వీఎక్స్ న‌ర్వ్ ఏజెంట్‌ తో మనిషి క్షణాల్లో మరణిస్తాడు.. కిమ్ జాంగ్ నామ్ ను అలాగే చంపారు

Written By:
Subscribe to Boldsky

కిమ్ జాంగ్ నామ్.. ఈయన హత్య ఒక మిస్టరీ. కిమ్ జాంగ్ నామ్ ఉత్త‌ర కొరియా అధ్యక్షుడ కిమ్ జాంగ్ ఉన్ కు సోద‌రుడు అవుతాడు. అయితే సొంత సోదరుడు కాదు. వాళ్ల నాన్న రహస్య బంధానికి పుట్టిన వ్యక్తి కిమ్ జాంగ్ నామ్. కిమ్ జాంగ్ నామ్ హ‌త్య‌ అప్పట్లో సంచలనం రేపింది. ప్రపంచం మొత్తం కిమ్ జాంగ్ నామ్ ఎలా చనిపోయాడో అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూసింది. కిమ్ జాంగ్ నామ్ చనిపోయినప్పుడు చాలా నాటకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఏడాది క్రితం జరిగిన కిమ్ జాంగ్ నామ్ హత్య

ఏడాది క్రితం జరిగిన కిమ్ జాంగ్ నామ్ హత్య

కిమ్ జాంగ్ నామ్‌పై విషప్ర‌యోగం జరిగింది. అత్యంత విష‌పూరిత‌మైన వీఎక్స్‌ న‌ర్వ్ ఏజెంట్‌ ఉపయోగించి కిమ్ జాంగ్ నామ్ ను చంపారు. ఏడాది క్రితం జరిగిన కిమ్ జాంగ్ నామ్ హత్యకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇవే.

ఒంటరిగా జీవితం

ఒంటరిగా జీవితం

కిమ్ జాంగ్ నామ్ బతికి ఉన్నంత కాలం ఒంటరిగా జీవితం గడిపాడు. ఉత్తర కొరియా రెండో తరం కమ్యూనిస్టు నేత కిమ్ జోంగ్ ఇల్, ఆయన సహచరి, నటి సంగ్ హే రిమ్ లకు పుట్టాడు నామ్. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఎనిమిదేండ్ల వయసులోనే రష్యాకు వలస వెళ్లాడు. తర్వతా చైనా సహా అనేక దేశాల్లో బతికాడు.

విష వాయువును ముఖంపై కొట్టారు

విష వాయువును ముఖంపై కొట్టారు

అది కౌలాలంపూర్ విమానాశ్ర‌యం. ఇద్దరి మహిళలతో హత్యా ప్రణాళిక రూపొందించారు. వారు నామ్ కు ఎదురుగా వెళ్లి వీఎక్స్‌ అనే ప్రమాదకరమైన విష వాయువును నామ్‌ ముఖంపై కొట్టారు. దీంతో అతను కుప్పకూలిపోయాడు. నామ్‌పై విష‌ప్ర‌యోగం చేసిన ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఒక మ‌హిళ ఎయిర్‌పోర్ట్‌లోనే వాంతులు చేసుకుని సొమ్మ‌సిల్లిపోయింది.

ఆ ఇద్దరూ వీరే

ఆ ఇద్దరూ వీరే

నామ్ ను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ఆ ఇద్దరూ మహిళలు ఒకరు ఇండోనేషియాకు చెందిన సితీ ఐసియా, మరొకరు డోవాన్‌ థి హువాంగ్‌. వీరిని తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.

చాలా ఫన్నీగా చెప్పారు

చాలా ఫన్నీగా చెప్పారు

నామ్ ను హత్య చేసిన ఇద్దరూ మహిళలు పోలీసుల విచారణలో చాలా ఫన్నీగా జవాబులు ఇచ్చారు. తాము చేస్తుంది ఒక అంతర్జాతీయ హత్య అవుతుందని తాము అనుకోలేదన్నారు.

టీవీ షోలో

టీవీ షోలో

తాము ఓ టీవీ షోలో నటించాలనుకున్నామని.. అయితే అందులో భాగంగా తాము చెప్పినట్లు చేయాలని కొందరు చెప్పారని అన్నారు. వాళ్లు చెప్పినట్లు నామ్ మొహంపై వీఎక్స్ చల్లామన్నారు.

ప్రాంక్ లాగా అనుకున్నాం

ప్రాంక్ లాగా అనుకున్నాం

తాము టీవీల్లో ప్రసారమయ్యే ప్రాంక్స్ తరహా లో ఏదో ఒక చిలిపి పని చేస్తున్నామని అనుకున్నామని నిందితురాల్లు ఇద్దరూ చెప్పారు. చిన్న పిల్లలకు రాసే ఈ ఆయిల్ క్లాత్ అద్దుకుని ఎదురుగా వచ్చే వ్యక్తికి పూయాలని వారికి కొందరు చెప్పారంట.

తెలియకుండానే

తెలియకుండానే

దీంతో వారు తెలియకుండానే ఆ పని చేశారంట. అందుకోసం వారిద్దరికీ డబ్బు ఇచ్చారు. అయితే వారికి ఈ విషయం చెప్పిన వ్యక్తులు మాత్రం అడ్రస్ లేకుండా పోయారట.

