For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇతను ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడా ? దురదృష్టవంతుడా ?

|

ఈ ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతునిగా కనిపిస్తే, పుట్టుకతోనే లక్కీ ఫెలో అని అనుకుంటాము. కానీ కొందరి విషయాలలో మాత్రం, దేవుని చేత తీవ్రముగా ఆశీర్వదించబడినవాడిగా భావిస్తాము. ఒకసారి కాదు రెండు సార్లు కాదు జీవితంలో అనేక ప్రమాదాలలో చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన వ్యక్తి కథ ఇది. నక్క తోక సంగతేమో కానీ, లక్కు తోక తొక్కిన వాళ్ళను అరుదుగా చూస్తుంటాము.

అటువంటి విషయాలలో ఒకటిగా ఇప్పుడు చెప్పబోయే కథనం ఉంటుంది. అనేక చావులను తప్పించుకున్న వ్యక్తి, అపార ధనలాభంతో అదృష్టం వరించిన సంఘటన గురించిన వివరాలను ఇక్కడ చెప్పబోతున్నాము.

ఈ వ్యక్తి పేరు ఫ్రేన్ సెలక్, ఇతను జీవిత కాలంలో అనేక మార్లు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. కానీ ఇతని అదృష్టం ఏమిటంటే ఆరు వందల వేల పౌండ్ల లాటరీని గెలుచుకున్న వ్యక్తిగా నిలిచిపోయాడు. అంటే భారత కరెన్సీ ప్రకారం షుమారుగా 5 కోట్లా 40 లక్షల వరకు ఉంటుంది.

Meet The Luckiest Or Unluckiest Man In The World

ఇతను ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడా ? దురదృష్టవంతుడా ?

ఆ కథ ఏమిటో చూడండి

ఇతను క్రొయేషియాలో జన్మించాడు :

ఫ్రేన్ సెలక్, క్రొయేషియాలో 1929 లో జన్మించాడు, అత్యంత సున్నితమైన ఉదార స్వభావం కలిగిన ఇతను సంగీత గురువుగా వృత్తిని కలిగి ఉన్నాడు. 1962 నుండి అతని జీవితంలో అసాధారణ మార్పులు చోటుచేసుకోవడం ప్రారంభమైంది. జీవితంలో ఒడిదుడుకులు సహజం అంటారు. కానీ చావు బ్రతుకుల్లో ఒడిదుడుకులు చూస్తూ వచ్చాడు ఇతగాడు.

మొదటి గండం ‌:

1962లో ఒక రైలు నదిలో పడి ప్రమాదానికి గురైన సందర్భంలో, ఫ్రేన్, ఈత రావడం వలన ఒడ్డుకు చేరి బతికి బయటపడ్డాడు. కానీ భుజం విరిగి హైపో ధర్మియాకు గురయ్యాడు, ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మరణించారు.

అప్పటిదాకా సాధారణంగా గడుపుతున్న జీవితం, ఒక్కసారిగా ఒడిదుడుకులను ఎదుర్కోవడం ప్రారంభించింది. రానురాను పరిస్థితులు మరింత జఠిలంగా మారుతూ వచ్చాయి.

ఆ మరుసటి సంవత్సరమే :

రైలు ప్రమాదానికి గురైన మరుసటి సంవత్సరమే, ఫ్రేన్, జాగ్రెబ్ నుండి రిజకా వెళ్తుండగా, ఎయిర్ క్రాఫ్ట్ నుండి తలుపు వేరవడం కారణంగా క్రాష్ జరిగి 19 మంది అక్కడికక్కడే మరణించారు. కానీ ఫ్రేన్ మాత్రం‌ గడ్డివాములో పడి తప్పించుకున్నాడు.

