కామంధులై పక్కనోడి భార్యను కోరుకునేవారు వాత్స్యాయనుడి కామశాస్త్రం చదివితే ఏమవుతుంది ?

Written By:
Subscribe to Boldsky

వాత్స్యాయనుడి దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది. వాత్స్యాయనుడు కామశాస్త్రాన్ని రాశారు. కామశాస్త్రాన్ని మనదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా బాగా పాప్ లర్. వాత్స్యాయనుడు క్రీ.పూ. ప్రథమ శతాబ్దం వాడనీ కొందరు అంటారు. మరికొందరు ఆయన క్రీ.పూ. మూడో శతాబ్దం వాడని అంటారు.

ఒకటో శతాబ్దం వాడు అనడానికి ఆధారం

ఒకటో శతాబ్దం వాడు అనడానికి ఆధారం

కామ సూత్రాల్లో కుంతల దేశాదీశుడైన శాతకర్ణి శాతవాహసుని ప్రస్తావన కూడా ఉంది. ఇతని భార్య మలయవతి. కామోద్రేకంలో ఇతడు కర్తరిప్రయోగం చేసి భార్యను చంపాడనీ అందుచేత ఉద్రేకంతో ఇలాంటి పనులు చేయరాదని వాత్స్యాయనుడు హెచ్చరిస్తాడు. ఈ రాజు కాలం ఒకటో శతాబ్దం. కాబట్టి వాత్స్యాయనుడు కూడా ఆ కాలం వాడే అయి ఉంటాడనడానికి ఇదొక ఆధారం.

బృహత్ సంహితలో

బృహత్ సంహితలో

ప్రఖ్యాత జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు తన బృహత్ సంహిత 18వ అధ్యాయంలో కామశాస్త్రాన్ని గురించి చెప్పాడు. అతడు చాలా విషయాలు వాత్స్యాయనుడి కామ సూత్రాల నుంచి స్వీకరించినట్టు తెలుస్తోంది. వరాహమిహిరుడి కాలం 6వ శతాబ్దం అని చరిత్రకారుల అభిప్రాయం.

ఆరో శతాబ్దానికి తర్వాత వాడు కాదు

ఆరో శతాబ్దానికి తర్వాత వాడు కాదు

ఈ లెక్కప్రకారం చూసుకుంటే కామ సూత్రాల రచనాకాలం దీనికి పూర్వమే అని అనుకోవలసి వుంది. ఆ విధంగా వాత్స్యాయనుడు క్రీ.పూ. ఒకడో శతాబ్దానికి ముందువాడు. కాని. క్రీ.శ. ఆరో శతాబ్దానికి తరువాతి వాడు కానేకాడని స్పష్టమవుతుంది.

పెద్దపెద్ద కవులకు కూడా కామశాస్త్రంపై గౌరవం

పెద్దపెద్ద కవులకు కూడా కామశాస్త్రంపై గౌరవం

కాళిదాసు, దండి, భవభూతి వంటి గొప్పగొప్ప కవులు కూడా వాత్స్యాయనుడి కామసూత్రాలలోని చాలా అంశాలను వారి కావ్యాల్లో అక్కడక్కడ చర్చించారు. దీన్నిబట్టి కామ సూత్రాలపై పెద్దపెద్ద కవులకు కూడా చాలా సదభిప్రాయం ఉందనే విషయం తెలుస్తుంది.

పతంజలి సమకాలికుడు అంటారు

పతంజలి సమకాలికుడు అంటారు

వాత్స్యాయనుడు కామశాస్త్రాన్ని చాలా మంది కవులు వారి కావ్యాల్లో ప్రస్తావించారు కాబట్టి ఈయన వారందరి కంటే ముందువాడని మనం అర్థం చేసుకోవొచ్చు. కొందరేమో పతంజలి సమకాలికుడని అంటారు.

ప్రపంచంలోని చాలా భాషల్లోకి

ప్రపంచంలోని చాలా భాషల్లోకి

మొత్తానికి వాత్స్యాయనుడి ఏ కాలం వాడనే విషయంపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతారు. అయితే ఈయన రాసిన కామ సూత్రం అనే గ్రంథం.. ఏడు అధికరణాల గ్రంథం. దాదాపు 1250కి పైగా సూత్రాలు, ముప్పయి ఆరుఅధ్యాయాలున్నాయి. ప్రపంచంలోని ప్రధాన భాషలన్నింటిలోకి ఇది తర్జుమా అయ్యింది.

వారణాసిలో విద్యార్థి అట

వారణాసిలో విద్యార్థి అట

వాత్స్యాయనుడు వారణాసిలో విద్యార్థిగా ఉండేవాడట. ఆ సమయంలో వాత్సాయనుడు.. బభర్వ్యుడు, ఇతర ప్రాచీన గ్రంథకర్తల రచనలని చదివి, వారు తెలిపిన నీతినియమాల గురించి ఆలోచించిన తర్వాత కామశాస్త్రాన్ని రాశాడు అంటారు.

