వైద్యుని కళ్ళముందే ఒక మహిళ ఎముకలు అదృశ్యం !

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఎముకలు అదృశ్యమవడం ఏంటి ? వినడానికే వింతగా ఉంది కదా. కానీ ఇక్కడ మేము చేప్పబోయే విషయం వినడానికే వళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. ఒక మహిళ శరీరంలోని ఎముకలు నెమ్మదిగా అదృశ్యమవడం జరుగుతూ వైద్యులకే అంతు చిక్కని విధంగా తయారయింది.

ఎన్నడూ కానీ వినీ ఎరుగని రీతిలో, ఎక్స్- రే నివేదిక ద్వారా నెమ్మదిగా సమయానుసారం ఎముకలు అదృశ్యమవడం కనపడడంతో వైద్యులలో కలవరం మొదలైంది. దీనిని గుర్తించడానికే నెలల సమయం పట్టింది అంటే వైద్యుల కే అంతుచిక్కని సమస్య అని చెప్పకనే చెప్తుంది.

ఈ అంతు చిక్కని మిస్టరీ గురించిన వివరాలు ఒక్కసారి చూడండి.

ఇది నిజంగా మిస్టరీనే :

ఇది నిజంగా మిస్టరీనే :

44 సంవత్సరాల వరకు ఎటువంటి సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉన్న మహిళ, ఒక్కసారిగా ఎడమ భుజం లో నొప్పి అంటూ వైద్యుని సందర్శించింది. ఎక్స్- రే పరీక్షా సమయంలో వైద్య సిబ్బంది, చేతి పై భాగాన అసాధారణంగా పెరిగిన ఎముకల కారణంగా కణితి గా భావించి, దీనిని కాన్సర్ గా అపోహ పడ్డారు. కానీ బయాప్సీ నివేదికలో అది కాన్సర్ కాదని తేలింది. కొన్ని నెలల తర్వాత చేసిన మరో బయాప్సీలో నిరపాయమైన రక్త నాళపు కణితి ఉన్నట్లు అర్ధమైంది. ఆ కణితి ఎలాంటిదో కూడా అనేక పరీక్షలు చేశాక కానీ అర్ధం కాలేదు. కానీ, రక్త నాళాలు పెరగడం కాదు కానీ, ఎముకలు కనపడకుండా పోవడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

రాను రాను నొప్పి పెరుగుతూ ఉంది :

రాను రాను నొప్పి పెరుగుతూ ఉంది :

ఆ మహిళ శరీరం లోని అనూహ్య మార్పుల కారణంగా, వాపు, నొప్పి నెలల వ్యవధిలో పెరుగుతూ వచ్చింది. క్రమంగా చిన్ని చిన్ని సమస్యలకే ఎముకలు విరగడం ప్రారంభమైంది. 18 నెలల వైద్యుల పర్యవేక్షణలో, ఎముకలు నెమ్మదిగా సమయానుసారం అదృశ్యమవుతున్నాయని తేల్చారు. తద్వారా అస్థి , మృదులాస్థి ఎముకలు రెండూ నెమ్మదిగా తగ్గుతూ రావడం గమనించారు . మరియు ఎముకలు పెరగాల్సిన ప్రదేశాలలో రక్తనాళాలు పెరగడం కనిపించింది.

వైద్యులు ఏం చెప్తున్నారంటే ...

వైద్యులు ఏం చెప్తున్నారంటే ...

ఈ పేరు తెలీని మహిళ అనుభవిస్తున్న ఈ వ్యాధిని గోరం- స్టౌట్ వ్యాధిగా గుర్తించారు. దీనికి ఎముకలు అదృశ్యమవడం అనే అర్ధం వస్తుంది. ఎక్కువగా ఎముకలలో పటుత్వం లేని వారిలో అత్యంత తక్కువ పరిస్థితుల్లోనే ఈ వ్యాధి వస్తుందని. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వేళ్ళ మీద లెక్కబెట్టే స్థాయిలోనే ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పట్లో అంతగా కంగారు పడనవసరం లేదని, కానీ ప్రయోగాలు మాత్రం జరుగుతూ ఉన్నాయని తెలిపారు.

ఈ పరిస్థితికి కారణమేమిటో .. !

ఈ పరిస్థితికి కారణమేమిటో .. !

ఈ వింతైన పరిస్థితికి కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు. పరీక్షలు మాత్రం జరుగుతున్నాయి. ప్రపంచ అరుదైన రుగ్మతల నివారణా సంస్థ నివేదిక ప్రకారం, జన్యు పరమైన లోపాల వలన లేదా పరిసరాల పెను మార్పుల ప్రభావాల వలన, ఆహార ప్రణాళికలలో అసాధారణ మార్పులు, జీవన శైలి, కాలుష్యం వంటి ప్రభావాల కారణంగా ఇలాంటి అరుదైన రోగాలు సంభవిస్తాయని తెలిపింది.

ఈ వ్యాధికి గురైన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ...

ఈ వ్యాధికి గురైన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ...

ఈ సమస్య వలన శరీరం లోని లింఫటిక్ నాళాలు మరియు రక్తనాళాల పెరుగుదల అసాధారణ స్థాయికి వెళ్ళడం మూలాన , వైద్యం కూడా క్లిష్టతరం గానే ఉంటుంది. ఉదాహరణకు చెప్పిన ఈ మహిళ ఉదంతం ప్రకారం, 9 సంవత్సరాల వ్యవధిలో, 25 ఆపరేషన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరి నివారణ ఉందా లేదా ?

మరి నివారణ ఉందా లేదా ?

నిజానికి ఈ రోగానికి ఖచ్చితమైన వైద్యం అంటూ ఏదీ లేదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆపరేషన్ ద్వారా ప్రభావానికి గురైన ఎముకలకు, రక్త కణుతులకు రేడియేషన్ ప్రక్రియ ద్వారా వైద్యం చేస్తారు. తద్వారా అది వ్యాపించకుండా చేయగలుగుతారు. కానీ అన్నీ వేళలా ఈ ప్రక్రియ మంచి ఫలితాలను ఇవ్వలేదు. ఒక్కోసారి ఆపరేషన్ ఫెయిల్ అయి వ్యాపించే దిశగా కూడా ఉంటుంది.

ఈ వ్యాధి గురించి మీరేమనుకుంటున్నారు, క్రింది కామెంట్ సెక్షన్లో తెలుపండి.

English summary

OMG! Can You Believe Her Bones Vanish Before Doctor’s Eyes?

A strange case of a woman's disappearing bones was reported. Apparently, the woman had pain in her arm and shoulder for a long time. Doctors couldn't figure out what was causing it. It is reported that in a series of X-rays, her bones seemed to be disappearing before the doctors' eyes.Have you ever got the crazy thought of your bones vanishing one fine day? No, right?
Story first published: Thursday, April 19, 2018, 20:00 [IST]