For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆ ఇంట్లో : అమ్మానాన్నల పాత్రలు తారుమారయ్యాయి : ఇప్పుడు బిడ్డ, జెండర్ న్యూట్రల్.

  |

  ఆ ఇంట్లో : అమ్మానాన్నల పాత్రలు తారుమారయ్యాయి : ఇప్పుడు బిడ్డ, జెండర్ న్యూట్రల్.

  ఒక పేరెంట్ గా బాధ్యతలు కలిగి ఉండడం, అంత సులువైన విషయం కాదు. పిల్లల సంరక్షణా భాద్యతలు అంటే మొదటగా స్పురించేది తల్లే, తర్వాతే ఎవరైనా. ఇక తండ్రి విషయానికి వస్తే, తండ్రి బిడ్డల పెంపకం, పెళ్లి వంటి బాధ్యతలను తీసుకుoటాడు. ఒకవేళ ఈ పాత్రలు తారుమారైతే?

  జరగని పనిగా అనిపిస్తుంది కదూ? కానీ ఇక్కడ మేము చెప్తున్న కథ ప్రపంచంలోని అనేకులకు ప్రేరణగా నిలిచిన ఒక యువ–గే జంట గురించి.

  Meet The Family Where Mom Is Dad, Dad Is Mom And 4-Year-Old Son Is Gender Neutral

  ట్రైస్టన్ రీస్ మరియు బిఫ్ చాప్లౌ అనే యువ-గే జంట వారి పిల్లల విషయంలో తమ రోల్స్ మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలిచే పనికి పూనుకున్నారు.

  ఈ ఆసక్తికర అంశాల గురించిన మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

  ఒరిగాన్ లో నివసించే గే జంట

  ఒరిగాన్ లో నివసించే గే జంట

  ఒరిగాన్ లో నివసించే గే జంట అయిన ట్రైస్టన్ రీస్ మరియు బిఫ్ చాప్లౌ, వారి దత్తత మరియు బయలాజికల్ పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. బిఫ్ఫ్ సామాజిక వేత్తగా ఉండేవాడు. వీరిలో ట్రైస్టన్ ట్రాన్స్జెండర్ మరియు గే. వీరిద్దరూ పిల్లల పెంపకంలో భాగంగా తమ పాత్రలను మార్చుకోవాలని కూడా భావించారు.

  వారి పిల్లలు గురించి:

  వారి పిల్లలు గురించి:

  స్పష్టంగా, ఈ జంటలో ఒకరి సోదరీమణులకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి, కానీ వారి ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా వారిని పెంచలేని స్థితి. తద్వారా తమ పిల్లలను పెంచుకోమని కోరింది. ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలని భావించే ఆ జంట అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. పిల్లలు కావాలనుకున్న వీరిద్దరికీ, దత్తత అంత తేలికగా జరిగినందుకు ఎంతో ఆనందానికి లోనయ్యారు. కొంతకాలం తర్వాత, ట్రైస్టన్ గర్భవతి అయ్యాడు.

  వారు స్వంత వెబ్ సైట్ ను రూపొందించారు:

  వారు స్వంత వెబ్ సైట్ ను రూపొందించారు:

  వీరి దత్తత స్వీకారం గురించి ఒక ప్రముఖ టాబ్లాయిడ్ లో ప్రచురితమైంది కూడా. వారి కథ వైరల్ గా మారి, రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్లుగా మారి, అభిమానుల సంఖ్య పెరగడం ప్రారంభించింది. తద్వారా రోజూవారీ కార్యకలాపాలను మరియు అభిమానులను నిర్వహించడంలో భాగంగా సొంత వెబ్ సైట్ కూడా రూపొందించారు. ఒక గే జంట ఖచ్చితమైన కుటుంబ జీవితాన్ని ఎలా గడుపుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రపంచం ఆసక్తిగా ఉంది!

  ఈ జంట అనేక ఎదురుదెబ్బలను కూడా ఎదుర్కొంది :

  ఈ జంట అనేక ఎదురుదెబ్బలను కూడా ఎదుర్కొంది :

  ఈ జంట గర్భం దాల్చిన న్యూస్ వైరల్ అయిన నేపధ్యంలో వీరిని ప్రపంచం గుర్తుపట్టడం మొదలుపెట్టింది. తద్వారా ప్రజలు వీరిపట్ల హేళన చేయడం కూడా ప్రారంభించారు. గర్భo దాల్చిన ట్రైస్టన్ ఈ సమయంలో తన మగతనం గురించి ప్రజలు మాట్లాడడం గమనించాడు. అతను గర్భం దాల్చిన తర్వాత అందరూ వింతగా చూడడాన్ని సహించలేకపోయేవాడు. అంతేకాకుండా మహిళకు సంబంధించిన లక్షణాలను తనలో చూడడానికి ప్రజలు ప్రయత్నించడం ఏంతో భాధకు గురిచేసేది, తద్వారా ఒకానొక సమయంలో ఆత్మన్యూనతా భావానికి కూడా లోనయ్యారు.

  అయినప్పటికీ, వారు గిట్టని వాళ్ళను విస్మరించడం మొదలుపెట్టగలిగారు :

  అయినప్పటికీ, వారు గిట్టని వాళ్ళను విస్మరించడం మొదలుపెట్టగలిగారు :

  స్థిరమైన ప్రతికూల అంశాలు నిరాశపరిచినప్పటికీ, ఈ జంట ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా గుట్టని వారిని దూరం పెట్టాలని నిర్ణయించుకుంది మరియు తమ చుట్టూ ఉన్న సానుకూల విషయాలపై దృష్టి పెట్టగలిగింది. ఇక్కడ వారి చూపుల గురించి వీళ్ళు భాధపడలేదు. వాళ్ళు పెరిగిన విధానానికి, వారి తల్లిదండ్రుల పెంపకానికి భాదపడ్డారు.

