అరుదైన వ్యాధితో ఎనిమిదేళ్ల వ‌య‌సులో మృత్యువుతో పోరాటం! చివ‌రికి ఏమైంది!

Posted By: KrishnaDivYa P
Subscribe to Boldsky

ఆమె పేరు లూసీ పార్క్‌. త‌న హృద‌య విదార‌క రూపంతోనే ఆమె ఈ ప్ర‌పంచంలోని అంద‌రికీ ప‌రిచ‌యం అయింది. అసాధార‌ణ వ్యాధితో బాధ‌ప‌డిన ఆమె వెన‌క ఒక క‌న్నీటి క‌థ ఉంది.

Lucy Parke

త‌న వ‌య‌సు స్నేహితుల‌తో పోలిస్తే అత్యంత వేగంగా ఎదిగి వృద్ధాప్యంలోకి ప్ర‌వేశించి ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే త‌నువు చాలించింది. త‌న‌కున్న అసాధార‌ణ వ్యాధితో పోరాడి పోరాడి అల‌సిపోయి.. చివ‌రికి ఓట‌మిని అంగీక‌రించి ప్రాణాలు కోల్పోయిన లూసీ పార్క్ క‌థ మీ కోసం!

పుట్టిన‌ప్పుడు అంద‌రిలాగే

పుట్టిన‌ప్పుడు అంద‌రిలాగే

లూసీ పార్క్ పుట్టిన‌ప్పుడు అందిరిలాగే ఉంది. ముద్దుముద్దు చేష్ట‌ల‌తో ఇంటిల్లిపాదిని అల‌రించింది. సాధార‌ణంగానే క‌నిపించింది. తొమ్మిది నెల‌ల వ‌య‌సులో హ‌చిస‌న్ గిల్‌ఫోర్డ్ సిండ్రోమ్ అనే వ్యాధి రావ‌డంతోనే అంతా మారిపోయింది.

ఇదీ ప‌రిస్థితి

ఇదీ ప‌రిస్థితి

హ‌చిస‌న్ గిల్‌ఫోర్డ్ సిండ్రోమ్‌ను ప్రొగెరియా అనీ అంటారు. చాలా అరుదుగా వ‌చ్చే వ్యాధి ఇది. కొత్త‌గా పుట్టిన 80 ల‌క్ష‌ల మంది చిన్నారుల్లో ఒక‌రికి సంభ‌విస్తుంది. ఈ వ్యాధి ప్ర‌భావం చాలా వేగంగా ఉంటుంది. మ‌నిషిని తొలిచేస్తుంది. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కే వ‌స్తుంది.

అప్ప‌డు క‌నిపించ‌లేదు

అప్ప‌డు క‌నిపించ‌లేదు

లూసీ జ‌న్మించినప్పుడు ఆమెలో హ‌చిస‌న్ గిల్‌ఫోర్డ్ సిండ్రోమ్ ల‌క్ష‌ణాలేవీ క‌నిపించ‌లేద‌ని అన్నారు. చిన్నారి ఎదుగుతున్న క్ర‌మంలో 9-24 నెల‌ల కాలంలో ఈ వ్యాధి తాలూకా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. త‌న వ‌య‌సు పిల్ల‌తో పోలిస్తే ఈ వ్యాధి వ‌చ్చిన చిన్నారులకు మ‌న ఊహించ‌నంతగా చాలా వేగంగా వ‌య‌సు పెరుగుతుంది.

ఎంత బాధ‌ను అనుభించిందో

ఎంత బాధ‌ను అనుభించిందో

లూసీ ప‌రిస్థితి విచారంగా ఆమెను త‌ల్లిదండ్ర‌లు అంద‌రి పిల్ల‌లాగే పెంచారు. ఎంత బాధ‌గా ఉన్న దానిని దిగ‌మించి పైకి న‌వ్వుతూ క‌నిపించేవారు. లూసీని ఆనందంగా ఉంచేవారు. లూసీ కూడా త‌న స్నేహితుల‌తో అలాగే ఉండేది. చిన్న వ‌య‌సులోనే లూసీ ఆర్థ‌రైటిస్‌, హృద్రోగాల‌తో బాధ‌ప‌డింది. ఇవే కాకుండా మోకాళ్లు, కీళ్ల స‌మ‌స్య‌లు ఆమెను వేధించేవి. తిన‌డానికి స‌హించేది కాదు. దాంతో బ‌రువూ పెర‌గ‌లేదు. వీటితో పాటు ఆమె పిరుదుకు శ‌స్త్ర‌చికిత్స కూడా జ‌రిగింది.

మిత్రుల‌ను క‌లిసేది

మిత్రుల‌ను క‌లిసేది

త‌మ కుటుంబం చాలాచోట్ల‌కు ప్ర‌యాణించేద‌ని లూసీ త‌ల్లి చెప్పింది. ఆమెలాగే ఆదే వ్యాధితో బాధ‌ప‌డే చిన్నారుల‌ను లూసీ క‌లిసేదని పేర్కొంది. తాము ఇట‌లీ, ఇంగ్లాండ్‌లో రెండు ప్రాంతాల‌కు వెళ్లామంది. అక్క‌డ త‌న‌లాగే బాధ‌ప‌డే చిన్నారుల‌ను లూసీ క‌లిసేది. ఆమెకు చాలా సిగ్గు. కానీ ఒక్క‌సారి వారితో ఆడుకోవ‌డం మొద‌లుపెడితే ఇక వ‌దిలేదు కాదని పేర్కొంది.

చివ‌రికి మృత్యువే నెగ్గింది

చివ‌రికి మృత్యువే నెగ్గింది

ఎనిమిదేళ్ల వ‌య‌సులో లూసీ మృత్యువుతో జ‌రిపిన పోరాటంలో ఓడిపోయింది. ఈ విష‌యం తెలియ‌డంతో త‌ల్లిదండ్ర‌లు, కుటుంబ స‌భ్యులు, తెలిసిన వారు శోక‌సంద్రంలో మునిగిపోయారు. అలాంటి ఘోర ప‌రిస్థితుల్లోనూ లూసీ పోరాటాన్ని చూసిన వారంతా ఎంతో ప్రేర‌ణ పొందేవారు. లూసీ ఇంకా గుర్తుచేసుకుంటున్నారు.

English summary

She Aged 8 Times Faster Than A Normal Kid & Died At The Age Of 8!

Lucy Parke suffered from Hutchinson Gilford Progeria syndrome in which the patient is believed to rapidly age faster than a regular individual. Lucy died at the tender age of 8 and her parents are sharing her story to spread awareness of this condition.
Story first published: Saturday, January 20, 2018, 14:30 [IST]