For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ మహిళా దినోత్సవం : కృష్ణ కుమారికి 16 ఏళ్లకే పెళ్లి.. చాలా కష్టాలు పడింది.. గర్వించేలా ఎదిగింది

కృష్ణకుమారి కోల్హీకి 16 ఏళ్ల వయసుల్లోనే పెళ్లి అయ్యింది. అప్పుడు ఆమె 9వ గ్రేడ్‌ చదువుతోంది. లాల్‌ చంద్‌ను కోల్హీ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా విద్యను కొనసాగించింది.

|

పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణకుమారి కోల్హీ ఈ మధ్య అంతటా హాట్ టాఫిక్ అయ్యారు. అసలు ఎవరు ఈమె. ఈమె గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఈమె చరిత్ర సృష్టించారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈమె గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.

పాకిస్తాన్ సెనెట్‌కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా ఈమె రికార్డు సృష్టించారు. గతంలో పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీయే తొలిసారిగా రత్నా భగవాన్‌దాస్‌ చావ్లా అనే హిందూ మహిళను సెనేట్‌కు పంపింది. మళ్లీ ఇప్పుడు కృష్ణకుమారి కోల్హీ కూడా సెనెటర్ గా ఎన్నికైంది. అందుకే ఈమెకు అంతగా పేరొచ్చింది. కృష్ణకుమారి కోల్హీ నామినేషన్ వేసినప్పటి నుంచే ఆమె పేరు మారుమోగిపోయింది.

క్లుప్తంగా..

క్లుప్తంగా..

కృష్ణ కుమారి కుంటుంబ సభ్యులు అవిభాజ్య భారత స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వీళ్ల కుటుంబానికి చెందిన రూప్‌లో కోల్హి అనే పెద్దాయన స్వాతంత్రద్యోమంలో ఉరికంబం ఎక్కి అమరుడయ్యాడు. కృష్ణ కుమారి కూడా .. సింధ్ ప్రావిన్స్‌లోని భూస్వాములపై పోరాటానికి దిగి జైలు పాలైంది. ఆ తర్వాత కష్టపడి చదువుకుని.. సామాజిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత పీపీపీలో జాయినై.. రాజకీయంగా ఎదిగారు.

మారుమూల గ్రామం

మారుమూల గ్రామం

కృష్ణకుమారి కోల్హీది సింధు ప్రావిన్స్‌లోని థార్‌ జిల్లాలో ఉన్న మారుమూల ధనగామ్‌ గ్రామం. ఆ ప్రావిన్స్‌లోని రిజర్వ్‌ స్థానానికి బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) తరఫున ఈమె సెనెటర్‌గా పోటీ చేశారు.

మానవ హక్కుల కార్యకర్త

మానవ హక్కుల కార్యకర్త

కృష్ణకుమారి కోల్హీ మానవ హక్కుల కార్యకర్త. మైనార్టీలు.. ముఖ్యంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈమె పోరాటం చేస్తోంది. మైనార్టీలకు అండగా నిలుస్తున్న ఈమెను పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) పోటీకి నిలబెట్టింది.

మూడేళ్లు జైల్లో ఉంది

మూడేళ్లు జైల్లో ఉంది

1979లో ఓ పేద రైతు కుటుంబంలో కృష్ణకుమారి కోల్హీ. మూడేళ్లపాటు తన కుటుంబం, బంధువులతో కలసి ఓ ప్రైవేట్‌ జైలులో బానిసగా జీవించింది. ఆమె, ఆమె కుటుంబం, బంధువులు ఉమర్‌కోట్‌లోని ఓ భూస్వామికి చెందిన ప్రైవేటు జైల్లో బానిసలుగా ఉన్నారు. ఆ ప్రాంతంపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడి నుంచి బయటపడ్డారు.

చిన్నప్పుడు చాలా కష్టాలు

చిన్నప్పుడు చాలా కష్టాలు

అలా బానిసగా బతుకుతూ చిన్నప్పుడు తాను చాలా కష్టాలు పడింది కృష్ణకుమారి కోల్హీ. అప్పుడే కృష్ణకుమారి కోల్హీ మనస్సులో మైనార్టీ మహిళలు, చిన్నారుల కోసం పోరాటం సాగించాలని నిర్ణయించుకుంది.

