డింపుల్స్‌, ప‌ళ్ల మ‌ధ్య సందులుంటే అదృష్ట‌వంతులు.. ఎందుకో తెలుసా?

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

కేవ‌లం రంగు, ఫీచ‌ర్లు ఒక్క‌టే ఒక వ్య‌క్తిని విశిష్టంగా నిలుపుతాయ‌నుకుంటే పొరపాటే. ఇంకా మ‌రెన్నో గుణాలు ప్ర‌పంచంలో కొంద‌రిని ప్ర‌త్యేకంగా చేయ‌గ‌ల‌వు. వీళ్ల‌ను విభిన్నంగా చేయ‌గ‌ల‌వు. మ‌రి ఈ ల‌క్ష‌ణాలు నిజ‌జీవితంలో ఎంత ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.

ఈ ప్ర‌త్యేక గుణాల వ‌ల్ల మీరు అదృష్ట‌వంతులో కాదో చూద్దాం...

1.చిటికెన కాలివేలు

1.చిటికెన కాలివేలు

చాలా మంది కాలి చిటికెన వేలును క‌దిలించ‌లేరు. పాదాలకున్న మ‌ధ్య వేళ్ల‌ను సులువుగా క‌దిలించిన‌ప్ప‌టికీ చిన్న వేలును మాత్రం క‌దిలించ‌డం కొంద‌రికే సాధ్య‌మ‌వుతుంది. ఇలాంటి వారు వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ ప‌ట్ల క‌చ్చితంగా ఉంటార‌ని అంటారు.

2. డింపుల్స్‌

2. డింపుల్స్‌

ప్ర‌పంచ జ‌నాభాలో 25శాతం మందికి చెంప‌లకు డింపుల్స్ ఏర్ప‌డ‌తాయి. ఇది అందానికి సంకేతం. ముఖ కండ‌రాల్లో అందానికి వాస్త‌విక‌త‌ను అద్దుతాయి డింపుల్స్‌. కండ‌రాల్లో జైగోమాటిక‌స్ మేజ‌ర్ ఉండ‌డం మూలానే డింపుల్స్ ఏర్ప‌డుతాయి.

3. ది డార్విన్స్ ట్యూబ‌ర్‌కిల్‌

3. ది డార్విన్స్ ట్యూబ‌ర్‌కిల్‌

చెవి పై భాగంలో మంద‌మైన బిందువునే ది డార్విన్స్ ట్యూబ‌ర్‌కిల్‌గా పిలుస్తారు. ప్ర‌ఖ్యాత జీవ శాస్త్ర‌వేత్త చార్లెస్ డార్విన్ ప్రాచీన చ‌రిత్ర‌లో మ‌నుషులు ఇలాంటి చెవుల‌తో ఉండేవార‌ని వూహించారు. ఇలాంటి వారు బాగా విన‌గ‌లుగుతారు అని చెప్తారు.

4. పామ‌ర్ కండ‌రం

4. పామ‌ర్ కండ‌రం

మ‌ణిక‌ట్టును గ‌ట్టిగా మ‌డిచి వేళ్ల‌ని బిగుతుగా చేసి చూస్తే చూపుడు వేలికింద రెండు స్ప‌ష్ట‌మైన గీత‌లు క‌నిపిస్తాయి. ఇది మ‌ణిక‌ట్టు నుంచి చేతి దాకా ఉంటుంది. దీన్నే పామ‌ర్ కండ‌రంగా పిలుస్తారు. కొంద‌రికి ఇది ఉండ‌దు. ఇది లేక‌పోయినా చేతి క‌ద‌లిక‌లో ఎలాంటి మార్పు ఉండ‌బోదు.

5. ఎటైనా వంచ‌గ‌లిగే బొటన‌వేలు

5. ఎటైనా వంచ‌గ‌లిగే బొటన‌వేలు

మొత్తం జ‌నాభాలో 25శాతం మంది త‌మ బొట‌నే వేలును ఎటైనా వంచ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఉంటుంది. కొంద‌రు దీంతో త‌మ చేతిని కూడా తాక‌గ‌ల‌రు. ఇలాంటి వారు చాలా క‌లుపుగోలుత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతారు. గ‌ట్టిగా బొట‌న‌వేలు ఉన్న‌వారు నిబ్బ‌రంగా ఉంటార‌ని అంటారు.

6. ప‌ళ్ల సందులు

6. ప‌ళ్ల సందులు

కొన్ని సంప్ర‌దాయ వ‌ర్గాల్లో ముంద‌టి రెండు ప‌ళ్ల మ‌ధ్య సందు ఉంటే అది అందానికి, ఆక‌ర్ష‌ణ‌కు సంకేతంగా భావిస్తారు. ఫ్రెంచిలో దీన్ని డెంట్స్ దు బోనెర్ అని పిలుస్తారు. అంటే ల‌క్కీ టీత్ అని అర్థం. వాస్త‌వానికి దంత వైద్య ప‌రిభాష‌లో దీన్ని డ‌యాస్టెమాగా వ్య‌వ‌హ‌రిస్తారు. ద‌వ‌డ ఎముక‌ల‌కు, ప‌ళ్ల ఆకారానికి పొంత‌న కుద‌ర‌క ఇలా ఏర్ప‌డుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతారు.

English summary

If You Can Move Your Little Toe Two Things Can Be Revealed About You; And You'll Among Few Who Can Do It

If You Can Move Your Little Toe Two Things Can Be Revealed About You; And You'll Among Few Who Can Do It
Story first published: Saturday, January 20, 2018, 9:00 [IST]