బస్సు ప్రమాదానికి కూడా గురయ్యాడు :

1966 లో, ఫ్రేన్ ఒక దారుణమైన బస్సు ప్రమాదానికి కూడా గురయ్యాడు. ఇక్కడ కూడా రైలు ప్రమాదం వలె, నదిలోనికి నేరుగా బస్సు దూసుకుని పోయింది. నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా ఫ్రేన్ మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

కారు ప్రమాదానికి కూడా గురయ్యాడు :

1970 సంవత్సరంలో, ఫ్యూయల్ ట్యాంక్ పేలడం వంటి అరుదైన ప్రమాదం మూలముగా కారు ప్రమాదానికి గురయ్యాడు. కానీ అనూహ్యంగా ప్రమాదం నుండి బయటపడి అందరినీ అబ్బురపరిచాడు. ఇటువంటి ప్రమాదంలో బయటపడడం అసాధ్యమనే చెప్పాలి.

అదేవిధంగా 1973 వ సంవత్సరంలో మరొక కార్ ఆక్సిడెంట్, ఫ్యూయల్ పంప్ అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా జరిగినది. కారు నుండి పెట్రోల్ కారడం క్రమంగా కారు తగలబడి ఇతని మీదకు మంటలు చెలరేగడం జరిగినది. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుండి కూడా బయటపడ్డాడు.

అలవాటుగా మరొక బస్సు ప్రమాదానికి కూడా గురయ్యాడు :

అన్ని ప్రమాదాలకు వరుసగా గురవుతూ ఉంటే, ప్రమాదాలు అలవాటేమో అని అనిపిస్తుంది కూడా. క్రమంగా 1995 వ సంవత్సరంలో‌ మౌంటైన్ రోడ్లో వెళ్తుండగా ఒక ట్రక్కు అమాంతం కారు మీదకు దూసుకు వచ్చింది, కానీ అదృష్టవశాత్తు అతను కారు నుండి బయటపడడం జరిగినది. ఈ ప్రమాదంలో హారర్ సినిమాలలో వలె కారు పేలిపోయింది.

ఇన్ని ప్రమాదాల తర్వాత ఒక లాటరీ టికెట్ ద్వారా బహుమతిని అందుకున్నాడు :

ఇటువంటి అనేక ప్రమాదాలకు గురై చావుల దగ్గర దాకా వెళ్ళి వచ్చిన తరువాత, 2003 సంవత్సరంలో తన 73 వ బర్త్డే 2 రోజుల తర్వాత ఈ లాటరీ టికెట్ ఇతనిని వరించింది. ఈ జాక్పాట్ ద్వారా, ఆరు వందల వేల పౌండ్లను బహుమతిగా పొందాడు. ఈ బహుమతితో రెండు ఇళ్ళు ఒక బోట్ కొన్నాడు. అందులో ఒకటి ఖరీదైన భవంతికూడా, కానీ కొంతకాలం తర్వాత దానిని అమ్మివేయడం కూడా జరిగింది. మరియు మిగిలిన డబ్బును తన స్నేహితులకు ప్రియమైనవారికి పంచి, వారి ఆనందాలకు కూడా కారకుడయ్యాడు. దీనికి కారణం తన అయిదవ భార్యతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్న ఆలోచనే. మరియు అందరూ సంతోషంగా ఉండాలన్న ఆలోచన కూడా.

డబ్బు అవసరానికి ఉంటే చాలు అని అనుకునేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇతనికి అనుభవించాలని రాసి ఉంది, అందుకే ఇన్నిసార్లు ప్రమాదానికి గురైనా బయటపడుతూ వచ్చాడని అందరూ ప్రశoశిస్తున్నారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Meet The Luckiest Or Unluckiest Man In The World

Frane Selak is known to be the world's luckiest and unluckiest man on this planet. He is said to have survived a train crash, a plane crash and a car crash. The man's encounters with death have been many and to add on, he got lucky when he won a lottery worth around £600,000. Apart from this, he has been married 5 times!
Story first published: Monday, August 27, 2018, 18:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more