For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీరాలలో ఆ కి"లేడీ" ఇంటికి రా స్వర్గం చూపిస్తా అంటుంది.. అక్కడి వెళ్లాక అసలు సంగతి మొదలవుతుంది

తొలుత మిస్డ్ కాల్ ఇచ్చి.. ఆపై వారిని మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా ట్రాప్‌లో పడేసి భారీగా డబ్బు గుంజేస్తుంది ఆ లేడీ. ఆమె చాలా కిలాడీ.. కాస్త డబ్బున్న వాళ్లు ఆమె కంటపడితే చాలు. మిస్ట్ కాల్, చీరాల.

|

తొలుత మిస్డ్ కాల్ ఇచ్చి.. ఆపై వారిని మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా ట్రాప్‌లో పడేసి భారీగా డబ్బు గుంజేస్తుంది ఆ లేడీ. ఆమె చాలా కిలాడీ.. కాస్త డబ్బున్న వాళ్లు ఆమె కంటపడితే చాలు.. వెంటనే వారిని టార్గెట్ చేస్తుంది. వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తుంది. వారిని వలలో వేసుకుంటుంది. చాలా మంది మగవారు, డబ్బున్న యువకులు అసలు విషయం తెలియక ఏదో ఆశించి ఆమె వలలో పడిపోతూ ఉంటారు. ఆమె చెప్పే ప్రతి మాటను నమ్ముతారు. ఆమెతో ఏదో సుఖం పొందుతామనే కోరికతో ఆమె చెప్పిన చోటుకి వెళ్తారు.

అయితే చివరకు జరిగే సంఘటనలు చూసి షాక్ అవుతారు. కానీ అప్పటికే జరగాల్సిదంతా జరిగిపోతుంది. వాళ్లు ఆశించింది తప్పా మిగతావన్నీ జరుగుతాయి. జేబులో, ఏటీఏం కార్డుల్లో డబ్బును మొత్తం ఆమెకు సమర్పించి ఉత్త చేతులతో ఇంటికి రావాల్సి వస్తుంది. పైగా తమ పరువు ఎక్కడ పోతుందో అనే ఆందోళన చెందుతూ సతమతం అవుతూ ఉంటారు. అసలు ఆమె కథ వింటే మీరు కూడా షాక్ అవుతారు.

ఇంటికి రమ్మంటుంది

ఇంటికి రమ్మంటుంది

నీ కోరిక తీరుస్తా అంటూ... చివరికి ఇంటికి రమ్మంటుంది. ఎంతో ఆశతో అక్కడికి వెళ్లే యువకులకు చుక్కెదురవుతుంది. వారు తమ కోరికను తీర్చుకోవాలనుకుని అక్కడికి వెళ్తే ఆమె కసిగా తన కోరికను తీర్చుకుని పంపిస్తుంది.

చుక్కలు చూపిస్తుంది

చుక్కలు చూపిస్తుంది

ఇంటికెళ్లిన మగవారికి ఆ లేడీ చుక్కలు చూపిస్తుంది. తాజాగా ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ఛేదించిన ఈ కేసు కాస్త ఆసక్తికరమే. ఇద్దరు యువకులతో కలిసి ముఠాగా ఏర్పడిన ఓ యువతి డబ్బున్న కుటుంబాల పిల్లలను టార్గెట్ చేస్తూ బాగా డబ్బులు దోచేస్తుంది.

కంపా స్రవంతి ప్రియ

కంపా స్రవంతి ప్రియ

మిస్డ్‌ కాల్స్‌, మెసేజ్‌లతో సంపన్నులు, వారి పిల్లలను ట్రాప్‌ చేసి, ఆపై వారి నుంచి భారీస్థాయిలో డబ్బు వసూలు చేస్తుంది ఈ ముఠా. చీరాల పట్టణం పేరాలకు చెందిన కంపా స్రవంతి ప్రియ, కుంభా ప్రకాష్‌, కావటి కిరణ్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు.

