For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హేయ్ అంకుల్ అదరగొట్టే స్టెప్స్ వేశావ్.. అది కొట్టేశావుగా..ఆ ఆంటీ అంకుల్ భార్యనే!

|

ఈ మధ్య పెళ్లి వేడుకల్లో డాన్స్‌కు ప్రాముఖ్యత పెరిగిపోతోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ చిందులేస్తూ ఉత్సాహాంగా ఉరకలేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక పెళ్లివేడుకలో ఒక అంకుల్ చేసిన డాన్స్ ఇంటర్నెట్‌లో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే.

సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌

సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌

ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏదైనా హల్‌ చల్‌ చేస్తుందంటే చాలూ.. అది వార్తగా మారిపోతోంది. తాజాగా ఈ ఇండియన్‌ అంకుల్‌ డాన్స్‌ వీడియో ఒకటి చక్కర్లు కొడుతూనే ఉంది. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఒక వేడుకలో స్టేజీపై వేసిన స్టెప్పులకు అంతా ముగ్ధులైపోయారు.

సంజయ్ శ్రీవాస్తవ్

సంజయ్ శ్రీవాస్తవ్

బాలీవుడ్ నటుడు గోవిందా నటించిన చిత్రంలోని పాటకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సంజయ్ శ్రీవాస్తవ్ నృత్యం చేశారు. ఈ డాన్స్‌కు ముగ్ధులైనవారంతా సంజయ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు కూడా.

ఆప్‌ కే ఆ జానే సే

ఆప్‌ కే ఆ జానే సే

జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్‌గర్జ్‌(1987) చిత్రంలోని ‘ఆప్‌ కే ఆ జానే సే...' పాటకు సంజయ్ శ్రీవాస్తవ్ డాన్స్‌ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్‌ చేస్తూ అతను చేసిన డాన్సింగ్‌ మూమెంట్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంటీ మాత్రం పాపం ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయింది.

మ్యాజిక్‌ స్టెప్

మ్యాజిక్‌ స్టెప్

మ్యాజిక్‌ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్‌పై గత కొన్ని రోజులుగా ప్రశంసలు కురిపించారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్‌ చేస్తునే ఉన్నారు.

అంకుల్‌ సందడే

అంకుల్‌ సందడే

కొన్ని రోజులుగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌.. ఇలా ఏ ఫోన్‌లలో ఎక్కడ చూసినా ఈ అంకుల్‌ సందడే. మొదట ఇది ఎక్కడ జరిగింది? అసలా అంకుల్‌ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మొత్తానికి ఆయన పేరు సంజీవ్‌ శ్రీవాస్తవ అని తేలింది. సంజీవ్‌ గోవిందా వీరాభిమాని.మధ్యప్రదేశ్‌లోని బాబా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు సంజీవ్‌.

అమ్మ నుంచి నృత్యకళ

అమ్మ నుంచి నృత్యకళ

ఈయనకు వాళ్ల అమ్మ నుంచి ఈ నృత్యకళ అబ్బిందట. ఇక తన డాన్సింగ్‌ వీడియో ఇంతలా వైరల్‌ అవుతుందని సంజీవ్ శ్రీవాస్తవ అనుకోలేడట. ఇప్పుడు జనాలంతా తన ప్రతిభను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తనని సపోర్టు చేసిన వాళ్లందరికీ ధన‍్యవాదాలు కూడా తెలిపాడు సంజీవ్.

వినోదం పంచుతోంది

వినోదం పంచుతోంది

అయితే ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన ఈ డాన్సింగ్‌ అంకుల్‌ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంజీవ్‌ను పొగడుతూ చేసిన ట్వీట్‌ ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ‘మా విదిశలోని భోపాల్‌లో పనిచేసే ప్రొఫెసర్‌ సంజీవ్‌ శ్రీవాస్తవ డాన్స్‌ భారత్‌ మొత్తానికి వినోదం పంచుతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సరే.. మధ్యప్రదేశ్‌ నీళ్లలోనే ఏదో మహత్తు, ప్రత్యేకత ఉన్నాయి'అంటూ శివరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

