For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కత్తి మహేశ్ బహిష్కరణ, హైదరాబాద్ మకిలీని తొలగించారు, దేశద్రోహిగా ప్రకటించాలి, ఎవరయ్యా ఈ కత్తి మహేశ్?

|

కత్తి మహేశ్ అనే పేరు తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తనకు తానే ఇరుక్కోని, మళ్లీ తననే జనాలంతా తప్పుపడుతున్నారని నానా రచ్చ చేసే వ్యక్తి కత్తి మహేశ్. నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఇది నా హక్కు, ఇది నా అభిప్రాయం మాత్రమే.. నాకు ఈ మాత్రం కూడా స్వేచ్ఛ లేదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కుడున్నాం అంటూ తిక్క తిక్క ప్రశ్నలు వేసే కత్తి మహేశ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.

హైదరాబాద్ లో ఉండటానికి అనర్హుడు

హైదరాబాద్ లో ఉండటానికి అనర్హుడు

కత్తి మహేశ్ ట్వీట్స్: సీత రావుణుడితోనే ఉంటే బాగుండు, అంగ చూషణ చేస్తారో చేసుకోండి, మేమూ బాగానే ఉంటాం.(ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

సమాజంలో అలజడులు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేశ్‌ హైదరాబాద్ లో ఉండటానికి అనర్హుడంటూ పోలీసులు తేల్చేశారు. కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు ఏమిటి? తర్వాత శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తీసుకున్న నిర్ణయం ఏమిటి ? కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలపై పరిపూర్ణానంద స్వామి ఇచ్చిన కౌంటర్, ఆ తర్వాత పోలీసులు సీన్ లోకి ఎంటర్ కావడం వంటి విషయాలపై ప్రత్యేక కథనం.

కత్తి మహేశ్ మెడకు బిగిస్తోన్న ఉచ్చు, జానారెడ్డి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌, నాగబాబు, జనాలంతా ఫైర్ ( ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రాముడు దగుల్బాజీ

రాముడు దగుల్బాజీ

అయితే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు, సీతా దేవీలనుద్దేశించి కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘రామాయణం నాకు ఒక కథ, రాముడు అనే వాడు ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని నేను నమ్ముతా ఆ కథలో, సీత బహుశా రావణుడితోనే ఉంటే బాగుండేదేమో, న్యాయం జరిగిదేమో ఆవిడకి అని నేను అనుకుంట, '' అని కత్తి మహేశ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందువులంతా కత్తి మహేశ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

మళ్లీ వెంటనే శ్రీరాముడిపై పోస్ట్

మళ్లీ వెంటనే శ్రీరాముడిపై పోస్ట్

వెంటనే కత్తి మహేశ్‌పై కేసు నమోదైంది. హిందూ జనశక్తి నేతలు ఆయనపై హైదరాబాద్ లోని కేబీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే రాముడిపై కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. తర్వాత పోలీసులు కత్తి మహేశ్ ను అరెస్ట్ చేసి విచారించారు. పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కత్తి మహేశ్ మళ్లీ వెంటనే శ్రీరాముడిపై పోస్ట్ పెట్టారు. దీంతో హిందూ సంఘాలు మొత్తం మండిపడ్డాయి. చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కత్తి మహేశ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయినా కత్తి మహేశ్ మాత్రం తాను కరెక్ట్ గానే మాట్లాడననీ జనాలు అనవసరంగా తనను తప్పుబడుతున్నారన్నట్లు వ్యాఖ్యలు చేశారు.

పరిపూర్ణానంద స్వామి స్పందించడంతో

పరిపూర్ణానంద స్వామి స్పందించడంతో

ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి కత్తి మహేశ్ పై స్పందించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తాజాగా సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కత్తి మహేశ్‌ రాముడిపై చేసిన వ్యాఖ్యలను శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి దుయ్యబట్టారు. పరిపూర్ణానంద స్వామి చాలా విషయాలు మాట్లాడారు.

రాజ్యాంగ దీపికలో శ్రీరామచంద్రుడి చిత్రపటం

రాజ్యాంగ దీపికలో శ్రీరామచంద్రుడి చిత్రపటం

శ్రీరామచంద్రుడు ఆదర్శమూర్తని, ప్రజలకు నిజాయితీ, నిబద్దత, మర్యా ద, సన్మార్గాన్ని ప్రసాదించిన ఆయన ఒక చరిత్రకారుడని స్వామి పరిపూర్ణానంద అన్నారు. భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ రచించే క్రమంలో 14 మంది వివిధ కుల, మత, వర్గాలకు చెందిన వారు డ్రాఫ్టింగ్ కమిటీలో తీసుకున్నారని, అలా రూపుదిద్దుకున్న రాజ్యాంగ దీపికలో శ్రీరామచంద్రుడి చిత్రపటాన్ని పొందుపర్చడమంటే ప్రజలకు ఆదర్శమైన పాలన అందించిన ఆయనను చరిత్రకారుడిగా గుర్తింపునిచ్చారన్నారు.