  వారి బయలాజికల్ చైల్డ్ :

  వారి బయలాజికల్ చైల్డ్ :

  వీరిద్దరికీ ఇదివరకే, దత్తత తీసుకున్న పిల్లలలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. కావున తమకు పుట్టబోయే సంతానాన్ని జెండర్ న్యూట్రల్ గా పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం, లింగ భేదం కన్నా గుణం ముఖ్యమని భావించడమే. తద్వారా కనీసం లింగాన్ని కూడా ఆ బిడ్డకు తెలియనివ్వమని చెప్తున్నారు.

  ఇతర గే-జంటలతో పోల్చినప్పుడు వారు లక్కీగా ఫీల్ అవుతారు:

  ఇతర గే-జంటలతో పోల్చినప్పుడు వారు లక్కీగా ఫీల్ అవుతారు:

  ట్రైస్టన్ మరియు బిఫ్ఫ్ ఇద్దరూ తాము పొందిన అవకాశాన్ని అన్ని రకాల ఎల్.జి.బి.టి (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్) జంటలు పొందలేరని గ్రహించారు. ఒక ఇంటర్వ్యూలో, ఒకానొక సమయంలో వేర్వేరు సాంఘిక నియమాల కారణంగా టెక్సాస్కు చెందిన ఒక స్వలింగ సంపర్కుడు శిశువును దత్తత చేసుకోలేకపోయాడు మరియు బయలాజికల్ చైల్డ్ ను కూడా పొందలేకపోయాడు. కానీ అలాంటి అవకాశo మాకు కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాo అని ట్రైస్టన్ పేర్కొన్నాడు.

  వారు ప్రతిరోజుని ఆస్వాదిస్తారు :

  వారు ప్రతిరోజుని ఆస్వాదిస్తారు :

  ఎన్నో అంచనాల మద్య తల్లి దండ్రుల భాద్యతలను స్వీకరించవలసి ఉంటుంది. కానీ వారిప్పటికీ ఆ భాద్యతల గురించి కాకుండా, మంచి పేరెంట్స్ గా ఉండే విధానం మీదనే దృష్టిని సారించారు. ప్రస్తుతానికి రోజు ఎలా గడిస్తే, అలాగే గడిచేలా జీవనాన్ని నడుపుతున్నారు. ఒక బిడ్డకు పేరెంట్ గా ఉండడం అనేది అత్యంత క్లిష్టమైన అంశం, అలాంటిది ముగ్గురు పిల్లలకు పేరెంట్స్ అవ్వాలి. ఏది ఏమైనా, మా దృష్టి మొత్తం, వారిని ప్రేమగా జాగ్రత్తగా పెంచి పెద్ద చేయడం మీద మాత్రమే ఉంటుంది అని వీరిద్దరి మాట.

  వారి కథ నిజానికి ప్రజలకు ఒక ప్రేరణ:

  వారి కథ నిజానికి ప్రజలకు ఒక ప్రేరణ:

  ట్రైస్టన్ మరియు బిఫ్ఫ్ కథ అనేకమందికి ప్రేరణ అని చెప్పడంలో సందేహమే లేదు. అనేక పాఠాలను నేర్చుకోవచ్చు వీరి నుండి. వారు పరిస్థితి బాగాలేని పిల్లలను అక్కున చేర్చుకుని, ప్రేమతో పెంచి పోషిస్తున్నారు. కుటుంబంలో ప్రేమలను, విలువలను పెంచే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. తమ పిల్లలు మామూలు సమాజానికి భిన్నంగా భవిష్యత్తులో మనుషులను మనుషులుగా చూసేలా తీర్చి దిద్దాలని ప్రయత్నిస్తున్నారు.

  తాము అనుభవించిన భాధలను ఏ ఇతర మనిషి అనుభవిoచకూడదన్న సంకల్పంతో, తమ బయలాజికల్ బిడ్డను జెండర్ న్యూట్రల్ గా లింగానితో సంబంధం లేకుండా తటస్థంగా పెంచాలన్న ఆలోచన చేస్తున్నారు. ఎలా పెంచుతారో తెలీదు కానీ, ప్రపంచం మొత్తానికి ఒక గుణపాఠాన్ని నేర్పేదిశగా వీళ్ళు వేసిన అడుగులు ఎందరికో మార్గదర్శకమవుతాయని ఆశిద్దాం. ప్రతి మనిషిలోనూ మనసు ఉంటుంది, కానీ పెరిగే విధానాలు మంచిని తుంచి చెడును ప్రోత్సహిస్తుంటాయి. తద్వారా మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతుంది, ఆ మానవత్వాన్ని మేలుకొలపాలంటే ఎక్కడో ఒకచోట అడుగులు పడక తప్పదు మరి.

  మీకు ఈ కథ ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుందా? అయితే క్రింది వాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో భాగస్వామ్యం చేయండి.

  Image courtesy

  English summary

  Meet The Family Where Mom Is Dad, Dad Is Mom And 4-Year-Old Son Is Gender Neutral

  Trystan Reese and Biff Chaplow are a gay couple who live in Oregon with their adopted and biological children. Biff is a social worker, while Trystan a gay trans-man, who decided to have role reverse in bringing up their kids. These individuals are widely followed on social media, as people across the world have appreciated their way of their living.
  Story first published: Friday, May 18, 2018, 18:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more