మిస్డ్‌కాల్‌ ఇస్తుంది

మిస్డ్‌కాల్‌ ఇస్తుంది

వీరు వ్యాపారం, ఇతర రంగాల్లో స్థితిమంతులైన వారి ఫోన్‌ నంబర్లు తెలుసుకొని వారిని టార్గెట్‌ చేస్తారు. తొలుత స్రవంతి ఆయా నంబర్లకు మిస్డ్‌కాల్‌ ఇస్తుంది. లేదంటే సంక్షిప్త సందేశాలు పంపుతుంది. వాటికి స్పందించిన వారిని మెల్ల గా మాటల్లోకి దించుతుంది. తన వలలో పడిన వారిని ఇంటికి ఆహ్వానిస్తుంది.

ఇంట్లోకి తీసుకెళ్లి మాట్లాడుతున్నప్పుడు

ఇంట్లోకి తీసుకెళ్లి మాట్లాడుతున్నప్పుడు

వచ్చిన వక్తిని ఇంట్లోకి తీసుకెళ్లి మాట్లాడుతున్న సమయంలో ప్రకాష్‌, కిరణ్‌లు రంగప్రవేశం చేస్తారు. బిత్తరపోయిన యువకుడిపై కేకలేస్తూ, వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టేస్తారు. ఏమీ లేకుంటే తలుపెందుకు వేసుకున్నారని నిలదీస్తారు. కేసు, విచారణ, అరెస్ట్ అంటూ హడావుడి చేస్తారు. ఇక కంగారు పడే యువకుడు కాళ్ల బేరానికి వస్తాడు.

పోలీసులమని బెదిరిస్తారు

పోలీసులమని బెదిరిస్తారు

తాము పోలీసులమని బెదిరిస్తారు. వారి సంబంధంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఇంట్లో తలుపులేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తారు. కేసు నమోదు చేస్తామని హడావుడి చేస్తారు. దీంతో కంగారుపడిన వ్యక్తి వారితో కాళ్లబేరానికి వస్తాడు.

సొమ్ము మొత్తం డ్రా చేస్తారు

సొమ్ము మొత్తం డ్రా చేస్తారు

ఇదే అదనుగా వారి వద్ద నుంచి భారీ మొత్తం డిమాండ్‌ చేస్తారు. డబ్బుల్లేవంటే ఏటీఎం కార్డు పిన్‌ నంబర్‌ తెలుసుకుని ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం డ్రా చేస్తారు. రెండ్రోజుల క్రితం గుంటూరుకు చెందిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తిని కూడా స్రవంతి తన ఇంటికి ఆహ్వానించింది.

రెండ్రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌

రెండ్రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌

ఆ తర్వాత మిగిలిన ఇద్దరూ రంగప్రవేశం చేసి పోలీసులమని బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.3 వేలతోపాటు, ఏటీఎం కార్డులోని రూ.10 వేలు కూ డా డ్రా చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి బయటపడ్డానని భావించిన ఇస్మాయిల్‌ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ.. రెండ్రోజుల తర్వాత స్రవంతి మళ్లీ అతనికి ఫోన్‌ చేసింది.

పెళ్ళి చేస్తామంటున్నారని

పెళ్ళి చేస్తామంటున్నారని

ఇంట్లో వారు మీతో పెళ్ళి చేస్తామంటున్నారని, మీరు చేసుకోకపోతే రూ.లక్ష ఇవ్వాలని బెదిరిస్తూ బేరం పెట్టింది. దీంతో ఇస్మాయిల్‌ చీరాల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన వారు స్రవంతి, ప్రకాష్‌, కిరణ్‌లను అరెస్టు చేశారు.

ప్రేమ వల విసిరితే

ప్రేమ వల విసిరితే

వీరు గతంలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారు. ఇక చీరాల ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు స్థానిక పోలీసులు. మీపై కూడా ఎవరైనా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లతో ప్రేమ వల విసిరితే అందులో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. యువతులు ప్రేమగా మాట్లాడుతున్నారని కమిట్ అయిపోకండి.. ఇలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉంది.

English summary

missed call lady mystery

missed call lady mystery
Desktop Bottom Promotion