నిద్రపోతే చచ్చిపోతాడు.. అయినా నిద్రపోకుండా బతుకుతున్నాడు

Written By:
Subscribe to Boldsky

ఒక్క రోజు నిద్రపోకుండా పని చేస్తేనే మనమంతా చాలా గొప్పగా చెప్పుకుంటా. నిన్న నేను నిద్రపోకుండా పని చేశానని అంటాం. కానీ అతను మాత్రం ఏళ్ల తరబడి నిద్రపోవడం లేదు. ఆ మధ్య నిఖిల్ హీరోగా సూర్య వర్సెస్‌ సూర్య అనే ఒక సినిమా వచ్చింది. అందులో నిఖిల్ ఉదయం పూట బయటకు వస్తే సూర్యుడి కిరణాల మరణించే డిసీజ్ తో బాధపడుతుంటాడు. అలాగే ఇతను కూడా నిద్రపోతే మరణిస్తాడు.

కుల్లు రాజకీయాల మధ్య కాసింత సేపు నిద్ర అవసరం

కుల్లు రాజకీయాల మధ్య కాసింత సేపు నిద్ర అవసరం

రోజూ ఆఫీసులో ఒత్తిళ్లతో, కోలిగ్స్ కుల్లు రాజకీయాల మధ్య గడిపే మనకు కాసింత సేపు నిద్ర చాలా అవసరం. అలాగే ప్రతి మనిషికి

ఆరు గంటల నిద్ర అవసరమని డాక్టర్లు కూడా చెబుతారు. లేదంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే కచ్చితంగా నిద్రపోవాల్సిందే.

నిద్రపోతే చనిపోతాడు

నిద్రపోతే చనిపోతాడు

అయితే ఆ యువకుడు మాత్రం నిద్రపోతే చనిపోతాడు. ఒక వింత వ్యాధితో స్ట్రగుల్ అవుతున్న అతనికి సంబంధించి గతంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వెలువడ్డాయి.

అరుదైన వ్యాధి

అరుదైన వ్యాధి

ఆయన పేరే లియామ్ డెర్బీషైర్. ఇతనిది బ్రిటన్. లియామ్ డెర్బీషైర్ 'సెంట్రల్ హైపోవెంటిలేషన్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.

పొరపాటున నిద్రపోతే

పొరపాటున నిద్రపోతే

సెంట్రల్ హైపోవెంటిలేషన్ అనే వ్యాధితో బాధపడేవారు పొరపాటున నిద్రపోయినా కూడా చనిపోతారు. ఇక ఈ వ్యాధితో లియామ్ డెర్బీషైర్ తన పుట్టుక నుంచే బాధపడుతున్నాడు.

బతికే ఛాన్స్ లేదు

బతికే ఛాన్స్ లేదు

అప్పట్లో లియామ్ బతికే ఛాన్స్ లేదని ఆరు వారాలకు మించి బతకడని కూడా వైద్యులు తేల్చి చెప్పారు. తమ కుమారుడిని బతికించుకోవాలనే ఉద్దేశంతో అతని తల్లిదండ్రులు అన్ని రకాలుగా ప్రయత్నించారు.

కంటికి రెప్పలా

కంటికి రెప్పలా

లియామ్ నిద్రపోతే అతని ఊపిరితిత్తులు ఆగిపోకుండా చూడాల్సిన అవసరం వచ్చింది. సూర్య వర్సెస్ సూర్య మూవీలో ఎలాగైతే నిఖిల్ ను వాళ్ల అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటుందో అలాగే లియామ్ డెర్బీషైర్ ను కూడా అతని తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది

శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది

అయితే ఇలాంటి వ్యాధితో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,500 మంది ఉన్నారు. వారు నిద్రాణ స్థితిలో ఉంటే వారి ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. దీంతో వారు నిద్రలోకి జారుకున్న వెంటనే శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యనే లియామ్ డెర్బీషైర్ ఎదుర్కొంటున్నాడు.

ప్రత్యేక బెడ్ రూమ్

ప్రత్యేక బెడ్ రూమ్

లియామ్ డెర్బీషైర్ కోసం ప్రత్యేకంగా బెడ్ రూం ఏర్పాటు చేశారు లియామ్ తల్లిదండ్రులు. అందులో లియామ్‌ నిద్రలోకి జారుకున్న తర్వాత కృత్రిమ శ్వాసను అందేలా ఏర్పాట్లు చేశారు. గుండె ద్వారా ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్‌ అందేలా చేశారు.

ప్రత్యేక పరికరాలు

ప్రత్యేక పరికరాలు

కృత్రిమ శ్వాస ద్వారా గుండె, ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్‌ అందుతుంది. ఈ సేవల కోసం అతడి బెడ్‌రూమ్‌లో ప్రత్యేక పరికరాల్ని అమర్చారు. వీటి ద్వారా నిరంతరం అతడి గుండె పనితీరు, ఇతర అవయవాల్ని పరిశీలిస్తూనే ఉండాలి. తెలివిలో లేకుంటే శ్వాస పీల్చడం మర్చిపోతుంది ఇతడి శరీరం.

పర్యవేక్షణ

పర్యవేక్షణ

అయితే లియామ్ నిద్రలోకి జారుకున్న అనంతరం ఈ ప్రక్రియను నిరంతరం ఒకరు పర్యవేక్షిస్తుంటారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా లియామ్ కోసం అతని తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు.

ప్రత్యేక నిపుణుడు

ప్రత్యేక నిపుణుడు

లియామ్ డెర్బీషైర్ బెడ్ రూంలో జరిగే ప్రతి అంశాన్ని సమన్వయంతో అతని తల్లిదండ్రులతో పాటు ఆ ప్రత్యేక నిపుణుడు పరిశీలిస్తూ ఉంటారు. ఇలా 19 ఏళ్లుగా లియామ్ డెర్బీషైర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అతని తల్లిదండ్రులు.

ఆరువారాలకు మించి

ఆరువారాలకు మించి

గతంతో ఒక ఆరు వారాలకు మించి బతకడం అసాధ్యం అని చెప్పిన వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ లియామ్ డెర్బీషైర్ రోజూ మృత్యువుని ఓడిస్తూనే బతుకుతూనే ఉన్నాడు.

చల్లగా ఉండాలని కోరుకుందాం

చల్లగా ఉండాలని కోరుకుందాం

‘సెంట్రల్‌ హైపోవెంటిలేషన్‌' లేదా ‘ఆన్‌డైన్స్‌ కర్స్‌' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న లియామ్ డెర్బీషైర్ పై వందేళ్ల పాటు దేవుడి దయ ఉండాలని కోరుకుందాం. అతను చల్లగా ఉండాలని ప్రార్థిద్దాం.

Image SourceImage Credit

English summary

liam derbyshire could die if he falls asleep

liam derbyshire could die if he falls asleep