భర్త చనిపోతే మరిదిని పెళ్లి చేసుకోవొచ్చు.. ఈ ఆచారం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.. ఎక్కడో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

గోదావరి నదిని ఆనుకుని ఉన్న కొండలలో ఆదివాసీలైన కొండరెడ్లు ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నారు. పచ్చని ప్రకృతి మధ్య నివసించే వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వీరి ఆచార, సాంప్రదాయాలు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి.

తెలంగాణ, ఆంధ్రలో

తెలంగాణ, ఆంధ్రలో

కొండరెడ్లు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని, గోదావరి ఉత్తర దిక్కున ఉన్న చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం వరుకు ఉన్నారు.

దక్షిణ దిక్కున

దక్షిణ దిక్కున

దక్షిణ దిక్కున ఉన్న అశ్వరావుపేట, దమ్మపేట, వేలేరుపాడు మండలాల్లో వీరు నివసిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో కూడా కొండరెడ్లు నివసిస్తున్నారు.

తెలుగు భాషనే

తెలుగు భాషనే

కొండరెడ్లు గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. కొండరెడ్లు మాట్లాడేది తెలుగు భాష అయినా వారి భాషకు మన భాషకు కాస్త తేడా ఉంటుంది. ఇక వీరి వ్యవహార శైలిలో కూడా కాస్త ప్రత్యేకమే. వారి ఆచార విధానాల్లో కొన్ని తెలుసుకోండి.

మరిదిని చేసుకోవొచ్చు

మరిదిని చేసుకోవొచ్చు

కొండరెడ్లు పెళ్ళిలో ఖర్చులన్నీ అబ్బాయి తరపు వారే పెట్టుకుంటారు. వీరు వరకట్నం ఆచారాన్ని పాటించరు. కొండరెడ్లు ఎక్కువ మంది భార్యలను కూడా చేసుకోవొచ్చు. విధవ మళ్లీ పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. భర్త చనిపోయిన స్త్రీకి మరిది ఉంటే వివాహం చేసుకోవచ్చు. దాన్ని తప్పుగా భావించరు.

మేనమామ అనుమతి

మేనమామ అనుమతి

అమ్మాయి మేనమామ అనుమతితోనే పెళ్లి కుదుర్చుకుంటారు. ఒకవేళ మేనమామకు కొడుకు ఉన్నట్లైతే, మేన కోడల్ని తన కొడుకుకే జరిపిస్తానని అడ్డుచెప్పితే కుదుర్చుకున్న సంబంధం రద్దవుతుంది. అపుడు ఒక సీసా సారాను అమ్మాయి ఇంట్లోని ఏదేని ఒక ప్రదేశంలో ఉంచి వెనుదిరుగుతారు.

కీడుపాకలో ఉంచుతారు

కీడుపాకలో ఉంచుతారు

పిల్లలకు దిష్టి తగలకూడదని కాటుకను (ఆముదం కాటుక) దిష్టి చుక్కగా పెడతారు. ప్రసవాన్ని కీడుగా, మైలగా భావిస్తారు. కొద్ది రోజుల్లో ప్రసవించబోతుందనుకునే మహిళను, మంత్రసానిని కలిసి వేరే ఇంట్లో అనగా 'కీడుపాక'లో ఉంచుతారు.

11 రోజుల తర్వాత

11 రోజుల తర్వాత

బయటకు రానివ్వరు. ఇంటి నుంచే వారికి భోజనం తీసుకుపోతారు. ప్రసవం జరిగిన 11వ రోజు బాలింతకు స్నానం చేయించి ఇంట్లోకి తీసుకువస్తారు. ఆ తరువాత పాకను తీసి కర్రలు, ఆకులు కాలుస్తారు.

కోడికోస్తారు

కోడికోస్తారు

పిల్లవాడికి దిష్టి తగలకుండా మంచం వద్ద కోడి కోసి నైవేద్యం పెడతారు. కోడికాలు, రెండు అడ్డాకులు, చేట, రోకలి, వింటిబద్దను పిల్లవాడి చేతిలో పెట్టి, ఆ తరువాత వాటిని తీసి మంటల్లో కాల్చుతారు.

రజస్వల అయితే

రజస్వల అయితే

కొండరెడ్లు రజస్వల అయిన అమ్మాయిని దుర్భపాక లేదా కీడుపాకలో ఉంచుతారు. 11వ రోజు స్నానం చేయించి ఇంటికి తీసుకువస్తారు. ఆ తరువాత పాకను కాల్చుతారు. ఈ రోజుల్లో అమ్మాయికి తోడు గ్రామంలోని పెద్ద వయసు స్త్రీలు ఉంటారు.

వస్తువులు తీసుకురారు

వస్తువులు తీసుకురారు

వంటపాత్రలు, సామానులు ఇస్తూపెద్దామె వంట చేసి పెడుతుంది. వంటల్లో కారం, ఉప్పు, అల్లం ఉపయోగించరు. అమ్మాయి ముట్టుకున్న, తిన్న కంచాలను, వస్తువులను ఇంటికి తీసుకురారు. వేరే అమ్మాయి రజస్వల అయితే ఇస్తారు లేదా గోదావరిలో కలుపుతారు.

నోట్ : ఫొటోలు కొండరెడ్లకు సంబంధించినవి కావు.

English summary

konda reddi tribals rooted to traditions

konda reddi tribals rooted to traditions
Story first published: Thursday, February 22, 2018, 16:30 [IST]