For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారికి కుడికన్ను అదిరితే ఏమవుతుంది? రొమ్ము, అరచేయి అదిరితే అద్భుతమేనా?

|

మనలో చాలా మందికి సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యమైన కార్యములు తలపెట్టినప్పుడు, ఏదేని ఒక విషయమును గురించి ఆలోచించువేళ, కొత్త పనిని ప్రారంభించినప్పుడు శకునాలను చూడటం పరిపాటి. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా కళ్లు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కుడికన్ను అదిరితే..

కుడికన్ను అదిరితే..

ఇక ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే కష్టాలు తప్పవని విశ్లేషిస్తుంటారు జ్యోతిషవేత్తలు. ఈ నమ్మకం తాము సృష్టించింది కాదని, రామాయణ కాలంలోనే ఇది ప్రాచుర్యంలో ఉందని చెబుతారు వారు. రావణుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్లేందుకు పయనమవగానే... సీతాదేవికి కుడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట.

రావణుడికి, మండోదరికి కూడా..

రావణుడికి, మండోదరికి కూడా..

ఆ తరువాత రావణుడు రామపత్నిని అపహరించాడు. అప్పట్నుంచీ కుడికన్ను అదిరితే స్త్రీకి, ఎడమకన్ను అదిరితే పురుషుడికి ప్రమాదాలు సంభవిస్తాయనే నమ్మకం ఏర్పడింది అంటారు. రామదండు లంక మీద దాడి చేయబోయే ముందు రావణుడికి, మండోదరికి కూడా కన్ను అదరిందట.

విదేశాల్లోనూ...

విదేశాల్లోనూ...

కన్ను అదిరితే వామ్మో ఏం జరుగుతుందోనని భయపడుతుంటాం. కానీ ఈ కన్ను అదరటంపై మన భారత దేశమే కానీ విదేశాలు కూడా విశ్వాసం పెట్టుకున్నాయి. ఇంకా కన్నుశాస్త్రాన్ని కూడా అనుకరిస్తున్నాయి.

హవాయిలో...

హవాయిలో...

హవాయిలో ఎడమకన్ను కొట్టుకుంటే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే... తమ ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలోగానీ పసిబిడ్డ జన్మిస్తుందని విశ్వసిస్తారు. ఆఫ్రికాలో కన్ను పై రెప్ప కొట్టుకుంటే బంధువుల రాక అని, కిందిరెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు. నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందంటారు.

చైనాలో...

చైనాలో...

ఇక చైనా వారికి కుడికన్ను అదిరితే మంచి, ఎడమకన్ను అదిరితే కీడు. అంతేకాదు... అదిరే సమయాన్ని బట్టి వారు ఫలితాన్ని అంచనా వేస్తుంటారు. అదెలాగంటే... ఉదయం 11 నుంచి 1 గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా చాలా లెక్కలున్నాయి వారికి!

అమెరికాలో

అమెరికాలో

అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు, బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు. అదే కుడి కన్ను అయితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు.

మనదేశంలో...

మనదేశంలో...

ఇక మన దేశంలో పురుషునికి కుడికన్ను, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే మేలు, లాభము చేకూరుతుందని విశ్వాసం. అలాగే పురుషునికి ఎడమకన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు-ఆపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు. రెండుకన్నులు ఒకేమారు అదురుట స్త్రీ పురుషుల కిరువురికి శుభసూచకమట.

భోగ సంపదలు

భోగ సంపదలు

అలాగే మన దేశంలో కింది పెదవి భాగము అదిరితే భోజనసౌఖ్యము, గడ్డము అదిరిన లాభము-ఇతరుల ద్వారా సహాయ సహకారాలు, కుడిచెక్కిలి ధనప్రాప్తి, ఎడమచెక్కిలి-చోరబాధలు, కుడి భుజములదిరితే భోగసంపదలు వంటి ఫలితాలుంటాయని నమ్ముతారు.

కళ్లు ఎక్కువగా అలిసిపోతే..

కళ్లు ఎక్కువగా అలిసిపోతే..

అలాగే ఎడమ భుజము అదిరితే కీడు, కష్టములు, రొమ్ము అదిరిన ధనలాభము, ధైర్యము, అరచేయి అదిరిన సంతాన ప్రాప్తి, గౌరవము కలుగుతుందని పండితులు అంటున్నారు.

అయితే నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. వాళ్లు చెప్పేది వాస్తవమే కావచ్చు. కానీ నమ్మకాల మాటేమిటి!

శరీరభాగాలు అదిరితే..

శరీరభాగాలు అదిరితే..

ఇక మనకి వాస్తు శాస్త్రం లోనే శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం కన్నె కాదు, ఆడవారికి కుడివైపు శరీర భాగం, మగవారికి ఎడమవైపు శరీర భాగం అదిరితే అమంచిదని అంటారు. అయితే కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని మూడనమ్మకాలుగా కూడా మిగిలిపోయాయి.

కొన్ని సార్లు మాత్రమే..

కొన్ని సార్లు మాత్రమే..

ప్రతిసారి శరీర భాగాలదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుందని కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని అనుకోవడానికి లేదు.కేవలం కొన్ని సార్లు మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు.

నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు

నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు

వాస్తవానికి మన శరీర భాగాలు అదరడానికి కారణాలు చాలా ఉన్నాయి. కొందరు ఉదయం నుంచీ రాత్రిదాకా అదిరిందంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు అదురుతాయంటారు.కళ్ళ వ్యాధులున్నాకూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు. అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలిగానీ నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు.

English summary

Is right eye twitching a superstition? everything you need to know!

Is right eye twitching a superstition? everything you need to know!
Story first published: Wednesday, May 16, 2018, 17:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more