లోక కళ్యాణం కోసమేనట

లోక కళ్యాణం కోసమేనట

వాత్స్యాయనుడు రాసిన కామశాస్త్రం లోక కళ్యాణం కోసమేనట.

కేవలము కామం గురించి చెప్పడమేకాకుండా చాలా విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. శాస్త్ర పరిజ్ఞానము కలిగి, ధర్మార్థకామాల గురించి ఎరిగినవాడు, లౌకిక ఆచారాలపై అవగాహన ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహమును తప్పక పొందుతాడనే విశయం కూడా కామశాస్త్రంలో ఉంటుంది.

నిజమే

నిజమే

అవును నిజంగా వాత్సాయనుడి కామశాస్త్రం అంతిమ లక్ష్మం లోకకల్యాణమే. ఏ రాజు మెప్పుకోసమో.. ఏ సంపన్నుడి ఆనందం కోసమో.. క్షణికానందం కోసం పాకులాడే కాముకుల కోసమో వాత్సాయనుడు కామశాస్త్రం రాయలేదు.

సమాజంపై ప్రభావం

సమాజంపై ప్రభావం

వాత్స్యాయనుడు రాసిన కామశాస్త్రాన్ని ఎలా పడితే అలా చదవకూడదు. ఎవరంటే వారు చదవకూడదు. అలా చేస్తే సమాజంపై ప్రభావం పడుతుంది.

అలాంటి వారే చదవాలి

అలాంటి వారే చదవాలి

జితేంద్రియాలు, రాగద్వేషాలు లేని వారు, ధర్మబద్ధులూ, పాపభీతి కలవారు, మంచి ఆరోగ్యవంతులు, కామపురుషార్ధాన్ని ధర్మబద్ధంగా సాధించుకోవాలనుకునే వారు మాత్రమే ఈ శాస్త్రం చదవాలట. ఈ విషయాన్ని వాత్స్యాయనుడు కామశాస్త్రంలో మొదటే పేర్కొన్నాడు.

శృంగారానికి సంబంధించి చాలా విషయాలు

శృంగారానికి సంబంధించి చాలా విషయాలు

శృంగారానికి సంబంధించి చాలా విషయాలు వాత్స్యాయనుడు కామశాస్త్రంలో వివరించారు. కామంధులై పక్కనోడి భార్యను కోరుకునేవారు, వారు చేసే రకరకాల చేష్టలు, వారు పన్నే ఉపాయాలు కామశాస్త్రంలో వివరించాడు వాత్స్యాయనుడు.

నిగ్రహంతో చదవాలి

నిగ్రహంతో చదవాలి

కామశాస్త్రాన్ని సద్భుద్ధితో, నిగ్రహంతో చదివితేవారు పక్కనోడికి భార్యల జోలికిపోరు. సొంత భార్యల పట్లే బాగా ప్రేమ చూపుతారు. వాత్స్యాయనుడు ఒక హెచ్చరిక చేశాడు. ఒక పురుషుణ్ణి. స్త్రీ ప్రేమించాలంటే, ఆమె ప్రేమించగల లక్షణాలు అతనిలో వుండాలి.

ఎంతటి ధనవంతుడైనా

ఎంతటి ధనవంతుడైనా

అలాటి గుణాలుంటేనే ఆ స్త్రీకి అతను ప్రియుడు కాగలుగుతాడు. పురుషుడు ఎంతటి ధనవంతుడైనా, స్త్రీ ప్రేమించగల లక్షణాలు లేకపోతే, ఆమెకు నిజమైన ప్రియుడు లేదా భర్త కాలేడు.

శృంగార విషయాల గురించి తెలుసుకుందాం

శృంగార విషయాల గురించి తెలుసుకుందాం

ఇవి వాత్స్యాయనుడి గురించి క్లుప్తంగా వివరాలు. మరో ఆర్టికల్ లో కామశాస్త్రం గురించి, దీన్ని అనువదించిన సర్ రిచర్డు బర్టన్, ఎస్.ఎఫ్. ఆర్బత్ నాట్ ల గురించి, కామశాస్త్రం చెప్పే శృంగార విషయాల గురించి తెలుసుకుందాం.

English summary

Lesser known Facts About Vatsayana

The land of India is known all over the world as the land of Kama Sutra. The book was written by Vatsayana. We will now in this article discuss about who actually Vatsayana was and what was his contribution. He was a very learned man. He was known for the great knowledge of Vedas that he had. The exact time of his life cannot be dated. However, the historians believe that he flourished during the Gupta period. This would be fourth to sixth century. He was born in India.
Story first published: Monday, February 19, 2018, 18:30 [IST]