For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తమకు తామే సర్జరీ చేసుకుని బ్రతికిబట్టకట్టిన వారు ఉన్నారంటే నమ్మగలమా

|

మీకు మీరే శరీరాన్ని కోసుకుని ఆపరేషన్ నిర్వహించగాలరా? వినడానికే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది కదా. కానీ కొందరు కొన్ని ఊహకు అందని ఆపరేషన్లను కూడా తమకు తామే నిర్వహించుకుని బ్రతికి బయటపడిన వారున్నారు.

ఇది నమ్మలేని విషయంగా అనిపిస్తున్నప్పటికీ, తమ శరీరాన్ని కోసుకుని సమస్యను కనుగొని, పరిష్కరించి, తిరిగి కుట్లు వేస్కోడానికి ఖచ్చితంగా ధైర్యం, తెగింపు, సాహసం వంటి లక్షణాలు ఉండాల్సిందే. వీరిలో కొందరు తప్పక ఆపరేషన్లకు పాల్పడితే, కొందరు తమ తమ ఆలోచనా తీరు, అవసరాలను ఉద్దేశించి పూనుకోవలసి వచ్చింది.

People Who Performed Surgery On Themselves And Survived!

ఈ స్వీయ ఆపరేషన్ అనే ఆలోచనే పీడకలలా అనిపిస్తుంది కదూ., కానీ ఇక్కడ చెప్పబడుతున్న కొందరు ధైర్యవంతులైన వ్యక్తులు తమకు తామే ఆపరేషన్ నిర్వహించుకుని బ్రతికి బయటపడి ప్రపంచంతో తమ కథను పంచుకున్నారు కూడా.

1.జాన్ దే డూట్:

నివేదికల ప్రకారం, 1651 లో, జాన్ దే డూట్ అనే డచ్ కమ్మరి, తనకు అత్యంత బాధాకరoగా పరిణమించిన పిత్తాశయ రాళ్ళను తొలగించడానికి, బహిరంగ సిస్టోలితోటమీ శస్త్రచికిత్సకు పూనుకున్నాడు. ఇంతకుముందు ఇవే శస్త్రచికిత్సలు రెండు జరిగాయి. రాతిని ముక్కలు చేసే యంత్రాల చేత చేయబడిన ఈ శస్త్రచికిత్స అత్యంత బాధాకరమైనది. అప్పట్లో మత్తుమందు ఇచ్చి వైద్యం చేయడం అనేది అరుదు. ఎక్కువగా మత్తు మందు లేకుండానే శస్త్రచికిత్సలు జరిగేవి. ఆ క్రమంలో భాగంగా ఆపరేషన్ కు భయపడిన ఇతను, తిరిగి అటువంటి నొప్పిని అనుభవించుటకు సిద్ధంగా లేనందున, వైద్యుని వద్దకు వెళ్ళడానికి సంకోచించాడు. క్రమంగా ఇది అతనికి అపారమైన నొప్పిని కలిగించింది. నొప్పి తీవ్రత అధికమయ్యేసరికి, తనకు తానే ఆపరేషన్ చేస్కోవాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుని సహాయంతో కోత వేసి, పిత్తాశయంనుండి కోడి గుడ్డు పరిమాణంలోని రాయిని తొలగించాడు.

కోత వేసిన భాగాన్ని హీలర్ ఉపయోగించి కుట్లు వేసి, గాయమైన చోట కోత కనపడకుండా బంగారుపూతతో పెయింటింగ్ చేశాడు.

2.ఐన్స్ రామిరేజ్ పెరెజ్

ఐన్స్ రామిరేజ్ పెరెజ్ అనే మహిళ గర్భస్రావం కారణంగా ఒక శిశువును కోల్పోయింది. కానీ ఆ గర్భ విచ్చిన్నతను గురించిన పూర్తి వివరాలను తెలుసుకుంది. రెండవసారి మరలా నొప్పులు ప్రారంభమైనప్పుడు, ఆమె గతంలో అనుభవించిన నొప్పితో సమానమైన నొప్పిని పొందిన అనుభూతికి లోనైంది. ఉమ్మనీరు సంబంధిత సమస్యగా కనుగొంది, మరియు గతంలో మాదిరి బిడ్డను కోల్పోవడానికి సిద్దంగా లేదు. వెంటనే ఒక 15 సెంటీమీటర్ల పొడవు బ్లేడు ఉన్నవంటగదిలోని కత్తిని తన కడుపుమీద కోత వేసుకోడానికి సిద్దం చేసుకుంది,. ఈ ఆపరేషన్ ముందు మూడు చిన్న గ్లాసుల ఆల్కహాల్ సేవించింది. తరువాత తన పొత్తికడుపు భాగంలో ఒక 18 సెంటీమీటర్ల రంధ్రం గావించి, ఆమె అవయవాలను ఒక వైపుకు జరిపి శిశువును బయటకు తీసే పనికి ఉపక్రమించింది.

