బలమైన వ్యక్తిత్వాన్ని నిర్దేశించే వ్యక్తిత్వ లక్షణాలు ఇవే !

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

సాధారణంగా మనం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పోల్చిచూసుకుంటూ ఉంటాము. దీనికి కారణం వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండడంతో పాటు, మన కలల సాకారానికి మార్గదర్శకులుగా ఉంటారు. ఎందుచేతననగా వీరు కొన్ని బలమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉండడమే.

కాని ఈ బలమైన వ్యక్తిత్వం గురించి మనకు ఎలా తెలుస్తుంది?

Personality Traits Of A Strong Individual

అంచనా వేయడం కష్టతరం అయినప్పటికీ కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అందులో మనమీద మనకు నమ్మకం కలిగి ఉండడం(సెల్ఫ్ కాన్ఫిడెన్స్), ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, నిజాయితీ మరియు దైర్యం ముఖ్యమైనవి. ఈ నాలుగింటినీ ఒక వ్యక్తియొక్క బలమైన వ్యక్తిత్వ లక్షణాలుగా చెప్పబడినవి.

కాని ఇవే కాకుండా ఒక బలమైన వ్యక్తిత్వాన్ని నిర్వచించే మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

మిత్రుల ఎంపికలో తెలివిగా ఉంటారు:

మిత్రుల ఎంపికలో తెలివిగా ఉంటారు:

బలమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సాటిమనుషులను పూర్తిగా విశ్వసించలేడు. వారు తమరి జీవితాలలోకి వచ్చే ప్రతి వ్యక్తి గురించి పూర్తి అవగాహనతో, జాగ్రత్త కలిగినవారై ఉంటారు. కాని ఎంపిక చేసుకున్న స్నేహితులు తమ క్లిష్టసమయాల్లో వెన్నంటి ఉండేవారిలా ఉంటారు. ఇక్కడ వారి ఎంపిక అనునది ప్రముఖమైన వ్యక్తిత్వ లక్షణం.

తమరిని తాము గొప్పగా చూపుకొనుటకు ఇష్టపడరు

తమరిని తాము గొప్పగా చూపుకొనుటకు ఇష్టపడరు

కొందరు వీరిని గొప్పలకుపోయే వారిలా, ఆకర్షితులుగా భావిస్తారు, కాని నిజం ఏమిటంటే వారి మనోహరమైన వ్యక్తిత్వం మరియు ఆలోచనా దృక్పధం కారణంగా ప్రజలకు ఉన్నతంగా కనిపిస్తారు. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన యొక్క నిజాయితీ, ఆలోచనా వ్యక్తిత్వం మీదనే మనుషులు దగ్గరకు రావడం జరుగుతుంది. అంతకు మించి అసూయా పరులు కూడా పెరుగుతారు అనడంలో ఆశ్చర్యం లేదు. కాని, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారు ఏ విషయానికి తొణకరు అనునది అక్షర సత్యం. ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు అత్యంత శక్తివంతులు అవుతారు అనడంలో ఆశ్చర్యం లేదు.

వారికి ఒకరి గుర్తింపు అవసరంలేదు

వారికి ఒకరి గుర్తింపు అవసరంలేదు

వీరు తమకు ఇష్టమైన పనులనే చెయ్యడానికి సిద్దంగా ఉంటారు, తద్వారా ఆలోచనా శక్తి చాలా పదునుగా ఉంటుంది. ఈలక్షణం చేత ఒకరి గుర్తింపు రావాలనే తాపత్రయం ఎప్పుడూ ఉండదు. తమ పనులు తాము చేసుకునిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.

వీరు కొందరు అవిశ్వాసులకు మరియు చిత్తచాపల్యం కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంటారు

వీరు కొందరు అవిశ్వాసులకు మరియు చిత్తచాపల్యం కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంటారు

కొందరు వ్యక్తులు ఆలోచన చెయ్యకుండా మాట్లాడుతూ ఉంటారు, మరియు అవమానకరమైన విషయాలను అస్పష్టంగా మాట్లాడుతూ చిత్తచాపల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటివి తరచూ అపార్ధాలకు దారితీయడం వలన స్నేహ సంబంధాలు దృడంగా ఉండవు. బలమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులు మంచి అవగాహనా శక్తిని కలిగి ఉండడం చేత, తమకు తగిన ఆలోచనలు వ్యక్తులలో కనపడనప్పుడు, వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు.

తక్కువ మాట్లాడడం వారి సహజ లక్షణం

తక్కువ మాట్లాడడం వారి సహజ లక్షణం

గాసిప్స్, చిట్ చాట్ లాంటి వాటికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతారు. వీరి దృక్పధం ప్రకారం అవి సమయాన్ని దుర్వినియోగం చేసేవే తప్ప తమ జీవిత లక్ష్యానికి ఏ మాత్రమూ ఉపయోగపడవు అని వీరి అభిప్రాయము. ఈ సమయాన్ని వీరు వేరే ఉన్నతమైన చర్చలు లేదా పనులు చేయడానికి వినియోగించుటకు ఇష్టపడుతారు.

వారు గొప్ప శ్రోతలు

వారు గొప్ప శ్రోతలు

బలమైన వ్యక్తిత్వం కలిగినవారు గొప్ప శ్రోతలు గా ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు, వీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనవసరమైన విషయాలను వదిలివేసి అవసరమైన మేరకే విషయాలను తెల్సుకుని తద్వారా చర్చా కార్యక్రమాలు సఫలం అగునట్లు కృషి చేస్తారు. ఎక్కువ వినడం, ఎక్కువ తెలివిని సముపార్జన చెయ్యడం వీరి ప్రధాన లక్షణంగా ఉంటుంది.

English summary

Personality Traits Of A Strong Individual

People with strong personality traits have what it takes to stand out in a crowd. These individuals choose friends wisely, they are not attention seekers, they do not like others validating for their thought process. On the other hand, they stay away from ignorant people. They are believed to be great listeners as well!
Story first published: Tuesday, March 6, 2018, 8:00 [IST]