాలను ఫోన్‌లో నమోదు చేసుకుంటారు. ఇది అత్యంత ప్రమాదం. ఫోన్‌ హ్యాక్‌ అయితే ఆ వివరాలు సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతాయి. పైగా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే యాప్‌లన్నీ మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌, సందేశాలను తప్పకుండా రీడ్‌ చేస్తాయి. దీంతో మీ ఫోన్‌లో వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. అందువల్ల బ్యాంకు, కార్డులు, పిన్‌ నంబర్లను ఫోన్‌లో ఉంచుకోవద్దు.

ఫోన్‌ చేస్తే నమ్మవద్దు

ఫోన్‌ చేస్తే నమ్మవద్దు

ఎవరైనా ఫోన్‌ చేసి.. మీ కార్డుకు సంబంధించిన వివరాలు అడిగితే చెప్పవద్దు. మీ కార్డుకు సంబంధించిన వ్యవహారాలను బ్యాంకులోనే నిర్వహించాలి. కార్డులో సమస్య ఉందని.. పొరపాటు వచ్చిందని.. కొత్త కార్డు ఇస్తున్నామని బ్యాంకు అధికారులమని.. ఫోన్‌ చేస్తే నమ్మవద్దు.

ఎప్పుడూ కార్డు నంబరు, సీవీవీ నంబరు, మీ పిన్‌ నంబరును ఎవరికీ చెప్పకూడదు.

సీవీవీ నంబర్‌ కీలకం

సీవీవీ నంబర్‌ కీలకం

కార్డులో సీవీవీ నంబర్‌ అంటే కార్డుకు వెనుక వైపున తెల్లపట్టీపై ఉండే చివరి మూడు అక్షరాలు కీలకం. అవి తెలియకుంటే ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయలేం. అందువల్ల మీ కార్డు తీసుకున్న వెంటనే సీవీవీని గుర్తుంచుకుని.. కార్డుపై ఉన్న అంకెలను చెరిపేయాలి. దీని వల్ల మీరు కార్డును ఇతరులు కాజేసినా ఆన్‌లైన్‌లో వినియోగించలేరు. పిన్‌ నంబరులాగానే ఈ నంబరును కూడా ఎవరు అడిగినా చెప్పవద్దు.

చిప్‌ ఎనేబుల్డ్‌ అయి ఉంటే శ్రేయస్కరం

చిప్‌ ఎనేబుల్డ్‌ అయి ఉంటే శ్రేయస్కరం

డెబిట్‌..లేదా క్రెడిట్‌ కార్డులు చిప్‌ ఎనేబుల్డ్‌ అయి ఉంటే శ్రేయస్కరం. అలాంటి కార్డులే తీసుకోవాలి. కార్డు పిన్‌ నంబర్లు, మనసులోనే ఉంచుకోవాలి. రాసిపెట్టుకోవడం.. ఫోన్లో.. మెయిల్లో ఉంచుకోవడం.. ఇతరులకు చెప్పడం మంచిదికాదు. ఇప్పుడు కొత్త తరహా డెబిట్ కార్డులు, పీఓఎస్‌ మిషన్‌ల ద్వారా పిన్‌ లేకుండా లావాదేవీ చేయడం సాధ్యం.

ఆర్‌.ఎఫ్‌ ఐడీ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ద్వారా

ఆర్‌.ఎఫ్‌ ఐడీ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ద్వారా

కొన్ని రెస్టారెంట్‌ల నిర్వాహకులు ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వేగంగా స్వైప్‌ చేస్తున్నారు. ఆర్‌.ఎఫ్‌ ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) ద్వారా పిన్‌ అవసరం లేకుండానే కార్డును స్కాన్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత పిన్‌ నంబర్‌ అవసరం లేకుండానే నగదు బదిలీ అవుతుంది.

ఖాతాదారుడికి నష్టాలు

ఖాతాదారుడికి నష్టాలు

అయితే దీని వల్ల ఖాతాదారుడికి నష్టాలు కూడా ఎదురవ్వవచ్చు. మీ ఏటిఎం కార్డు ఎవరికైనా దొరికితే పిన్ అవసరం లేకుండానే డబ్బులు డ్రా చేసేయొచ్చు. అందుకే ఏటీఎం కార్డు (డెబిట్ కార్డు) క్రెడిట్ కార్డుల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి.

English summary

husbansd cannot use wife's debit card and how are rfid readers used to hack debit cards

husbansd cannot use wife's debit card and how are rfid readers used to hack debit cards
Story first published:Wednesday, June 13, 2018, 10:10 [IST]
Desktop Bottom Promotion