కత్తి మహేశ్ మెడకు బిగిస్తోన్న ఉచ్చు, జానారెడ్డి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌, నాగబాబు, జనాలంతా ఫైర్

Subscribe to Boldsky

కత్తి మహేశ్... అనే పేరు అతను బిగ్ బాస్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచివార్తల్లో నిలుస్తూనే ఉంది. అందుకు కారణం కత్తి మహేశ్ నోరు. తన భావాజాలాన్ని సమాజంపై రుద్ది తానో మహా మేధావి అని ఫీల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు కత్తి మహేశ్. ఎప్పుడూ ఏదో కామెంట్ చేస్తూ తరచూ వైరల్ అయిపోతున్నారు.

కత్తి మహేశ్ ట్వీట్స్: సీత రావుణుడితోనే ఉంటే బాగుండు, అంగ చూషణ చేస్తారో చేసుకోండి, మేమూ బాగానే ఉంటాం

కత్తి మహేశ్ నోటికి వచ్చినట్లు ఏదో కామెంట్ చేస్తాడు... మళ్లీ అతన్ని ప్రశ్నిస్తే మరి ఏమనాలండీ తెలుగులో పదాలనే నేను ఉపయోగిస్తున్నాను... అది నా వాక్ స్వాతంత్ర్యం, భావస్వాతంత్ర్యం అంటూ ఏవేవో కబుర్లు చెబుతాడు. ప్రశ్నించిన వ్యక్తులపైనే మళ్లీ ఎదురుదాడికి దిగుతాడు.

రామసేతు

ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడిని హిందువులు ఎంతో భక్తిభావంతో కొలుస్తారు. దశావతారాల్లో ఒకటైన శ్రీరాముడు మానవుడిగా భూమిపై జీవించారనేందుకు రామసేతు ఓ చక్కని సాక్ష్యాధారం. అలాంటి శ్రీరాముడిపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.

రాముడిపై చేసిన వ్యాఖ్యలు

గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకు చిక్కిన కత్తి.. ఈసారి రాముడిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారణకు అనంతరం విడుదల చేశారు. అయినా కత్తి రామునిపై సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్లు చేశాడు.

మూర్ఖులు అన్నట్లుగా ట్రీట్ చేస్తాడు

ఆయనగారు అనే మాటలను ఎవరైనా ప్రశ్నిస్తే మీరు మూర్ఖులు అన్నట్లుగా ట్రీట్ చేస్తాడు. మరి ఆయనేమో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్లు ఫీల్ అవుతాడు. "రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో" అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మళ్లీ వాటిని సమర్థించుకుంటున్నాడు కత్తి మహేశ్.

ఒక రేంజ్ లో విమర్శలు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన కత్తి మహేష్ పై ఒక రేంజ్ లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కత్తి మహేశ్ పై విరుచుకుపడ్డారనే అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు కత్తి మహేశ్ నిజస్వరూపం అంతా బట్టబయలవుతుండడంతో పార్టీలకు సంబంధం లేకుండా కత్తి మహేశ్ పై నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

అహంకార పూరిత వ్యాఖ్యలు : జానారెడ్డి

అహంకార పూరిత వ్యాఖ్యలు : జానారెడ్డి

కత్తి మహేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలు, అతను మాట్లాడిన విధానం.. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా, అహంకార పూరితంగా ఉన్నాయని సీఎల్పీ నేత జానారెడ్డి తాజాగా పేర్కొన్నారు. కత్తి మహేష్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అతని తీరును అన్ని పార్టీలు, మతాలు, వర్గాలు ముక్తకంఠంతో నిరసించాలని కోరారు.

సర్కారుకు తామూ సహకరిస్తాం

సర్కారుకు తామూ సహకరిస్తాం

సమాజంలో పెడధోరణులు అరికట్టేందుకూ కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో సర్కారుకు తామూ సహకరిస్తామని జానారెడ్డి చెప్పారు. ఏ పార్టీ వారైనా సంస్కారహీనంగా మాట్లాడిన మాటలను ప్రచురించవద్దని మీడియాకు జానారెడ్డి సూచించారు.

జైలుకు పంపించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

జైలుకు పంపించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కత్తి మహేష్‌ ను జైలుకు పంపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజల మత విశ్వాసాలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. రామాయణం, రాముని గురించి కుహనా మేధావులు మాట్లాడడాన్ని కట్టడి చేయాలని డిమాండ్‌ చేశారు. హిందువులను కించపరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

తగినబుద్ధి చెబుతాం : కిషన్ రెడ్డి

తగినబుద్ధి చెబుతాం : కిషన్ రెడ్డి

దేవుళ్ల మీద, మత విశ్వాసాల మీద అవాకులు, చవాకులు పేలే కత్తి మహేష్‌ లాంటి వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

కొందరు స్వయం ప్రకటిత మేధావులు.. శ్రీరాముడు, రామాయణంపైనా వారి ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు.