కానీ ఈ తతంగమంతా అనస్తీషియా లేకుండా జరిగింది. తర్వాత, ఆమె తన పిల్లల్లో ఒకరిని గాయాలను కుట్లు వేయగల వ్యక్తిని తీసుకురమ్మని పురమాయించింది. ఆసుపత్రిలో చేర్చిన 5 రోజుల తరువాత డిశ్చార్జ్ అయ్యింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమం.

3. అరోన్ రాల్స్టన్

అనేక మందికి కంట తడి పెట్టించిన కథ ఇది. అరోన్ రాల్స్ంన్ అనే ఔత్సాహికుడు, సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస చర్యలను ఇష్టపడేవాడు. అటువంటి ట్రెక్కింగ్లో భాగంగా, అనుకోకుండా దక్షిణ అమెరికా ప్రాంతంలోని బ్లూ జాన్ అనే లోయలో పడిపోయాడు. మరియు అతని చేయి బండరాళ్ల మద్యన ఇరుక్కోవడం మూలంగా చేతిని విడిపించుకోలేని స్థితికి చేరుకున్నాడు. రోజులు గడుస్తున్నా, ఆ ప్రాంతానికి ఎవరూ రాకపోవడం మరియు అరిచిన కేకలు ఎవరికీ వినపడని తరుణంలో, ఆకలి చావుకు గురవుతానన్న విషయాన్ని గ్రహించిన అరోన్, తన చేతిని బండరాయి నుండి విడిపించుకునే క్రమంలో భాగంగా తన బాగ్ లోని మల్టీ టూల్ కట్టర్ సహాయంతో, అతి కష్టం మీద రాయి నుండి తన చేతిని విడిపించుకొనుటకు , తన చేతిని తానే తొలగించుకునే ప్రయత్నం చేశాడు. విపరీతమైన నొప్పి, భాదతో అతి కష్టం మీద చేతిని తొలగించుకుని బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు. ఒక మనిషి ప్రాణ భయంతో అన్ని రోజులు బండ రాళ్ళ మద్య ఇరుక్కోవడం, ప్రాణాలు కాపాడుకునే క్రమంలో చేతినే నరుక్కోవడం వంటి చర్యలు ప్రపంచాన్నే కలవరపరచింది.

ఈ ఉదంతంమీద 2010లో 127 హవర్స్ అనే పేరు మీద సినిమా కూడా వచ్చింది. ఈ హాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందించిన వ్యక్తి ఏ.ఆర్.రెహ్మాన్.

4.రోలాండ్ మేరీ:

రోలాండ్ మెరీ సొంతంగా సెక్స్-రీఅసైన్మెంట్ శస్త్రచికిత్స చేసుకుని బయటపడ్డ వ్యక్తిగా నిలిచాడు. 2009 లో, ఇంగ్లాండ్లోని 61 ఏళ్ల రోలాండ్ మెరీకి, సెక్స్-రీసైన్మెంట్ శస్త్రచికిత్స అవసరమైంది. అతను ఒక ఆసుపత్రికి వెళ్ళగా, అక్కడి వైద్యులు రెండు సంవత్సరాలు వేచి ఉండాలని చెప్పారు,. 2 సంవత్సరాలను ఆలస్యంగా భావించిన రోలాండ్ మేరీ స్వీయ శస్త్రచికిత్సకు పూనుకున్నాడు.

క్రమంగా, ఒక ఉదయం పెయిన్ కిల్లర్స్ తీసుకుని, కొన్ని శస్త్రచికిత్స ఉపకరణాలతో తన బాత్రూంలోకి వెళ్లారు. అతను తన జననేంద్రియాలను నెమ్మదిగా తొలగించి వైద్య సహాయం కోసం తన భార్యకు పిలుపునిచ్చాడు. అయినప్పటికీ వైద్యులు ,అతని భార్యని అతనితో పాటు ఆసుపత్రికి వచ్చేందుకు అంగీకరించలేదు. ఈవిడే అతన్ని గాయపరచిందని అపోహపడ్డారు.

కానీ తర్వాత, ఆ ఆపరేషన్ జరుగుటకు కర్త అతనే అని తెలుసుకుని నివ్వెరపోయిన వైద్యులు, ఆపరేషన్ సరిగ్గానే చేసుకున్నాడని అతనికి, అతని భార్యకు తెలియజేసారు. తర్వాతి చర్యలు వైద్యులకు అంత శ్రమగా తోచలేదు. భార్యని నేరస్తురాలిగా పరిగణించినందుకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితికి వైద్యులు లోనయ్యారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

People Who Performed Surgery On Themselves And Survived!

Can you imagine cutting yourself open and conducting an operation on yourself? This sounds gross, but do you know that there have been people who have operated themselves and even survived these scary surgeries? Though this seems to be unbelievable, one needs to have real guts to even look inside their own body and find the fault and remove it while being awake!
Story first published: Thursday, June 28, 2018, 12:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more