అధికారికంగా ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తాం

అధికారికంగా ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తాం

ప్రతి ఏడాది భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తికి ప్రభుత్వం అధికారికంగా ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ వస్తుందని, కత్తి మహేశ్‌కు ఆ విషయం తెలియదా అని, ఒక దగుల్భాజికి సమర్పిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారా అని ప్రశ్నించారు. హిందువులపై వివక్ష తగదన్నారు. హిందూ దేవతలపై అశ్లీల వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పరిపూర్ణానంద స్వామి డిమాండ్‌ చేశారు.

శ్రీరాముడిని ఎదురిస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించి నట్టే

శ్రీరాముడిని ఎదురిస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించి నట్టే

శ్రీరాముడిని ఎదురిస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించి నట్టేనన్నారు. దీంతోపాటు అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడిచినట్టేనన్నారు. దీనివల్ల 85 కోట్ల హిందువుల మనోభా వాలు దెబ్బతిన్నాయన్నారు. చాలామంది స్వామిజీలకు నిగ్రహం ఉండాలి కానీ ఆగ్రహం ఉండకూడదని అంటున్నా రు. అవును నిజమే సాధువులుగా మాకు నిగ్రహం ఉండాల న్నది నిజమే, దీంతోపాటు ధర్మపరిరక్షణ కోసం సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని ఆయన పేర్కొన్నారు.

పాదయాత్ర చేపడతాం

పాదయాత్ర చేపడతాం

ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదన్నారు. శ్రీరాముడిపై అశ్లీల వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మూడు రోజుల పాటు 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 11వ తేదీ యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపడతామన్నారు. ఈ యాత్ర శాంతియుతంగా ఉంటుం దన్నారు. రామజపాన్ని ఉచ్ఛరిస్తూ బోడుప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.

కత్తి మహేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే

కత్తి మహేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే

హిందువులు ఈ పాదయాత్ర పూర్తయ్యే వరకు రామకోటి రాయాలని ఆయన సూచించారు. రాసిన రామకోటిని 11వ తేదీ లోపు తమకు అందేలా చూడాలన్నారు. రామకోటిని రాముడి పాదాల చెంత పెడతామన్నారు. ఈ పాదయాత్ర పూర్తయ్యే లోపే ప్రభుత్వం కత్తి మహేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ పాదయా త్రలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ధర్మపరిరక్షణకు వేదికగా ఇది నిలుస్తుందన్నారు. పార్టీల కండువాను పక్కనబెట్టి ఇందులో పాల్గొనాలని దీనికి మద్ధతివ్వాలని ఆయన కోరారు.

తేనే పూసిన కత్తి

తేనే పూసిన కత్తి

అలాగే కత్తి మహేశ్ తేనే పూసిన కత్తి అని పరిపూర్ణానంద స్వామి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కరే శ్రీ రాముడిని చరిత్రకారుడని ప్రశంసించారని ఆయన తెలిపారు. శ్రీ రాముడిని విమర్శించేందుకు కత్తి మహేశ్‌కు ఎంత ధైర్యం అని ఆయన ప్రశ్నించారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ దీనిని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్త్రీ జాతిని అవమానపరచడమే

స్త్రీ జాతిని అవమానపరచడమే

శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ రాజ్యాంగాన్ని ధిక్కరించాడని అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలి అని శ్రీపీఠం పీఠాధిపతి స్వామిపరిపూర్ణానంద డిమాండ్‌ చేశారు. ‘‘కత్తి మహేశ్‌ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. సీతమ్మపై కూడా అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడమంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీ జాతిని అవమానపరచడమే. '' అని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణనంద స్వామి స్పష్టం చేశారు.

కత్తి మహేశ్ ని దేశద్రోహిగా ప్రకటించాలి

కత్తి మహేశ్ ని దేశద్రోహిగా ప్రకటించాలి

కత్తి మహేశ్ ని దేశద్రోహిగా ప్రకటించాలని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్వామిజీని గృహనిర్భంధించిన పోలీసులు, బయటకు రాకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన యాత్రకు ఆటంకం ఏర్పడింది. తాను యాదాద్రికి చేరుకునేలోపు కత్తి మహేష్‌పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తన భవిష్యత్తు కార్యాచరణను అక్కడే ప్రకటిస్తానని కూడా స్వామిజీ చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

నాగబాబు, ఆది

నాగబాబు, ఆది

ధర్మాగ్రహం పేరిటి స్వామి పరిపూర్ణానంద చేపట్ట తలచిన యాత్రకు చాలా మంది మద్దతు కూడా ప్రకటించారు. నటుడు నాగబాబు తాను ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోతున్నానని, ప్రతి ఒక్క హిందువూ ఈ యాత్రలో పాల్గొని ఐక్యతను చాటాలని ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇక కత్తి మహేశ్ వ్యాఖ్యలపై జబర్దస్త్ ఫేం హైపర్ ఆది సైతం విరుచుకుపడ్డారు.

