ప్రియాంక వైశ్య బాడీ చూస్తే అవాక్కు అవుతారు.. అందుకే స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అయ్యింది

Written By:
Subscribe to Boldsky

సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీ అంటే ప్రతి ఒక్కరికీ భలే క్రేజీ. అలా బాడీ మార్చుకోవాలంటే చాలా కష్టాలు పడాలి. మగవారు అంటే ఏదోలా కష్టపడి ఆ ప్యాక్స్ సాధిస్తారు. కానీ ఒక అమ్మాయి సిక్స్ ప్యాక్ బాడీ తో పాటు మగవారికన్నా చాలా స్ట్రాంగ్ తయారైంది. చివరకు స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్ని తన సత్తా చాటింది.

ప్రత్యేక పేరును సంపాదించుకుంది

ప్రత్యేక పేరును సంపాదించుకుంది

స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో సాధారణంగా పురుషులు పాల్గొంటారు. కానీ ఈ పోటీల్లో ఓ ఇరవై ఐదేళ్ల అమ్మాయి పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక పేరును సంపాదించుకుంది. ