ప్రేమికుల రోజు సందర్భంగా వాడే ప్రేమ చిహ్నాలు గురించి మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రేమికుల రోజు అదేనండి వాలెంటైన్స్ డే అతి త్వరలో రాబోతుంది. ఈ రోజుని, ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ నలుమూలల, కొన్ని కోట్ల జంటలు ఎంతో వైభవంగా ఈ రోజుని జరుపుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఈ రోజుని మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి జంటలు ఒకరికొకరు విభిన్నరకాలైన బహుమతుల దగ్గర నుండి రోజా పూలు, టెడ్డి బేర్ లు మరియు హృదయ ఆకారంలో ఉన్న లాకెట్లు ఇలా ఎన్నింటినో బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన ప్రేమికుల రోజు సందర్భంగా పురుషులు, వారు ప్రేమించే స్త్రీలను విపరీతంగా పొగుడుతుంటారు మరియు విభిన్న రకాల వస్తువులను వారికి బహుమతులుగా ఇచ్చి, వారిని ఆనందపరచాలని ప్రయత్నిస్తుంటారు. మీరు కూడా ఇలానే గనుక ఆలోచిస్తున్నట్లైతే, సాధారణంగా స్త్రీలు ఎప్పుడు గాని బహుమతులను తీసుకొనే పాత్రని పోషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో, ఇలాంటి వ్యవహారం మరింత ఎక్కువగా ఉంటాయి. ఇది నిజమే కదా !

మీరు గనుక వాలెంటైన్స్ డే ని అర్ధవంతంగా జరుపుకోవాలని భావించినట్లైతే, ఆ రోజుకు మరింత విలువని చేర్చినట్లు అవుతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఎన్నో రకాల చిహ్నాలు ఉన్నాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తారు అనే విషయం మీకు తెలుసా ? సాధారణంగా చాలామంది వ్యక్తులు రోజా పూలు మరియు చాకోలెట్స్ నే ఈ రోజున తమ భాగస్వామికి ఇవ్వడానికి, ఉత్తమమైన బహుమతులుగా భావిస్తుంటారు. కానీ, అంతకు మించిన బహుమతులు చాలా ఉన్నాయి. నోరూరించే చాక్లేట్లు మాత్రమే కాకుండా ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమను తెలియజేయడానికి, వివిధరకాల చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ ప్రేమ చిహ్నాలు సరైన పద్దతిలో గనుక వాడినట్లైతే, ప్రేమకు ఎంతో ప్రత్యేకమైన ఈరోజుకి మరింత అర్ధాన్ని చేకూర్చినట్లు అవుతుంది.

మీ ప్రేమికుల రోజుని మీరు అర్ధవంతంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లైతే, ప్రేమికుల రోజు సందర్భంగా ప్రత్యేకంగా నిలిచే ఈ ప్రేమ చిహ్నాల గురించి తెలుసుకొని, వీటిని వాడటానికి ప్రయత్నించండి.

మన్మధుడు :

మన్మధుడు :

ప్రేమికుల రోజు సందర్భంగా వాడే అతి ముఖ్యమైన చిహ్నాలలో మన్మధుడు కూడా ఒకటి. ఇతడి బాణాలు కంటికి కనపడవు. కానీ, ఆ బాణాల బాధితులు ఎవరైతే ఉన్నారో, వారు వారికి తెలియకుండానే ప్రేమలో పడిపోతారు. మీరు గనుక మన్మధుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

రోజా పూలు :

రోజా పూలు :

మీరు విన్నది నిజమే. రోజా పూలు అభిరుచికి చిహ్నంగా నిలుస్తాయి. సహృద్ వాతావరణాన్ని తెలియజేస్తాయి మరియు సున్నితత్వాన్ని ప్రతీకగా నిలుస్తాయి. ప్రేమికుల రోజుకి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఎందుకంటే, దీని రంగు హృదయపు రంగుని పోలి ఉంటుంది.

బాణానికి హృదయం ఉండే ఆకారం :

బాణానికి హృదయం ఉండే ఆకారం :

సాధారణంగా ప్రేమికుల రోజు సందర్భంగా ఎంతో మంది జంటలు ఒకరికొకరు ఎరుపు రంగు హృదయాన్ని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. బాణానికి హృదయం ఉండే చిహ్నం, స్త్రీ పురుషుల కలయికను తెలియజేస్తుంది.

నాడా :

నాడా :

ప్రేమికుల రోజు నాడు నాడా కూడా ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. అందుచేతనే ఆ రోజు ఇచ్చే బహుమతులన్నింటికీ నాడా లాంటి రిబ్బన్లను కట్టి ఇస్తుంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం, స్త్రీలు ఈ రకమైన నాడా లాంటి రుమాలు లను తీసుకువెళ్ళేవారు మరియు వారు గనుక ఏ పురుషుడి వెనుక అయినా వీటిని పడేసినట్లైతే, ఆ పురుషుడు గనుక ఆ రుమాలుని తీసుకున్నట్లైతే, అది ఇద్దరి మధ్య ప్రేమ చిగురింప జేయడానికి మొదటి అడుగు అని, ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది అని అర్ధం.

పావురాలు :

పావురాలు :

ప్రేమికుల రోజు సందర్భంగా అత్యంత అందమైన ప్రేమ చిహ్నాలలో పావురాలు కూడా ఒకటి. ఇందుకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటంటే ఈ అందమైన పక్షులు జీవితాంతం ఒకే భాగస్వామిని కలిగి ఉంటాయి. ఇవి ప్రేమను మరియు విధేయతను తెలియజేస్తాయి. అందుచేతనే జంటలు ఈ స్నేహపూర్వక పక్షులను ప్రేమికుల రోజు సందర్భంగా బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటారు.

కార్డ్స్ :

కార్డ్స్ :

ఒక వ్యక్తిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు, వారు మీ జీవితానికి ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఇది ఒక చక్కటి మార్గం. పూర్వపు రోజుల్లో ప్రేమించే వారికి కార్డు ని ఎర్రటి మైనంతో సీలు వేసి, రహస్యంగా వారి ఇంటి గడప ముందు పెట్టేవారు. ప్రేమికుల రోజు సందర్భంగా వాడే సాధారణమైన ప్రేమ చిహ్నాల్లో ఇది కూడా ఒకటి.

చొక్కా పై హృదయపు బొమ్మ :

చొక్కా పై హృదయపు బొమ్మ :

చాలా మంది యుక్త వయస్సులో ఉన్న యువకులు, వారి యొక్క చొక్కా పై హృదయపు ఆకారం ఉన్న బొమ్మని ముద్రించుకొని దాని లోపల వారికి ఇష్టమైన భాగస్వామి పేరుని రాసుకొని ఉంటారు. ఈ రకమైన చిహ్నాన్ని ప్రేమికుల రోజున ధరిస్తే తన చొక్కా పై ఎవరి పేరు అయితే రాసి ఉందొ ఆ వ్యక్తితో యితడు ప్రేమలో ఉన్నట్లు అర్ధం.

ప్రేమ పక్షులు :

ప్రేమ పక్షులు :

ఎందుకు ప్రేమ పక్షులను ప్రేమికుల రోజునాడు జంటలు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటారు అనే విషయం తెలిసినట్లైతే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రేమ పక్షులు ఫిబ్రవరి 14 నాడు తమ భాగస్వామిని ఎంచుకుంటాయట. అందుచేతనే ఈ ప్రత్యేకమైన రోజున ఎన్నో జంటలు వీటిని బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటారు.

English summary

Valentines Day Symbols | Valentines Day Symbol Meanings | Valentines Day 2014

When you celebrate Valentines day with a meaning, it is much more valuable. Did you know that there are a number of symbols when it comes to Valentines Day. People always thought that only roses and chocolates were the ideal gift in giving your partner, but there is much more. Apart from yummy mouth watering chocolate, there are a few more love symbols for Valentines day. These love symbols for valentines day add more meaning to this special day of love.
Story first published: Saturday, February 10, 2018, 16:30 [IST]