నిమిషాల్లోనూ చనిపోయాడు

నిమిషాల్లోనూ చనిపోయాడు

కిమ్‌ జాంగ్‌ నామ్ విష ప్రయోగం జరిగిన తర్వాత అత్యంత వేగంగా ప్రాణాలు కోల్పోయాడు. సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో నామ్‌ చనిపోయాడు. కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఫిబ్రవరి 13, 2017న నామ్ మరణించారు.

ఇరు దేశాల మధ్య సమస్య

ఇరు దేశాల మధ్య సమస్య

కిమ్ జాంగ్ నామ్ మరణించిన తర్వాత మలేషియా, ఉత్తర కొరియాల మధ్య చాలా సమస్యలు ఏర్పడ్డాయి. నామ్ కు మలేషియా పోస్టుమార్టం చేయడమేమిటని ఉత్తర కొరియా మండిపడింది. ఈ విషయంలో ఆ రెండు దేశాల మధ్య కొన్ని వైరుధ్యాలు ఏర్పడ్డాయి.

మలేషియా అన్ని విషయాలు చెప్పింది

మలేషియా అన్ని విషయాలు చెప్పింది

నామ్‌పై దాడి, వైద్యం, చావు, పోస్టుమార్టం, ఇలా ప్రతి విషయంలో మలేషియా తర్వాత స్పష్టత ఇచ్చింది. మోతాదుకు మించిన వీఎక్స్‌ విషయం ఇవ్వడం వల్లే నేరుగా అతడి గుండెపై ప్రభావం చూపి అనంతరం ఊపరితిత్తులపై ప్రభావం చూపింది.

శరీరంపై ప్రభావం

శరీరంపై ప్రభావం

ఇలా శరీరంలోని ప్రధాన భాగాలపై తదనంతరం మొత్తం శరీరంపై ప్రభావం చూపి మృత్యువాత పడేలా చేసిందని మలేషియా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. నామ్ పై పది మిల్లిగ్రామ్‌ల వీఎక్స్‌ నెర్వ్‌ను ఉపయోగించినట్లు మలేషియా నిర్దారించింది.

ఉత్తరకొరియా హస్తం

ఉత్తరకొరియా హస్తం

నామ్ హ‌త్య వెనుక ఉత్త‌ర కొరియా హ‌స్తం ఉందని అందరూ భావించారు. అందుకు చాలా కారణాలున్నాయి. 2010లో ఉత్తర కొరియా దేశాధ్యక్షుడిగా కిమ్ జాంగ్ ఉన్ ప్రమాణం చేసినప్పు డు నామ్ వ్యతిరేకించాడు. మూడో తరం వారసత్వం చేపట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను అప్పట్లో నామ్ చెప్పాడు.

కిమ్ జాంగ్ ఉన్

కిమ్ జాంగ్ ఉన్

నామ్ హత్యను కిమ్ జాంగ్ ఉన్ హత్య చేయించారన్న అభియోగాలు ఉన్నాయి. ఉన్ ఆగ్రహానికి గురై.. శవాలుగా తేలినవారిలో ఆయన మామ జాంగ్ సాంగ్ థాయెక్ కూడా ఉన్నారని చెప్తారు. కిమ్ జాంగ్ నామ్‌కు ఈయనే మార్గదర్శి.

వీఎక్స్ న‌ర్వ్ ఏజెంట్‌

వీఎక్స్ న‌ర్వ్ ఏజెంట్‌

ర‌సాయ‌నిక యుద్దాల్లో ఇదో కీల‌క‌మైన ఏజెంట్‌. ఇది చాలా క్లియ‌ర్‌గా ఉంటుంది. రుచి ఉండదు. వాస‌న ఉండదు. నూనె మాదిరిగా ఉంటుంది. దీన్ని ఒక వ్యక్తిపై స్ప్రే చేస్తే అందులోని విషం వెంటనే చ‌ర్మం ద్వారా న‌రాల్లోకి ప్ర‌వేశిస్తుంది.

ఒక్కచుక్కపడినా

ఒక్కచుక్కపడినా

వీఎక్స్ న‌ర్వ్ ఏజెంట్‌ ద్వారా న‌రాల స్ప‌ర్శ ప‌డిపోతుంది. ఒక్క చుక్క వీఎక్స్ న‌ర్వ్ ఏజెంట్ చ‌ర్మంపై ప‌డినా మ‌నిషి క్ష‌ణాల్లో మరణిస్తాడు.

కంటి నొప్పి వ‌స్తుంది.

కంటి నొప్పి వ‌స్తుంది.

ఐక్య‌రాజ్య‌స‌మితి జాబితాలో వీఎక్స్ న‌ర్వ్ ఏజెంట్‌ను మాన‌వ‌హ‌న‌న ఆయుధంగా లిస్ట్ చేశారు. దీని డోసు స్వ‌ల్పంగా ఉన్నా కంటి నొప్పి వ‌స్తుంది.

నిషిద్దం

నిషిద్దం

వీఎక్స్ న‌ర్వ్ ఏజెంట్‌ కొద్దిగా పడ్డా కూడా చూపు మంద‌గిస్తుంది. టెక్నికల్ గా దీన్ని ఎస్‌2 డిసోప్రోఫైల్ అమినోఇథైల్ మిథైల్‌ఫాస్‌ఫోథియేలేట్‌ అంటారు. ఈ ఏజెంట్‌ను 1993లో నిషేధించారు.

Image Credit (All Photos):https://www.mirror.co.uk/all-about/kim-jong-nam

English summary

Kim Jong Nam’s Killing, A Year Later

Kim Jong Nam’s Killing, A Year Later