ఒకడు రాముడు దేవుడే కాదంటాడు

ఒకడు రాముడు దేవుడే కాదంటాడు

కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైన రాముణ్ని తీసుకొచ్చి న్యూస్ ఛానల్‌లో కూర్చోబెట్టేశారని హైపర్ ఆది అన్నారు. ‘ఒకడు రాముడు దేవుడే కాదంటాడు.. ఇంకొకడు సీతను రావణుడి దగ్గరే ఉంచితే మంచిదంటారు.. మరొకడు దశరథుడికి రాముడు పుట్టలేదంటాడు.. మరొకడు రాముణ్ని దగుల్బాజీ అంటాడు.. ఏరా శ్రీరామనవమికి పెట్టే వడపప్పు, పానకం తిని ఒళ్లు పెంచినట్టున్నాం.. ఎలా వచ్చాయిరా ఈమాటలు' అంటూ విమర్శించారు.

పోలీసుల సంచలన నిర్ణయం

పోలీసుల సంచలన నిర్ణయం

అయితే కత్తి మహేశ్‌‌ను నగరం నుంచి బహిష్కరించాలని హైదరాబాద్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా అతడు హైదరాబాద్‌ నగరానికి రాకూడదని ఆదేశాలు జారీచేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారిక ప్రకటన చేశారు.

కత్తి మహేశ్ ను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు అప్పగించారు. ఏపీ పోలీసులు ఆయన్ని స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించారు. హిందూ ధర్మాన్ని, దేవుళ్లను కించపరిచారంటూ కత్తి మహేశ్‌పై గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి ఈ నెల 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు కత్తి మహేశ్ పై కేసులు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లాకు తరలించాం

చిత్తూరు జిల్లాకు తరలించాం

"కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరించాం. ఆయన్ని స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించాం. అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాం. కత్తి మహేశ్‌పై ప్రస్తుతం మూడు కేసులు నమోదయ్యాయి. బహిష్కరణ ప్రస్తుతానికి హైదరాబాద్‌ నగరానికే పరిమితం చేశాం. తెలంగాణ మొత్తానికి బహిష్కరించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చట్టాలను ఉల్లంఘించి ఒకవేళ మళ్లీ అతను నిషేధ సమయంలో హైదరాబాద్‌లో ప్రవేశిస్తే మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అంతేగాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కత్తి మహేశ్‌పై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకుంటాం' అని డీజీపీ తెలిపారు.

అసలు ఈ కత్తి మహేశ్‌ ఎవరు

అసలు ఈ కత్తి మహేశ్‌ ఎవరు

కత్తి మహేశ్‌పై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన తర్వాత టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కత్తి మహేశ్‌ను అదుపులోకి తీసుకొని.. చిత్తూరు జిల్లాకు తరలించారు. అయితే చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని ఆయన స్వగ్రామం ఎలమండకు మహేశ్‌ను తీసుకెళ్లి వదిలిపెట్టనున్నారు. ఇక కత్తి మహేశ్‌ను జిల్లాకు తరలిస్తున్న విషయాన్ని చిత్తూరు పోలీసులను కొందరు విలేకరులు అడిగారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డిని కత్తి మహేశ్ విషయంపై ఆరాతీయగా..

‘అసలు ఈ కత్తి మహేశ్‌ ఎవరు' అంటూ స్పందించారు. కత్తి మహేశ్‌ను జిల్లాకు తీసుకువస్తునట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా తమకు చెప్పలేదని డీఎస్పీ చెప్పడం గమనార్హం. అయితే కత్తి మహేశ్ నగరం నుంచి బహిష్కరించడంతో సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు జనాలు పెడుతున్నారు. హైదరాబాద్ నగరానికి పట్టిన శని వదిలిందని కొందరు పోస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కు పట్టిన మకిలినీ పోలీసులు కత్తి మహేష్ బహిష్కరణతో కడిగేశారంటూ కొందరు పోస్ట్ చేస్తున్నారు.

English summary

kathi mahesh externed from hyderabad for six months

kathi mahesh externed from hyderabad for six months
Story first published: Monday, July 9, 2018, 15:39 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more