For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌రేంద్ర మోదీ భార్య జ‌శోదాబెన్ చిరకాల వాంఛ అప్పుడు తీరిందట

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో నామినేషన్ వేసినప్పుడు కొన్ని అంశాలను ఆ పత్రాల్లో పొందుపరిచారు. తనకు 17 యేళ్ళ ప్రాయంలోనే పెళ్లి అయిందని, తన వయస్సుకు సమానమైన యువతిని వివాహం చేసుకునన్నారు.

By Bharath
|

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార్య జ‌శోదాబెన్ (యశోదా బెన్) ఆ మధ్య హాట్ టాఫిక్ గా నిలిచారు. మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. తాజాగా జశోదాబెన్ వాహనం ప్రమాదానికి గురికావడం ఆమెకు గాయాలు కావడం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ రోడ్డు ఈ మధ్యే ప్రమాదానికి గురయ్యారు. రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన వేడుకకు హాజరై గుజరాత్‌కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే జ‌శోదాబెన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఒకసారి పరిశీలిద్దామా.

వైట్ హౌస్‌లో విందు

వైట్ హౌస్‌లో విందు

గతంలో ఒక ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికైన తరువాత తొలిసారిగా వైట్ హౌస్‌లో విందు తీసుకోవడానికి ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానించారు. అప్పడు ట్రంప్ కుటుంబంతో విందు స్వీకరించేందుకు మోదీ వైట్‌హౌస్ చేరుకున్నారు. అక్కడ మోదీని.. ట్రంప్‌తోపాటు ఆయన భార్య మెలానియా విందుకు ఆహ్వానించారు.

మోదీ భార్య వస్తదేమోనని

మోదీ భార్య వస్తదేమోనని

వైట్‌హౌస్ దగ్గరికి మోదీ కారు రాగానే మెరిన్ సెంట్రీ గార్డులు కారును చూస్తూ సెల్యూట్ చేశారు. తర్వాత వారు కారు డోర్లు తెరిచే ప్రయత్నం చేశారు. కుడివైపు డోర్ తీయగానే ప్రధాని నరేంద్ర మోదీ బయటకు వచ్చారు. అయితే ఎడమవైపు డోర్ ఎంతకీ తెరుచుకోలేదు. అయినా గార్డు బలవంతంగా డోర్ తీశాడు.

జశోదాబెన్ దిగుతుందేమో అనుకున్నారు

జశోదాబెన్ దిగుతుందేమో అనుకున్నారు

అయితే ఎడమవైపు డోర్ నుంచి ఎవరూ దిగకపోవడంతో గార్డ్ షాక్ అయ్యాడు. సాధారణంగా వాళ్ల ట్రంప్ మాదిరిగా ఎడమవైపు మోదీ కూడా భార్య జశోదాబెన్ ను కూర్చొబెట్టుకుని వచ్చాడని అనుకున్నారు. అందుకోసమే గార్డు డోర్ దగ్గర నిలబడి, దానిని తెరిచాడు. నరేంద్ర మోదీ... భార్య జశోదాబెన్‌తో కలిసి ఉండడం లేదనే విషయంలో పాపం గార్డ్ కు తెలియదు కదా.

భద్రత

భద్రత

ఇక ప్రధాని నరేంద్ర మోదీ తన భార్య జశోదా బెన్ తో కలిసి లేరు. కానీ ఆమెకు మాత్రం జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించారు. దీనిపై గతంలో దేశ వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వచ్చాయి.

ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు

ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు

జోశోదాబెన్ కూడా భద్రత విషయంలో గతంలో చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఏ హోదాతో భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారో ప్రభుత్వం తెలపాలంటూ మోదీ భార్య జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.

పాస్ పోర్ట్ లో

పాస్ పోర్ట్ లో

అంతేకాదు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ తన పాస్‌పోర్ట్‌లో భార్యకు సంబంధించి ఎటువంటి వివరాలు పొందుపరిచారో తెలపాలంటూ గతంలో జశోదా బెన్‌ ఆర్టీఐ అధికారులను కోరారు. ఇందుకు స్పందించిన పాస్‌పోర్టు కార్యాలయం.. భద్రత కారణాల వల్ల సమాచారం ఇవ్వలేమని, ఈ విషయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదంటూ ఆమెకు వివరించారు.