ఒక్క మీరు తప్ప

ఒక్క మీరు తప్ప

ఆయన ట్వీట్‌కు స్పందనగా.. ‘ మధ్యప్రదేశ్‌ నీళ్లల్లో ప్రత్యేకత ఉన్నప్పటికీ పాపం ఎందుకనో అన్నదాతల కష్టాలు తీరడం లేదు. మరి వారి కష్టాలకు కారణం ఎవరో అంటూ' ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. ‘ మధ్యప్రదేశ్‌లో అందరూ, అన్నీ ప్రత్యేకమైనవే.. ఒక్క మీరు తప్ప.. మీ శ్రద్ధ కాస్త రైతుల మీదకి కూడా మళ్లిస్తే మంచిది' అంటూ మరొకరు వ్యంగంగా ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా రైతుల పట్ల మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరి, వ్యాపమ్‌ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా

ఇక రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో విదిశ మున్సిపాలిటీ సంజయ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. డ్యాన్స్ పుణ్యమా అని సంజయ్‌కు పలు టీవీ షోలలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ డ్యాన్స్ ఏంటీ

అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నుంచి సంజయ్ డాన్స్‌కు అభినందనలు రావడం కూడా విశేషం. ‘‘ఆ డ్యాన్స్ ఏంటీ.. ఆ ఫర్మార్మెన్స్ ఏంటీ.. నమ్మలేకున్నా.. మధ్యప్రదేశ్ నీళ్లలో ఏదో తెలియని ప్రత్యేక ఉంది'' అని శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

పలు రకాల అవకాశాలు

భోపాల్‌లోని బాబా ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూనే అప్పుడప్పుడు తన ప్రతిభను ఇలా బయటపెడుతున్నాడంటా సంజయ్ శ్రీవాస్తవ్.

ప్రస్తుతం ఇతని ప్రతిభను దేశం అంతా గుర్తించింది కాబట్టి సంజయ్ శ్రీవాస్తవ్‌ కు పలు రకాల అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ ఆంటీ ఆయన భార్యనే

ఆ ఆంటీ ఆయన భార్యనే

ఇక సోషల్ మీడియా డ్యాన్స్ అంకుల్ పై పలువురు పలు పోస్టులు పెడుతూనే ఉన్నారు. హేయ్ అంకుల్ స్టెప్ వేశావ్.. బ్రాండ్ అంబాసిడర్‌ కొట్టేశావుగా అంటున్నారు. ఒక అమ్మాయి సేమ్ టు సేమ్ అంకుల్ మాదిరిగానే స్టెప్ వేసి వీడియో పోస్ట్ చేసింది. ఇక అంకుల్ డ్యాన్స్ వీడియోలో ఉన్న ఆంటీ ఆయన భార్యనేనట.

అంకుల్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు

అంకుల్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు

ఇక ఏకంగా సంజీవ్‌ అభిమాన నటుడు గోవిందానే ఆయన డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ‘అతను వేసిన స్టెప్పులు నచ్చాయి. సంజీవ్‌ వేసిన డ్యాన్స్‌తో నా దిమ్మతిరిగింది. భవిష్యత్తులో ఇతని డ్యాన్సులు మరిన్ని చూస్తామని ఆశిస్తున్నాను. పక్కన ఎవ్వరూ లేరు అన్నట్లుగా సంజీవ్‌ ఎంజాయ్‌ చేస్తూ డ్యాన్స్‌ చేశారు. డ్యాన్స్‌ చేయడానికి కావాల్సిన ప్రధాన సూత్రం అదే. సంజీవ్‌ ఆనందం అతను వేసే స్టెప్పుల్లో తెలుస్తోంది. సంజీవ్‌ నా పాటలకు డ్యాన్స్‌ చేయడం నా కెరీర్‌లోనే బెస్ట్‌ విషయం. అతను వేసిన స్టెప్పులను అవార్డులుగా భావిస్తాను' అని పేర్కొన్నారు గోవింద.

English summary

mps happy feet professor stunned by overnight fame

mps happy feet professor stunned by overnight fame