ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌.. సోదరుడిని ఎందుకు చంపుకున్నాడు?

Written By:
Subscribe to Boldsky

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కిమ్ సవతి సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ గురించి కూడా చాలా మందికి తెలుసు. పక్కా ప్లాన్ ప్రకారం కిమ్ జాంగ్ నామ్ ను చంపించారు. అసలు అంత అవసరం కింగ్ జాంగ్ ఉన్ కు ఎందుకొచ్చింది? కిమ్ స్వయంగా తన సోదరుడిని చంపించాడని ఎలా నిర్దారణ అయ్యింది? ఇలాంటి ఎన్నో విషయాలపై క్లుప్తంగా తెలుసుకుందాం.

అనుమానాస్పదంగా మరణం

అనుమానాస్పదంగా మరణం

గత ఏడాది మలేషియా విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కిమ్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మరణించిన విషయం తెలసిందే. జాంగ్‌ నామ్‌ను చంపింది ఉత్తరకొరియానేనని ఆయన మరణించిన వెంటనే వార్తలు వెలువడ్డాయి. కానీ అదే నిజం అని ఎవ్వరూ నిర్దారణ చెయ్యలేదు.

వీఎక్స్‌ అనే విషం

వీఎక్స్‌ అనే విషం

వీఎక్స్‌ అనే అత్యంత విష పదార్థమైన రసాయనిక సమ్మేళనం ఉపయోగించి కిమ్ జాంగ్ నామ్ ను హతమార్చిందని తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇక వీఎక్స్‌.. జాంగ్‌ నామ్‌ ముఖంపై, కళ్లలో, రక్తంలో, మూత్రంలో, దుస్తుల్లో, బ్యాగులో దొరికినట్టు పోస్టుమార్టం నివేదికంలో తేలిందని దీన్ని బట్టే తాము నిర్దారించామని కూడా అమెరికా విదేశాంగశాఖ చెప్పింది.

మకావ్ వెళ్తుండగా

మకావ్ వెళ్తుండగా

గత ఏడాది ఫిబ్రవరి 13న జాంగ్‌ నామ్‌ కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మకావ్‌ బయల్దేరారు కిమ్ జాంగ్ నామ్. తర్వాత ఎయిర్‌పోర్టులో ఇద్దరు యువతులు వెనుకనుంచి పరిగెత్తుకొని రావడం.. అతనిపై ఒక దవ్రాన్ని చల్లడం.. తర్వాత క్షణాల్లో కిమ్ జోంగ్ నామ్ మరణించడం అన్నీ క్షణాల్లో అయిపోయాయి.

ఉత్తరకొరియా ఏజెంట్లే

ఉత్తరకొరియా ఏజెంట్లే

జాంగ్‌ నామ్‌పై గుర్తుతెలియని ద్రవాన్ని చల్లి ఓ టాక్సీలో పారిపోయిన ఆ ఇద్దరు యువతులు ఉత్తరకొరియా ఏజెంట్లు అని దక్షిణ కొరియా టీవీ చానెల్‌ టీవీ చోసాన్‌ ఆ మరునాడు వెల్లడించింది.

అక్రమ సంతానం

అక్రమ సంతానం

ఇక కిమ్ జాంగ్ నామ్ బతికి ఉన్నంత కాలం ఒంటరిగా జీవితం గడిపాడు. దివంగత ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఇల్‌, ఆ దేశ నటి సంగ్‌ హ్యే రిలకు పుట్టిన అక్రమ సంతానమే ఈ కిమ్‌ జాంగ్‌ నామ్‌. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఎనిమిదేండ్ల వయసులోనే రష్యాకు వలస వెళ్లాడు. తర్వతా చైనా సహా అనేక దేశాల్లో బతికాడు.

హత్య చేసింది వీళ్లే

హత్య చేసింది వీళ్లే

ఇక కౌలాలంపూర్ విమానాశ్ర‌యం వీఎక్స్‌ అనే ప్రమాదకరమైన విష వాయువును నామ్‌ ముఖంపై కొట్టిన ఆ ఇద్దరూ వీరే. ఒకరు ఇండోనేషియాకు చెందిన సితీ ఐసియా, మరొకరు డోవాన్‌ థి హువాంగ్‌. వీరిని తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.

చాలా ఫన్నీగా చెప్పారు

చాలా ఫన్నీగా చెప్పారు

నామ్ ను హత్య చేసిన ఇద్దరూ మహిళలు పోలీసుల విచారణలో చాలా ఫన్నీగా జవాబులు ఇచ్చారు. తాము చేస్తుంది ఒక అంతర్జాతీయ హత్య అవుతుందని తాము అనుకోలేదన్నారు.

టీవీ షోలో

టీవీ షోలో

తాము ఓ టీవీ షోలో నటించాలనుకున్నామని.. అయితే అందులో భాగంగా తాము చెప్పినట్లు చేయాలని కొందరు చెప్పారని అన్నారు. వాళ్లు చెప్పినట్లు నామ్ మొహంపై వీఎక్స్ చల్లామన్నారు.