రిటైర్డ్ టీచర్

రిటైర్డ్ టీచర్

టీచర్ గా అయిన జశోదాబెన్ మెహసనా జిల్లాలోని ఉంఝా పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె భద్రత నిమిత్తం 10 మంది పోలీసుల్ని ప్రభుత్వం కేటాయించింది. మెహసన జిల్లా ఉనిజా పట్టణంలోని తన సోదరుడు అశోక్ మోడీతోపాటు జశోదాబెన్ నివాసం ఉంటోంది.

17 ఏళ్ల ప్రాయంలోనే

17 ఏళ్ల ప్రాయంలోనే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో నామినేషన్ వేసినప్పుడు కొన్ని అంశాలను ఆ పత్రాల్లో పొందుపరిచారు. తనకు 17 యేళ్ళ ప్రాయంలోనే పెళ్లి అయిందని, తన వయస్సుకు సమానమైన యువతిని వివాహం చేసుకున్నట్టు తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో మోదీ పేర్కొన్నారు.

చాలాసార్లు ఖాళీగానే

చాలాసార్లు ఖాళీగానే

నరేంద్ర మోదీ చాలా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయన వివిధ ఎన్నికల అఫిడవిట్లలో వైవాహిక జీవితానికి సంబంధించిన కాలమ్‌ ను ఖాళీగా వదులుతూ వచ్చారు.

పెళ్లయిన రెండు వారాలకే

పెళ్లయిన రెండు వారాలకే

కానీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆయనను ప్రకటించినప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన నామినేషన్ వేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్‌లో తాను వివాహితుడని, తన భార్య పేరు జశోదాబెన్ అని చెప్పుకున్నారు. అయితే, పెళ్లయిన రెండు వారాలకే మోదీతన ఆశయాల కోసం భార్యతో విడిపోయాడని అంటారు.

భర్తను ప్రశంసించిన జశోదాబెన్

భర్తను ప్రశంసించిన జశోదాబెన్

తన భర్త నరేంద్రమోదీని జశోదాబెన్ గతంలో మెచ్చుకుంది కూడా. ఆ మధ్య డీమానిటైజేషన్ కింద నరేంద్రమోదీ చేపట్టన చర్యలను అందరూ విమర్శించారు. కానీ జశోదాబెన్ మాత్రం ఇది నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు తీసుకున్న గట్టి చర్య అని సమర్థించారు.

దీక్ష చేశారట

దీక్ష చేశారట

జశోదాబెన్ తన భర్తను ప్రధానమంత్రిగా చూడాలని అప్పట్లో నెలలు తరబడి ఉపవాస దీక్ష చేశారట. నిజానికి ఇలాంటి విషయాలు చెప్పుకునేందుకు జశోద అంగీకరించరు. కానీ ఆమె సోదరుడు ఈ విషయాన్ని అపట్లో చెప్పారు.

అలా చెప్పాలని ఎదురు చూసిందట

అలా చెప్పాలని ఎదురు చూసిందట

మోదీ తనను తన భార్య అని చెప్పాలని చాలా కాలం జశోదాబెన్ ఎదురు చూసిందట. అయితే 2014 ఎన్నికల నేపథ్యంలో ఆమె చిరకాల వాంఛ తీరిందట. ఆ సమయంలో తనకు ఇక ఏమీ అవసరం లేదని ఆమె సోదరుడితో వెల్లడించిందట.

ఆయన దేశం కోసం పుట్టిన వ్యక్తి

ఆయన దేశం కోసం పుట్టిన వ్యక్తి

మోదీ తనను విడిచిపెట్టి వెళ్లడం వల్ల ఎలాంటి బాధ లేదని, ఆయన దేశం కోసం పుట్టిన వ్యక్తి అని అప్పట్లో జశోద బెన్ చెప్పారు. అంతటి ఉదాత్తమైన వ్యక్తి తనకు తెలిసి ఎవరూ లేరని జశోద సోదరుడు కూడా చెప్పాడు.

కిరాణం దుకాణం?

కిరాణం దుకాణం?

మోదీ భార్య జశోదాబెన్ పెళ్లయిన కొన్ని రోజులకే భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఇక మోదీ సూచనతోనే ఆమె తన చదువును కొనసాగించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టిందట. గుజరాత్‌లోని ఉంజా పట్టణం బ్రాహ్మణవాడ గ్రామంలోని తన సోదరుడు అశోక్‌భాయ్ ఇంట్లో ఆమె ఉంటున్న విషయం తెలిసిందే. ఉద్యోగ విరమణ చేశాక ఆమె కిరాణ దుకాణాన్నినడిపిస్తున్నారట.

English summary

interesting facts about Jashodaben wife of Prime minister narendra modi

interesting facts about Jashodaben wife of Prime minister narendra modi
Desktop Bottom Promotion