భయం లేని వారు భూమిపై ఎవరూ ఉండరు.. మీ రాశి బట్టీ మీ భయాలేంటో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కొక్కరికీ ఒక్కో భయం ఉంటుంది. ఒకరికి చావు భయం.. ఒకరికి డబ్బు భయం... ఒకరికి జుట్టు తెల్లగా అయిపోతుందని భయం.. ఒకరికి పొట్ట వస్తుందని భయం.. ఇలా ఒక్కొక్కకరికీ ఒక్కో భయం కచ్చితంగా ఉంటుంది.

భయం లేని వారు భూప్రపంచంలోనే ఉండరు. ఆయా రాశుల బట్టీ కూడా భయాలుంటాయట. ఒక్కో రాశి వారికి కొన్ని రకాల భయాలు కచ్చితంగా పుట్టుకతోనే వచ్చి ఉంటాయట. మరి మీ రాశికి సంబంధించి మీరు ఎలాంటి భయాలు కలిగి ఉంటారో తెలుసుకోండి.

మేషరాశి (మార్చి 21-ఏప్రిల్ 19)

మేషరాశి (మార్చి 21-ఏప్రిల్ 19)

మేషరాశి వారికి కొన్ని రకాల భయాలుంటాయి. వీరు ఎక్కువగా తమకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులను ఎక్కడ కోల్పోతామా అనే భయం ఉంటుంది. ఇక సన్నిహితులు ఏదో ఒక సందర్భంలో దూరం అయినప్పుడు వీరు పడే బాధ కూడా మిగతావారితో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుంది.

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వృషభ రాశి వారికి చాలా టాలెంట్ ఉంటుంది. వీరు దేన్నినైనా సాధించగలమనే నమ్మకంతో ఉంటారు. అయితే వీరు తాము అనుకున్నది సాధిస్తామా లేదా అని ఎప్పుడూ భయపడుతుంటారు. వీరికి కాస్త అసంతృప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు డబ్బుకు సంబంధించిన విషయంలో కూడా చాలా భయపడుతుంటారు.

మిథునరాశి (మే 21- జూన్ 20)

మిథునరాశి (మే 21- జూన్ 20)

మిథునరాశి వారిలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. వీరు ప్రతి విషయం గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించగలుగుతారు. అయితే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఫైనల్ గా నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం వీరు చాలా భయపడతారు. ఆ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో ఏమో అని వెనకడుగు వేస్తూ ఉంటారు.

కర్కాటక రాశి (జూన్ 21- జూలై 22)

కర్కాటక రాశి (జూన్ 21- జూలై 22)

కర్కాటక రాశి వారు ఏదైనా కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడంలో బాగా ఇబ్బందిపడతారు. వీరు చాలా కలలు కంటారు కానీ వాటిని సాకారం చేసుకునే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తారు. ఏదైనా సాహసం చేయాలంటే వీరికి చాలా భయం. అందుకే రొటీన్ గా లైఫ్ ను కొనసాగిస్తుంటారు.

సింహరాశి (జూలై 23-ఆగస్టు 23)

సింహరాశి (జూలై 23-ఆగస్టు 23)

సింహరాశి వారు దేనికి వెనకాడని ధైర్యం కలిగి ఉంటారు. ప్రతి క్షణం సంతోషం ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఎంత సింహరాశి వారైనా వారు మనుషులే కదా. వారికి కూడా కొన్ని భయాలుంటాయండోయ్.

సింహరాశి (జూలై 23-ఆగస్టు 23)

సింహరాశి (జూలై 23-ఆగస్టు 23)

సింహరాశి వారు తమ ఉనికి చాటడంలో ఎక్కడ విఫలం అవుతామోనని వీరు భయపడుతుంటారు. తమని సమాజం ఎక్కడ మరిచిపోతుందేమోనని అనుక్షణం భయపడతారు. సింహరాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి ఎక్కువ గౌరవాన్ని కోరుకుంటారు.

