For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కత్తి మహేశ్ ట్వీట్స్: సీత రావుణుడితోనే ఉంటే బాగుండు, అంగ చూషణ చేస్తారో చేసుకోండి, మేమూ బాగానే ఉంటాం

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన అరెస్ట్ అయ్యాడు. మళ్లీ బయటకు వచ్చాడు. మళ్లీ రాముడి గురించి ఒక ట్వీట్ చేశాడు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్.

|

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన అరెస్ట్ అయ్యాడు. మళ్లీ బయటకు వచ్చాడు. మళ్లీ రాముడి గురించి ఒక ట్వీట్ చేశాడు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు కత్తి మహేశ్ పై హైదరాబాద్ లోని కేబీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతూ..

' రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా' అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హిందూ సంఘాలు మండిపడ్డాయి

హిందూ సంఘాలు మండిపడ్డాయి

దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బయటికొచ్చారు

బయటికొచ్చారు

మొత్తానికి కత్తి మహేష్‌ బయటికొచ్చారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఆయన్ని తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి విచారణ కోసం స్టేషన్‌కి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన్ని ప్రశ్నించారు. అయితే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పటంతో.. వివరణ కోరుతూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారని, దర్యాప్తునకు సహకరించమని కోరారని కత్తి మహేష్‌ తెలిపారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలి అంటూ ఫేస్‌బుక్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.

మళ్లీ పోస్ట్ చేశాడు

మళ్లీ పోస్ట్ చేశాడు

అయితే అంతటితో ఆగకుండా మరో పోస్టుతో ఆయన దుమారం రేపారు. ‘శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన రామాయంలోని యుద్ధకాండలోని కొంత భాగాన్ని' ఆయన పోస్ట్‌ చేశారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని తన వ్యాఖ్యలను మహేష్‌ సమర్థించుకుంటున్న విషయం తెలిసిందే.

రాముడు సీతనుద్దేశించి

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనువదించిన రామాయణం లో యుద్ధకాండలో రాముడు సీతనుద్దేశించి" సద్వంశంలో పుట్టినవాడు పౌరుశవంతుడయితే, పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు. ఇంత కాలానికి నువ్వు రావణుని ఓడిలోనుండి దిగివచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూసాడు. ఇక నా కులం పాడుచేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్లీ తెచ్చుకోవడానికి నిన్ను సాధించాను. నాకు నీయెడల ఆసక్తి లేశమూ లేదు.యథేచ్ఛగా వెళ్లిపో. ఇది నేను దృఢ నిశ్చయంతో చెప్పినమాట కానీ వేళాకోళం కాదు."

రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు

రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు

"కనుక లక్ష్మణుని దగ్గరకో, భరతుని దగ్గరకో, వానరేంద్రుడైన సుగ్రీవునిదగ్గరకో, రాక్షసేన్ద్రుడయిన విభీషణునిదగ్గరకో వెళ్లి కాలం గడుపుకో. నువ్వు చక్కని దానవు. నాగరికత కలదానవు. వంట ఇల్లు జొచ్చిన కుందేలులాగా తన ఇంటో ఉన్నదానవు. సహజంగా దుష్టుడయిన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు" అని చాలా కఠినంగా చెప్పాడు. లాలనపాలనలు ఎదురుచూస్తూ ఉన్న సీత ఇది విని ఏనుగు చేతచిక్కిన సల్లకీలతలాగా వడవడ వొణికిపోతూ కన్నీరు విడిచింది.

ఆధారం: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం మూడవ సంపుటం. మనసు ఫౌండేషన్ ప్రచురణ.

కాబట్టి, సీతను రావణునిదగ్గర కే తిరిగి వెళ్ళిపొమ్మన్నది సాక్షాత్తు సీత భర్తయిన శ్రీరాముడే. ఆ తరువాతే మణిరత్నం అయినా, బాబు గోగినేని అయినా లేదా నేనైనా అన్నది. అంటూ మహేశ్ కత్తి పోస్ట్ చేశాడు.

హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు

కత్తి మహేశ్ మోదీపై ప్రయోగించిన ఒక ఉపమానం కూడా ఆ మద్య వివాదంగా మారింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు టక్కున స్పందించేసి.. మహేశ్ ను అడ్డంగా బుక్ చేశారు. సోషల్ మీడియా ద్వారానే మహేశ్ ట్వీటును పోలీసుల పరిగణనలోకి తీసుకెళ్లారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కత్తి మహేశ్ ట్వీటును రాజాసింగ్ రీట్వీట్ చేయడం, దాన్ని హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేయడం, ఆ వెంటనే పోలీసులు స్పందించేయడం.. చర్యలు తీసుకుంటామని వాళ్లూ ట్వీట్ చేయడం చకచకా జరిగిపోయాయి.

