మీ పేరు K తో మొదలవుతుందా? అయితే, మీ వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలుసుకోండి.

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మన పేరనేది మన లక్షణాలపై అలాగే వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందన్న విషయం మీకు తెలుసా? పేరులోనేముంది అనుకునే వారికి ఇది ఆశ్చర్యకరమైన విషయమే మరి. అలాగే, పేరు ప్రారంభమయ్యే మొదటి అక్షరం కూడా మన లక్షణాలపై అలాగే వ్యక్తిత్వంపై తగిన ప్రభావం చూపిస్తుంది.

ఈ ఆర్టికల్ లో "K" అనే అక్షరం ప్రాముఖ్యత అలాగే దాని వెనుక దాగున్న రహస్య అర్థాన్ని వివరిస్తున్నాము.

characteristics defined by initials

"K" అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల లక్షణాలను గురించి ఇక్కడ తెలుసుకోండి. వ్యక్తి యొక్క లక్షణాలను అలాగే వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ వ్యక్తిని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నవారవుతాం. ఒక వ్యక్తి పేరునుంచే ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ కింద పేర్కొనబడిన లక్షణాలు "K" అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు సంబంధించినవి. వీటిని చదవండి.

ఎవరినీ కించబరచడం అలాగే ఎవరి మనసును నొప్పించడం ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం కాదు. సేకరించిన విషయాలను ఈ ఆర్టికల్ లో పంచుకోవడం జరుగుతోంది.

వారితో మాట్లాడటం సులభతరం కాదు

వారితో మాట్లాడటం సులభతరం కాదు

"K" అనే అక్షరంతో ఒక వ్యక్తి యొక్క పేరు ప్రారంభం అయితే ఆ వ్యక్తిని కఠినమైన వ్యక్తిగా భావించవచ్చు. వారు రూడ్ గా కనిపించకపోయినా వారు అప్రోచబుల్ కారని వారితో ఒక్కసారి మాట్లాడాక నిర్థారించుకోవచ్చు.

ఒంటరివారు

ఒంటరివారు

ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే సిగ్గరులు కూడా. అదే సమయంలో, వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందువలన, వీరు ఎప్పుడూ అనవసర ఎటెన్షన్ కు గురవుతారు. అయితే, వీరికి అనవసరంగా అందరి దృష్టినీ ఆకర్షించడం నచ్చదు.

దయాభావం కలిగినవారు

దయాభావం కలిగినవారు

మీకు ఎదురైన వారందరిలో వీరు ఎక్కువగా దయభావం కలిగి ఉన్నవారు. అయితే, వారి హృదయానికి దగ్గరైతేనే వారిలోని ఈ లక్షణం మీకు ఎదురవుతుంది. ఎందుకంటే, ప్రతి ఒక్కరినీ, ఒకే రీతిలో ట్రీట్ చేయడం వీరికి నచ్చదు.

సాహసోపేతమైన వారు

సాహసోపేతమైన వారు

వీరు అత్యంత సాహసోపేతమైన వారు. తమకు సంబంధించిన యుద్ధాలలో తామే పోరాడతారు. తాము నమ్మిన వాటిపై బలంగా నిలబడతారు. మరొకవైపు, వారికి విపరీతమైన జ్ఞానం కలిగి ఉంటుంది.

ఆటలు ఆడటాన్ని ఇష్టపడతారు

ఆటలు ఆడటాన్ని ఇష్టపడతారు

వీరు అత్యంత సున్నితమైన కమర్షియల్ ట్రిక్స్ ని ప్లే చేయడంలో ఘటికులు. అందువలన, ఎటువంటి ఆటనైనా ఆడేందుకు వీరు ఇష్టపడతారు. ఏ ఆట మొదలెట్టినా అంకితభావంతో ఆడి గెలుపొందడానికి ప్రయత్నిస్తారు. ప్రొఫెషనల్ గా ఆడేందుకే ఇష్టపడతారు.

గర్విష్టి

గర్విష్టి

ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే గర్వం ఎక్కువగా కలిగి ఉంటారు. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందువలన, వారి స్నేహితులు వీరిని "వసపిట్ట"తో పోలుస్తారు.

ఎంతవరకైనా వెళతారు

ఎంతవరకైనా వెళతారు

ఈ వ్యక్తులు ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఆ పని పూర్తయ్యే వరకు ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధమవుతారు. త్వరగా ఆలోచించే శక్తి కలిగి ఉండటం చేత వారు త్వరగా డబ్బును సంపాదిస్తారు. అలాగే, తప్పుదోవపట్టించే ఆలోచనాధోరణి వలన కూడా వీరు పనులను వేగవంతంగా పూర్తిచేయగలుగుతారు.

మీ పేరు యొక్క మొదటి అక్షరం గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం, వెంటనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో పొందుబరచండి.

English summary

Meaning Of The Letter “K” In A Name

So you know that the first letter of your name has always been significant. Does your name start with the letter K? If your answer is a yes, then you should check for the most accurate characteristics of your personality.
Story first published: Tuesday, January 30, 2018, 14:30 [IST]
Subscribe Newsletter