కన్యరాశి (ఆగస్టు 24- సెప్టెంబర్ 23)

కన్యరాశి (ఆగస్టు 24- సెప్టెంబర్ 23)

కన్యరాశి వారు తమ చుట్టూ ఉన్న వారు తమపై ప్రేమ చూపడం లేదని కాస్త భయపడుతుంటారు. వీరు ఎక్కువగా నమ్మే వ్యక్తులు వీరితో సరిగ్గా మాట్లాడకున్నా వీరిని కాస్త దూరంగా పెట్టినా వీరు ఎక్కువగా భయపడతారు.

తులరాశి (సెప్టెంబరు 24, అక్టోబర్ 23)

తులరాశి (సెప్టెంబరు 24, అక్టోబర్ 23)

ఒంటరితనం భయము ఇతరులకు వారి ప్రేమను మరియు ప్రేమను వ్యక్తం చేయటానికి ఇష్టపడే మక్కువ ప్రేమికులు. వారు వారి చుట్టూ ఉన్న ప్రజలను ఆశ్చర్యపరుచుకోరు. కానీ లోతైన డౌన్, వారు ఒంటరిగా వదిలి ఒక భయం కలిగి. వారు ఒంటరిగా వదిలేసినప్పుడు లేదా విడిచిపెట్టినప్పుడు వారు తరచుగా అణగారిస్తారు.

వృశ్చికరాశి (అక్టోబర్ 24-నవంబరు 22)

వృశ్చికరాశి (అక్టోబర్ 24-నవంబరు 22)

వృశ్చికరాశి వారు తమ భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడంలో చాలా భయపడతారు. వీరు చాలా విషయాలు చెప్పాలనుకుంటారు కానీ చెప్పాలంటే భయపడతారు. అలాగే వీరు అతి జాగ్రత్తగా ఉంటారు. తమతో స్నేహంగా ఉండే వాళ్లలోనే ఎవరైనా తమను మోసం చేస్తారేమోనని భయపడుతూ ఉంటారు.

ధనుస్సురాశి (నవంబర్ 23- డిసెంబర్ 22):

ధనుస్సురాశి (నవంబర్ 23- డిసెంబర్ 22):

ధనుస్సురాశి వారికి ఎక్కువగా ప్రయాణాలు అంటే ఇష్టం. అందరితో కలిసి ఉండాలని, బయటి ప్రపంచంలో విహరించాలని వీరు పరితపిస్తుంటారు. ఒంటిరిగా ఉండడం అంటే వీరికి చాలా భయం. ఒక చిన్న రూమ్ లో వీరిని ఉంచితే భయపడి చావు అంచుల దాకా వెళ్లొస్తారు.

మకరం (డిసెంబర్ 23-జనవరి 20)

మకరం (డిసెంబర్ 23-జనవరి 20)

మకరరాశి వారు తాము ఎక్కడ ఫెయిల్యూర్ అవుతామేమోనని ఎక్కువగా భయపడుతుంటారు. వీరికి కష్టపడి పని చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అయినా తాము ఎక్కడ విఫలం అవుతామేమోనని భయపడతారు.

కుంభరాశి (జనవరి 21- ఫిబ్రవరి 18)

కుంభరాశి (జనవరి 21- ఫిబ్రవరి 18)

కుంభరాశి వారు చిన్నచిన్న విషయాలకు కూడా భయపడుతుంటారు. పని చేసే ప్రాంతంలో వచ్చే చిన్నచిన్న ఇబ్బందులకు,వ్యాపారం ఏర్పడే సమస్యలకు వీరు చాలా భయపడుతుంటారు.

మీనరాశి (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీనరాశి (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీనరాశి వారు జవాబుదారీతనం అంటే చాలా భయపడతారు. వీరు ఎక్కువగా ఫ్రీ బర్డ్ లాగా విహరించాలనుకుంటారు. వీరికి ఏదైనా బాధ్యత అప్పగిస్తే మాత్రం చాలా భయపడిపోతారు.

English summary

most secretive fears that each zodiac sign has

most secretive fears that each zodiac sign has.. Do you know that each zodiac sign has its own set of fears? These fears are said to be something that even the individuals belonging to the zodiac signs themselves are mostly not aware of! From the fear of feeling lonely to having intimacy issues, there is a lot that can define each zodiac sign's most secretive fears.
Story first published: Friday, March 2, 2018, 11:30 [IST]