ప్రాంక్ లాగా అనుకున్నాం

ప్రాంక్ లాగా అనుకున్నాం

తాము టీవీల్లో ప్రసారమయ్యే ప్రాంక్స్ తరహా లో ఏదో ఒక చిలిపి పని చేస్తున్నామని అనుకున్నామని నిందితురాల్లు ఇద్దరూ చెప్పారు. చిన్న పిల్లలకు రాసే ఈ ఆయిల్ క్లాత్ అద్దుకుని ఎదురుగా వచ్చే వ్యక్తికి పూయాలని వారికి కొందరు చెప్పారంట.

తెలియకుండానే

తెలియకుండానే

దీంతో వారు తెలియకుండానే ఆ పని చేశారంట. అందుకోసం వారిద్దరికీ డబ్బు ఇచ్చారు. అయితే వారికి ఈ విషయం చెప్పిన వ్యక్తులు మాత్రం అడ్రస్ లేకుండా పోయారట.

నిమిషాల్లోనూ చనిపోయాడు

నిమిషాల్లోనూ చనిపోయాడు

కిమ్‌ జాంగ్‌ నామ్ విష ప్రయోగం జరిగిన తర్వాత అత్యంత వేగంగా ప్రాణాలు కోల్పోయాడు. సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో నామ్‌ చనిపోయాడు. కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఫిబ్రవరి 13, 2017న నామ్ మరణించారు.

ఇరు దేశాల మధ్య సమస్య

ఇరు దేశాల మధ్య సమస్య

కిమ్ జాంగ్ నామ్ మరణించిన తర్వాత మలేషియా, ఉత్తర కొరియాల మధ్య చాలా సమస్యలు ఏర్పడ్డాయి. నామ్ కు మలేషియా పోస్టుమార్టం చేయడమేమిటని ఉత్తర కొరియా మండిపడింది. ఈ విషయంలో ఆ రెండు దేశాల మధ్య కొన్ని వైరుధ్యాలు ఏర్పడ్డాయి.

మలేషియా అన్ని విషయాలు చెప్పింది

మలేషియా అన్ని విషయాలు చెప్పింది

నామ్‌పై దాడి, వైద్యం, చావు, పోస్టుమార్టం, ఇలా ప్రతి విషయంలో మలేషియా తర్వాత స్పష్టత ఇచ్చింది. మోతాదుకు మించిన వీఎక్స్‌ విషాన్ని చల్లడం వల్లే నేరుగా అతడి గుండెపై ప్రభావం చూపి అనంతరం ఊపరితిత్తులపై ప్రభావం చూపి చనిపోయాడని మలేషియాలో అప్పట్లోనే చెప్పింది.

ఎక్కడ అధ్యక్ష పదవికి అడ్డం వస్తాడోనని

ఎక్కడ అధ్యక్ష పదవికి అడ్డం వస్తాడోనని

నామ్ తన అధ్యక్ష పదవికి ఎక్కడ అడ్డు వస్తాడనే ఉద్దేశంతోనే ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, కిమ్ జాంగ్ నామ్ ను దారుణంగా చంపేశాడు. ఈ విషయాలన్నింటినీ దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులు ఆధారాలతో వెల్లడించారు.

ఇవన్నీ మనస్సులో పెట్టుకుని

ఇవన్నీ మనస్సులో పెట్టుకుని

అలాగే 2010లో ఉత్తర కొరియా దేశాధ్యక్షుడిగా కిమ్ జాంగ్ ఉన్ ప్రమాణం చేసినప్పు డు నామ్ వ్యతిరేకించాడు. మూడో తరం వారసత్వం చేపట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను అప్పట్లో నామ్ చెప్పాడు. ఇవన్నీ మనస్సులో పెట్టుకున్న కిమ్ సోదరిని దారుణంగా చంపేశాడు.

అధ్యక్షుడు అయి ఉండేవాడు

అధ్యక్షుడు అయి ఉండేవాడు

కింగ్ జాంగ్ నామ్‌కు ఉత్తరకొరియా అధికారవర్గంలో మంచి నిఘా వ్యవస్థ ఉండేది. చైనాగానీ, అమెరికాగానీ బలంగా మద్దతు ఇచ్చి ఉంటే నామ్ కచ్చితంగా దేశాధ్యక్షుడయ్యేవాడు. కిమ్ జోంగ్ నామ్ తనకు ఎప్పటికైనా ముప్పే అని భావించిన కిమ్ జోంగ్ ఉన్ అతన్ని పక్కా ప్లాన్ తో హత్య చేయించి చేతులు దులుపుకున్నాడు.

Image Source

English summary

North Korea after blaming country for Kim Jong Nam's killing

North Korea after blaming country for Kim Jong Nam's killing