For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంది కడుపున పిల్లవాడు అస్సలు నిజం కాదు, అది ఇటలీకి చెందిన ఒక బొమ్మ, వాస్తవం తెలుసుకోండి

అసలు విషయం ఏమిటంటే అదంతా కూడా అబద్దమే. ఇది ప్రపచం మొత్తం కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా దుష్ప్రచారం అయ్యింది. పందికి మనిషి పుట్టాడని ప్రచారం చేశారుగానీ.. వాస్తవానికి అది ఒక బొమ్మ మాత్రమే. సిలికాన్ బొమ్మ.

|

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం పిల్లలను కిడ్నాప్ చేసేవాళ్ల గురించి జోరుగు ప్రచారం సాగింది. అందంతా కూడా ఫేక్. ప్రస్తుతం పంది కడుపున మనిషి రూపంలో ఉన్న పిల్లవాడు పుట్టాడంటూ రూమర్లను కొందరు క్రియేట్ చేశారు. బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందంటూ ప్రచారం చేశారు.

పందికి పిల్లవాడు ఫలానా ప్రాంతంలో జన్మించాడు రెండు తెలుగు రాష్రాల్లో పలు పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. దీనిపై దారుణంగా దుష్ప్రచారం చేశారు. చాలా మంది జనాలు ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా దాన్ని అలాగే అందరికీ షేర్ చేస్తున్నారు.

బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది

బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది

మన రెండు రాష్ట్రాల పాటు ఈ ప్రచారం పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. అందరూ కూడా నిజంగా బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది అని అనుకున్నారు. కొన్ని వెబ్, యూట్యూబ్ ఛానెల్స్ లలో కూడా ఇది నిజమంటూ ప్రచారం చేశారు.

అదంతా కూడా అబద్దమే

అదంతా కూడా అబద్దమే

అసలు విషయం ఏమిటంటే అదంతా కూడా అబద్దమే. ఇది ప్రపచం మొత్తం కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా దుష్ప్రచారం అయ్యింది. పందికి మనిషి పుట్టాడని ప్రచారం చేశారుగానీ.. వాస్తవానికి అది ఒక బొమ్మ మాత్రమే. సిలికాన్ తో అందమైన బొమ్మలను తయారు చేయడంలో మగానుకో లైరా అనే కళాకారిని దిట్ట. ఈమెది ఇటలీ.

వింత జీవి ఆకారంలోని బొమ్మను తయారు చేసి

వింత జీవి ఆకారంలోని బొమ్మను తయారు చేసి

ఈ క్రమంలోనే లైరా ఒక వింత జీవి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేందుకు గాను దాన్ని రకరకాలుగా ఫొటోలు తీసింది. పడుకున్న పంది పక్కన కూడా ఆ బొమ్మను పెట్టి ఫొటోలు తీసింది. అయితే ఈ ఫొటోలు నెట్ లోకి రావడంతో కొందరు ఆకతాయిలు దానిపై దుష్ర్పచారం చేశారు.

ఒక్కొక్కరు ఒక్కోరకంగా

ఒక్కొక్కరు ఒక్కోరకంగా

కొందరు ఈ సంఘటన యాదాద్రిలో జరిగిందని, మరికొందరు తిరుపతిలో జరిగిందని, ఇలా ఒక్కొక్కరు వారికి ఏ ఊరు దగ్గర ఉంటే ఆ పేరు పెట్టి సోషల్ మీడియాలో ఈ ఫొటోలను అందరికీ పంపారు. ఇలాంటి విషయాలను చదువుకున్న వారు కూడా నమ్మేస్తున్నారు.

తెలుసుకుని షేర్ చేయండి

తెలుసుకుని షేర్ చేయండి

కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దాని గురించి కాస్త తెలుసుకుని తర్వాత ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల కొన్ని సందర్భాల్లో అమాయకులు బలి అయిపోతున్నారు. కొన్నాళ్ల క్రితం పిల్లలను ఎత్తుకుని వెళ్లేవారు వచ్చారని జోరుగా ప్రచారం సాగడంతో ఆ సమయంలో చాలా మంది అమాయకుల ప్రాణాలు తీసేశారు.

Image credit(all pics)

English summary

pig gives birth to human baby facts

Hoax Alert! People Claim Pig Gave Birth To Half-human Half-pig. The reports feature several photographs depicting the bizarre looking human pig hybrid. Some versions claim that the baby died soon after delivery. The “baby hybrid pig” is not a real living creature but rather a silicon sculpture created by the Italian artist Maganuco Laira.
Desktop Bottom Promotion