హైదరాబాద్ పోలీస్ నుంచి స్పందన వచ్చింది

కత్తి మహేశ్.. నరకహంతక మోడీ.. అని సంబోధించడం పట్ల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం చెప్పారు. పాపులారిటీ కావాలనుకున్న వాళ్లంతా మోడీని విమర్శిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ప్రధానిని అలా సంబోధించడం పట్ల అభ్యంతరం చెబుతూ హైదరాబాద్ పోలీస్ ట్విటర్ అకౌంట్ ను ట్యాగ్ చేశాడాయన.

ఈ విషయంపై స్పందిస్తూ..తగిన చర్యలు తీసుకుంటాం.. సార్ అని హైదరాబాద్ పోలీస్ నుంచి స్పందన వచ్చింది. మోడీని నరహంతకుడు అన్నందుకు అప్పట్లో కత్తి మహేశ్ పై దుమారమే రేగింది.

మేమంత బాగానే ఉంటాంపై ఆది మండిపడ్డాడు

ఇక కొన్ని రోజుల క్రిత జబర్దస్త్ కామెడీ షోలో తన ఆకారంపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించిన విషయం కూడా వివాదంగా మారింది. ఇక ఆదితో ఫోటో దిగి..

"కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్ ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెదవలు అయ్యేది మీరే!" అని పోస్ట్ చేయడంపై ఆది అప్పట్లో కత్తి మహేశ్ పై మండిపడ్డారు. నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను. నీవు నన్ను ఉద్దేశించి వెధవ అని అంటావా? నాతో దిగిన ఫొటోను నీవు అలా వాడుకొంటావా అని నిలదీశాడు.

అంగ ప్రదక్షిణ చేసుకోండి లేదా అంగచూషణ చేస్తారో

అభిమానులు అంగ‌చూష‌ణ చేసుకోండి.. బ్రోక‌ర్లు.. ఎద‌వ‌లు అంటూ చాలా అద్భుత‌మైన ప‌దాలంక‌ర‌ణ‌తో కత్తి మహేశ్ ఆ మధ్య ట్వీట్స్ చేశారు. మీ దేవుడికి పొర్లు దండాలు పెట్టుకొంటారో.. అంగ ప్రదక్షిణ చేసుకోండి లేదా అంగచూషణ చేస్తారో మీ ఇష్టం అని కత్తి మహేశ్ పెట్టిన పోస్టుపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

"బాబులు!! మీ దేవుడికి మీరు పొర్లుదండాలు పెడతారో, అంగప్రదక్షిణలే చేస్తారో లేదా ఏకంగా అంగ చూషణ చేస్తారో చేసుకొండి. ఇంకోసారి "నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్" అని నాకు కాల్ వస్తే, నేను ఆచ్ఛ తెలుగులో ఆ ముక్కే చెబుతాను."

" మీరు పెట్టిన పోస్టును మీరు చదువుకోగలవా? మీ పోస్ట్ చదివితే తంతారు.. ఆ పోస్ట్ చదివితే పవన్ ఫ్యాన్స్ కాదు.. ప్రతీ హీరో ఫ్యాన్స్ కొడుతారు. అంగచూషణ అంటూ పెట్టిన పోస్ట్ చూస్తే ప్రపంచంలో ఎవరూ గౌరవించరు. నీవు పెట్టిన పోస్టును ఎవరూ సమర్థించారు. " అంటూ అప్పట్లో ఆ పోస్ట్ పై ఆదితో పాటు పవన్ ఫ్యాన్స్ కత్తిపై ఫైర్ అయ్యారు.

వాక్ స్వాతంత్ర్యం ఉంది క‌దా

ఇక ఆ మధ్య టీవీ ఛానెల్స్ లో మొత్తం కత్తి మహేశ్ కనేపడేవాడు. మహేశ్ కత్తి ఏం చెప్పినా న్యాయమే. ఎందుకంటే ఆయ‌న‌కు వాక్ స్వాతంత్ర్యం ఉంది క‌దా.! కత్తి మహేశ్ తాను చెప్పేదంతా కరెక్ట్ నని, జనాలే వెర్రిపప్పలు అర్థం చేసుకోలేపోతున్నారని ఫీలైపోతుంటారు. తనంత మేధస్సు ఇంకెవ్వరికీ లేదని ఆయన భావన. కానీ తన మాటల్లోని తర్కం ఏమిటో ఇంకా ఎవ్వరికీ బోధపడడం లేదు.మొత్తానికి మహేశ్ కత్తి ర‌చ్చ ఇప్ప‌ట్లో తెగుతుందా లేదంటే ఇంకా ఇలాగే కొనసాగుతుందో అని జనాలు అనుకుంటున్నారు. మొత్తానికి ఆయన ట్వీట్ చేసినట్లే వివాదాన్ని క్రియేట్ మళ్లీ డిబేట్స్ కు హాజరవుతున్నాడు.

English summary

mahesh kathi sparks row with comments on ramayana

mahesh kathi sparks row with comments on ramayana For me, Ramayana is just a book and Sri Rama is a character. He might be a great person but I believe he is a fool. I wish Sita lived with Ravana and maybe that would have brought her justice.”
Story first published:Tuesday, July 3, 2018, 17:29 [IST]
Desktop Bottom Promotion