For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కికీ చాలెంజ్ తీసుకున్నాడు, కారు ప్రమాదానికి గురయ్యాడు

|

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజీ సెన్సేషన్, కికీ చాలెంజ్. ఈ చాలెంజ్ పట్ల వెర్రెక్కిపోయిన ప్రజలు అనేకమంది ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ చాలెంజ్ స్వీకరించి అమలుపరచడం ద్వారా అనేక ప్రమాదాలను సైతం ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం తెలీకుండానే పణంగా పెట్టేస్తున్నారు. క్రమంగా అనేక దేశాలలో, ఈ కికీ చాలెంజ్ నిషేధాజ్ఞలకు కూడా గురైంది. అయినప్పటికీ, ఇంకనూ అనుసరిస్తూ ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్న యువత అనేకం.

ఏ చాలెంజ్ స్వీకరించాలని అనుకున్నా, అది ప్రాణాలతో చలగాటంలా ఉండకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఉన్నతమైన జీవితం ఒక పనికిరాని విషయానికి తునాతునకలు అవుతుంది. ఇక్కడ వీడియోలోని వ్యక్తి, కికీ చాలెంజ్ స్వీకరించి, కార్ ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ బ్రతికి బట్టకట్టాడు కానీ, ప్రాణాలు పోయి ఉంటే? ఎంత ఘోరాతిఘోరంగా ఈ దుర్ఘటన జరిగిందో వీడియోలో చూడండి. ఒక్క సెకన్ గుండె ఆగినట్లు అవుతుంది, ఈ వీడియో చూస్తే, నేరుగా కార్ తలభాగాన తగిలినట్లు కనిపిస్తున్న ఈ వీడియోలో స్వల్ప గాయాలతో బయటపడడం నిజంగా భూమిమీద నూకలు ఉన్నాయి అని తలపించేలా ఉంది.

ఈ ఉదంతం ఫ్లోరిడాలో జరిగింది, ఈ వ్యక్తి కికీ చాలెంజ్ అయిన “ఇన్ మై ఫీలింగ్స్”లో భాగంగా కార్ నుండి దిగి ఈ చర్యకు ఉపక్రమించాడు.

బోయన్టన్ బీచ్ పరిసరాలకు చెందిన జేలెన్ నార్వుడ్, కార్లో పాట ప్లే అవుతుండగా, కార్ నుండి రోడ్ మీదకు దిగి డాన్స్ చేయడం ప్రారంభించాడు. కొన్ని క్షణాల అనంతరం, అనుకోకుండా రోడ్ మీద ఆయిల్ వంటి ద్రావణంపై కాలువేసి జారిపడిన ఇతని మీదకు అమాంతం ఒక కార్ దూసుకువచ్చి బలంగా ఢీకొంది.

Man Who Was Almost Killed By The Kiki Challenge

చాలెంజ్ ప్రకారం, నెమ్మదిగా కదులుతున్న కార్ నుండి దిగి, కదులుతున్న కార్తో సమాంతరంగా పాటకు తగినట్లు డాన్స్ చేస్తూ తిరిగి కార్లో వెంటనే ఎక్కాలి. దీనిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, మరికొంతమందికి చాలెంజ్ అప్పగించాలి. కానీ ఇక్కడ జేలెన్ కొద్దిగా నెర్వస్ ఫీల్ అవడం మూలంగా, చివరి నిమిషంలో కొద్దిగా తత్తరపాటుకు గురై ప్రాణాన్నే “కికీ” కి ఎరగా వేసినట్లింది. అదృష్టవశాత్తూ ముంజేతి మీద స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదేదో సినిమాలో హీరో అంటాడు, కాలం కలిసిరాకపోతే సముద్రంలో ఫిష్ అయినా స్టార్ హోటల్లో డిష్ అవుతుంది అని. ఇలాంటివి చూస్తే, అలాగే అనిపిస్తుంది మరి.

ఇటువంటి ప్రమాదాలు చూసైనా, ప్రజలు అవగాహనతో మెలగాలని సూచించడమైనది. నిజానికి ఇటువంటి చర్యలలో పొరపాటున ప్రాణం పోగొట్టుకున్నా, వృధాగా ప్రాణంపోయింది అన్న ఆలోచననే అందరిలో మిగులుస్తారు కానీ, ఒక్క ఉపయోగం కూడా లేదు. అవునా?

దయచేసి ఇటువంటి అనవసర చాలెంజ్లు, గొప్పలకోసం ఫీట్లు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని బోల్డ్స్కీ మిమ్ములను కోరుతుంది.

English summary

Man Who Was Almost Killed By The Kiki Challenge

In a video, a Florida man gets knocked down by a car while he was attempting to complete the famous "In My Feelings" challenge. The man in the video is Jaylen Norwood who is seen exiting the car as the song starts playing and he starts dancing on the road. Within seconds, he slips on a patch of oil and is hit by a car coming in his direction that hits him hard.
Story first published: Friday, August 10, 2018, 17:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more