కత్తి మహేశ్ ను ఈ మధ్యే చూస్తున్నా

కత్తి మహేశ్ ను ఈ మధ్యే చూస్తున్నా

కత్తి మహేశ్ ను ఈ మధ్యే చూస్తున్నానని, ఆయన ఏ అంశంపైన మాట్లాడుకున్నా ఫర్వాలేదు కానీ, దేవుళ్ల పైనా, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారు, మరో మతం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా? అని ప్రశ్నించారు. హిందువులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు

కఠిన చర్యలు తీసుకోవాలి : నాగబాబు

కఠిన చర్యలు తీసుకోవాలి : నాగబాబు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ నటుడు నాగబాబు డిమాండ్‌ చేశారు. ఏమతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడినా తప్పేనని అన్నారు. రామాయణం అనేది పుస్తకం కాదని... కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడి చరిత్ర అని అన్నారు. ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో... హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని గుర్తు చేశారు.

హిందూ దేవుళ్లపై ఒక పద్ధతి ప్రకారం దాడి

హిందూ దేవుళ్లపై ఒక పద్ధతి ప్రకారం దాడి

హిందూమతం, హిందూ దేవుళ్లపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని నాగబాబు ఆరోపించారు. కొన్ని మీడియాలు హిందు మతానికి వ్యతిరేకంగా కొమ్ము కాస్తున్నాయని నాగబాబు తెలిపారు. నాస్తికత్వం పేరుతో హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించినందుకు శిక్ష అనుభవిస్తారని నాగబాబు అన్నారు.

చూస్తూ ఊరుకోం

చూస్తూ ఊరుకోం

మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని నాగబాబు హెచ్చరించారు. కత్తి మహేష్‌పై ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని... లేకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని నాగబాబు తెలిపారు.

ఆ వ్యక్తి పేరు చెప్పడానికి మనసు అంగీకరించడం లేదు

తనకు ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదని... అతడికి భయంకరమైన శిక్ష పడితీరాలని అన్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ ఈ విషయంలో స్పందించకపోతే చారిత్రాత్మక తప్పిదం చేసిన వారవుతారని, హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసిన వారవుతారని నాగబాబు ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఏ ఒక్క మతంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

మత సంబంధమైన డిబేట్స్ వద్దు

మత సంబంధమైన డిబేట్స్ వద్దు

నూటికి 80 శాతం సంస్థలు హిందూ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తిచేయడంలో ముందున్నాయి. ఇలాంటి మత సంబంధమైన డిబేట్స్ పెట్టకూడదని ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేయాలి. ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు హిందువులను తిడుతుంటే చేతులు కట్టుకుని ఎవరూ కూర్చోరు. ఈ విషయంలో తాను స్వామి పరిపూర్ణానంద స్వామికి సంపూర్ణ మద్దతిస్తున్నానని తెలిపారు.

కత్తి మహేశ్ స్పందన

కత్తి మహేశ్ స్పందన

కాగా మెగా హీరో నాగబాబు వ్యాఖ్యలపై కత్తి మహేశ్‌ స్పందించాడు. రామాయణంపై తనకు తెలిసిన విశ్లేషణను, అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానన్నాడు. రాముడిని నమ్ముతున్న వారిని కించపరిచే విధంగా కామెంట్స్ చేయలేదన్నాడు. మొత్తానికి కత్తి మహేశ్ మెడకు బిగిస్తోన్న ఉచ్చు నేపథ్యంలో కత్తి మహేశ్ స్పందించాడు.

తనకు తెలిసిన విశ్లేషన అట

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, మెగా హీరో నాగబాబు వ్యాఖ్యలపై కత్తి మహేశ్‌ స్పందించారు. రామాయణంపై తనకు తెలిసిన విశ్లేషణను, అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానన్నారు. రాముడిని నమ్ముతున్న వారిని కించర్చే విధంగా తన వ్యాఖ్యలు లేవని కత్తి మహేశ్‌ అన్నారు. ప్రతిసారి నోటికి ఏది వస్తే అది వాగడం, తర్వాత అది నా అభిప్రాయం మాత్రమే.. నా అభిప్రాయం కూడా వ్యక్తపరచే స్వేచ్ఛ లేకపోతే ఎలా అంటూ డిబేట్స్ లలో తనను తాను కవర్ చేసుకుంటాడు కత్తి మహేశ్.

ఒక హద్దూ అదుపు ఉంటుంది

"అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కూడా ఒక హద్దూ.. అదుపు ఉంటుంది. నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా ఎవరిపై అంటే వారిపై మాట్లాడొద్దు. జనాల మనోభావాలను దెబ్బతీయోద్దు " అంటూ మహా మేధావిగా ఫీలయ్యే కత్తి మహేశ్ కు సామాన్యులు సూచనలు ఇస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    jana reddy seeks action against kathi mahesh for making derogatory remarks on lord rama and ramayana

    jana reddy seeks action against kathi mahesh for making derogatory remarks on lord rama and ramayana
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more