' R ' అక్షరం తో మొదలయ్యే వ్యక్తులకు ఈ 8 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి :

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

వివిధ వర్గాల నుండి అందిన సమాచారం ఆధారంగా మనలో ఉన్న రహస్య వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవడానికి మనమందరం ఇష్టపడతాం. మన శరీర లక్షణాల దగ్గర నుండి మన పేర్ల వెనుక ఉన్న చరిత్ర తెలుసుకునే వరకు ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి విశ్లేషణ చేస్తుంటాం. ఏ వ్యక్తుల పేర్లు అయితే ' R' అక్షరంతో మొదలవుతుందో ఆ వ్యక్తుల లక్షణాలను మనం ఇప్పుడు ఈ వ్యాసం లో తెలుసుకోబోతున్నాం.

Personality Of Individuals Whose Name Starts With Letter “R”

మన పేరు ఎదో ఒక సంఖ్యకు సంబంధించిన చిహ్నాన్ని సూచిస్తుందని తెలుసా ? అంతేకాకుండా అది పూర్తిగా మన వ్యక్తిత్వ లక్షణాల గురించే ఎక్కువగా తెలియజేస్తుంది అని తెలుసా ? కానీ, ఆలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మనపేరు లో ఉండే మొదటి అక్షరం మన వ్యక్తిత్వ లక్షణాల గురించి పూర్తిగా తెలియజేస్తుంది. ఎవరి పేరు అయితే ' ఆర్ ' అనే అక్షరంతో మొదలవుతుందో వారి వ్యక్తిత్వ లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఏ వ్యక్తి పేరులో అయితే ' ఆర్ ' అక్షరం తో మొదలవుతుందో వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే....

ఏ వ్యక్తి పేరులో అయితే ' ఆర్ ' అక్షరం తో మొదలవుతుందో వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే....

సంఖ్యా శాస్త్రం ప్రకారం పేరులో ఎవరికైతే 'ఆర్' అనే అక్షరం ఉంటుందో వారు ధర్మ పరులుగా ఉంటారు, శక్తివంతంగా వ్యవహరిస్తారు, శాంతంగా ఉంటారు. వీరు త్వరగా స్నేహితులను సంపాదించుకోగలరు. ప్రేమను, వారి నిజమైన విలువలను, ఇతరులు పాటించే ధర్మాన్ని ఇలా అన్నింటిని అభినందిస్తారు.

వీరు డబ్బు సంపాదిస్తారు కానీ :

వీరు డబ్బు సంపాదిస్తారు కానీ :

ఈ వ్యక్తులు డబ్బుని బాగానే సంపాదిస్తారు కానీ, మరో వైపు అస్థిర మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దీని వల్ల ఈ వ్యక్తులు అనూహ్యంగా నష్టపోతుంటారు. అందుచేతనే, పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

వీరు సాధారణంగానే అధికారాన్ని చలాయిస్తారు :

వీరు సాధారణంగానే అధికారాన్ని చలాయిస్తారు :

సాధారణంగానే అధికారాన్ని చెలాయించే తత్వం వీరిలో ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే ఇతరుల పై ప్రభావం చూపగలరు. ఇతరుల తో స్నేహితులుగా చాలా సులభంగా కలిసిపోతారు. కానీ, వీరిని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు. ఈ కారణం వల్లనే నమ్మకానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి.

వీరు అర్ధంకాని రీతిలో వ్యవహరిస్తారు :

వీరు అర్ధంకాని రీతిలో వ్యవహరిస్తారు :

చూడటానికి వీరు అర్ధంకాని రీతిలో వ్యవహరించే వ్యక్తులుగా కనిపిస్తారు. అందువల్ల ఎక్కువగా పుకార్లకు బాధితులుగా మారుతుంటారు. మరో వైపు ముక్కు సూటిగా, మనస్సులో ఏది దాచుకోకుండా మాట్లాడేస్తుంటారు. ఇదే కాకుండా బాగా వాక్ చాతుర్య నైపుణ్యం కలిగి మంచి వక్తలుగా పేరు తెచ్చుకుంటారు.

వాస్తవికంగా వ్యవహరిస్తారు :

వాస్తవికంగా వ్యవహరిస్తారు :

ఈ వ్యక్తులు హేతుబద్దమైన వాస్తవికంగా, స్వీకార స్వభావం కలిగి, విశ్రాంతంగా, నమ్మకమైన, వనరులుగా, గౌరవించబడిన, బాధ్యతకలిగిన, ప్రేమపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.

వీరు చాలా విశ్వాసం తో వ్యవహరిస్తారు :

వీరు చాలా విశ్వాసం తో వ్యవహరిస్తారు :

విశ్వాసం, కారుణ్య స్వభావం, ప్రేమపూరితమైన స్వభావంతో వీరు వ్యవహరిస్తారు. ఒకవేళ ఇతరుల దగ్గర నుండి ఎక్కువ లాభం వస్తుంది అని అనిపిస్తే, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనే ఆలోచనతో నమ్మకం లేని వ్యక్తులుగా వ్యవహరిస్తారు లేదా పైకి ఎదిగే అవకాశం వస్తే కూడా అలానే వ్యవహరిస్తారు.

తీక్ష బుద్ది కలిగి ఉంటారు :

తీక్ష బుద్ది కలిగి ఉంటారు :

తీక్ష బుద్దిని కలిగి ఉండి సహజంగానే తెలివైన వారై ఉంటారు. అందుచేతనే, చాలా తక్కువ సమయంలోనే ఎటువంటి కష్టతరమైన సందర్భాన్ని అయినా అర్ధం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి పై ఇతరులు మరీ ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించలేరని గుర్తించాలి.

ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు :

ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు :

వారిని వారు ఉత్తమంగా మలచుకోవడానికి, ప్రవర్తనను మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వారి మేధో స్థాయికి తగ్గ భాగస్వామిని ఎంచుకోవాలనే ఉద్దేశ్యం ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ తనకు ఆ భాగస్వామి దక్కే అర్హత ఉంది అని నిరూపించుకోవడానికి ఎక్కువగా పరితపిస్తుంటారు. మరో వైపు వ్యక్తిగా ఏదైనా అంగీకరించగల స్వభావము కలిగి ఉంటారు అదే సమయంలో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు.

English summary

Personality Of Individuals Whose Name Starts With Letter “R”

According to numerology, those individuals whose name starts with the letter "R" are said to be virtuous, powerful and pleasant. These individuals can make friends easily. They appreciate love, their true worth and virtue by the others. On the other hand, others need to remember that no one can take them for a ride.
Story first published: Saturday, March 17, 2018, 19:00 [IST]