For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొడవపడితే, ప్రతీకారంకోసం ఇలా కూడా చేస్తారా?

|

సహోద్యోగులతో అపార్ధాలు, గొడవలు కార్యాలయాలలో సర్వసాధారణంగా ఉంటుంది. అవేమీ లేని, వృత్తిపరమైన సంతోషకర వాతావరణం పూర్తి స్థాయిలో ఉండాలి అని కోరుకోవడం, అత్యాశే అవుతుంది. గొడవలు ఎలా అయితే సాధారణంగా ఉంటాయో, ప్రతీకారాలు కూడా అంతే సాధారణంగా ఉంటాయి. వృత్తిపరంగానే ఉండాలి ఏదేమైనా. కానీ వ్యక్తిగతంగా తీసుకున్న కొందరు కొన్ని వికృత చేష్టలకు పాల్పడుతుంటారు కూడా. ఇలాంటి వాటికి కొన్ని, అపోహలు కూడా కారణమవుతుంటాయి.

జీవితంలో ఇటువంటి ప్రతీకారాన్ని చూడమేమో అన్నట్లుగా కనిపించే ఈ వికృతమైన చర్యను చూస్తుంటే అసహ్యంగా తోస్తుంది. అది కూడా ఒక మహిళ విషయంలో ఇలా జరగడం దారుణమైన విషయం. తను తాగిన డ్రింక్స్లో తన సహోద్యోగి సెమెన్ ఉందని తెలుసుకున్న ఆవిడ పరిస్థితి నిజంగా వర్ణనాతీతమనే చెప్పాలి. ఇలాంటి వ్యక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా అని అనిపించే హేయమైన చర్యకు తార్కాణం ఈ ఉదంతం.

వినడానికే వికృతంగా ఉంది కదా. 62 సంవత్సరాల వయసున్న రాబర్ట్ టైసన్ అనే వ్యక్తి, ఆఫీస్లో తన బాస్ విధివిధానాలు నచ్చక ప్రతీకారేచ్చతో ఈ దారుణమైన పనికి ఒడిగట్టాడు.

ఫ్లోరిడాలో జరిగిన ఈ ఉదంతంలో, నివేదికల ప్రకారం తన బాస్ మీద రివేంజ్ తీర్చుకునే క్రమంలో, ఆవిడ తీసుకునే డ్రింక్స్లో తన సెమెన్ కలిపాడు.

రుచి, వాసనలు మరియు పదార్ధాల ఉనికి కారణంగా గమనించిన బాస్, సెమెన్ మిక్స్ అయిందని నిర్ధారణకు వచ్చింది. క్రమంగా సి.సి.టీవీ గమనించగా, తాను డెస్క్ వద్ద లేని సమయంలో అతను ఈ పనికి ఒడిగట్టినట్లుగా తేలింది.

విషయం నిర్ధారణ జరిగాక, తప్పు క్షమించమని అపాలజీ లెటర్ రాసిచ్చిన ఆ వ్యక్తి ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సివచ్చింది. ఏదేమైనా జీవితంలో ఒక అసహ్యకరమైన రోజును చవిచూసిన ఆ మహిళ కోలుకోడానికి సమయం పట్టొచ్చేమో.

కోపం మానవ సహజ లక్షణం, కానీ హద్దు మీరి వికృత చేష్టలకు తెగబడితే చివరికి శిక్ష అనుభవించక తప్పదు అనడానికి సరైన ఉదాహరణగా ఈ ఉదంతం ఉందని చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలను కూడా తీవ్రంగా ఆలోచించడం, ప్రతీకారేచ్చలతో రగిలిపోవడం ఒకరకంగా మానసిక సంబంధిత స్థితిగా ఉంటుంది. సరైన సమయంలో గుర్తించి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా, కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు. లేనిచో, జీవితాలే తారుమారవుతాయి.

ఇతను చేసిన ఈ పని వలన ఎటువంటి ఉపయోగం లేకపోగా, ఫలితంగా తన ఉద్యోగాన్ని సైతం వదులుకోవలసి వచ్చింది. చివరికి ఏం సాధించాడు చెప్పండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

This Guy Had Mixed His Semen In His Colleague’s Drink After They Had A Fight

Woman claims that a man had poured his semen in her mug when she was away and claims that a similar incident happened a while back as well. The woman had a doubt when she found the taste to be different in the water she drank from the cup. The man accepted his action, and he was fired from his job instantly.
Story first published: Monday, August 20, 2018, 17:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more