16 ఏళ్లకు పెళ్లి

16 ఏళ్లకు పెళ్లి

కృష్ణకుమారి కోల్హీకి 16 ఏళ్ల వయసుల్లోనే పెళ్లి అయ్యింది. అప్పుడు ఆమె 9వ గ్రేడ్‌ చదువుతోంది. లాల్‌ చంద్‌ను కోల్హీ పెళ్లి చేసుకుంది.

సోషియాలజీలో మాస్టర్స్‌

సోషియాలజీలో మాస్టర్స్‌

పెళ్లి తర్వాత కూడా విద్యను కొనసాగించింది కృష్ణకుమారి. 2013లో సింధు విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేసింది.

పీపీపీలో సామాజిక కార్యకర్త

పీపీపీలో సామాజిక కార్యకర్త

కృష్ణకుమారి కోల్హీ తన సోదరునితో కలిసి పీపీపీలో సామాజిక కార్యకర్తగా చేరారు. ఆమె సోదరుడు బెరానో యూనియన్ కౌన్సిల్ చైర్మన్‌గా పని చేశారు. థార్‌తోపాటు మిగతాప్రాంతాల్లోని అట్టడుగు, అణగారిన, పీడితవర్గాల హక్కుల కోసం కొల్హి అనేక పోరాటాలు చేశారు.

రూప్‌లీ కొల్హిని ఉరితీశారు

రూప్‌లీ కొల్హిని ఉరితీశారు

1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో సింధ్ ప్రావిన్స్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రూప్లో కోల్హి వంశానికి చెందిన మహిళ ఈమె. సింధ్‌లోని నాగర్‌పర్కార్‌లో దాడికి యత్నించిన బ్రిటిష్ బలగాలపై పోరాడాడు రూప్‌లీ కొల్హి. 1858 ఆగస్టు 22న రూప్‌లీ కొల్హిని బ్రిటిష్‌వారు అరెస్టు చేసి ఉరితీశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చింది కృష్ణకుమారి కోల్హీ.

కలలో కూడా అనుకోలేదు

కలలో కూడా అనుకోలేదు

కృష్ణకుమారి కోల్హీ తాను సెనెటర్‌గా ఎన్నికవుతానని కలలో కూడా అనుకోలేదంట. అయితే అవకాశం వస్తే (సింధ్ ప్రావిన్సు) శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి తమ ప్రాంతంలోని పేద ప్రజల కోసం పాటుపడాలని రాజకీయాల్లోకి వచ్చేముందు అనుకుందట.

అంకితభావంతో

అంకితభావంతో

సింధ్ ప్రావిన్సులో హిందూ మైనార్టీలైన భిల్, కోహ్లీ, మేగవర్ తదితర కులాలకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు, పేదలుగా ఉన్నారు. వారి కోసం సెనెటర్‌గా తాను అంకితభావంతో పని చేయాలనుకుంటోంది కృష్ణ కుమారి.

విద్య, వైద్య సమస్యలు పరిష్కరిస్తా

విద్య, వైద్య సమస్యలు పరిష్కరిస్తా

పాకిస్తాన్ పార్లమెంటులో చట్టాలు చేయటమే సెనెటర్‌ ప్రధాన విధి. సెనెట్ వేదికగా కృష్ణకుమారి కోల్హీ ఇదో పెద్ద అవకాశం. అయితే కృష్ణకుమారి కోల్హీ ఈ వేదికను ఉపయోగించుకుని మహిళల విద్య, వైద్యం వంటి సమస్యలను పరిష్కరిస్తానంటోంది. తమ వర్గానికి చెందిన ప్రజలందరీ మద్దుతు తనకు ఎప్పుడూ ఉంటుంది అన్నారు.

సాహో.. కృష్ణకుమారి కోల్హీ

సాహో.. కృష్ణకుమారి కోల్హీ

కాగా పాకిస్తాన్‌లోని 52 మంది సెనేటర్ల పదవీకాలం ముగియనుండటంతో వారిస్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 130 మందికిపైగా ఈ ఎన్నికల్లో పోటీచేశారు. పాకిస్థాన్‌లోని మహిళలు, మైనార్టీల హక్కులపై జరుగుతున్న చర్చలకు కృష్ణకుమారి కోల్హీ సెనేటర్ గా ఎన్నికకావడం ఓ మైలురాయిగా మిగులుతుంది. సాహో.. కృష్ణకుమారి కోల్హీ... సాహో.

English summary

international womens day all you need to know about pakistani hindu senator krishna kumari

international womens day all you need to know about pakistani hindu senator krishna kumari
Desktop Bottom Promotion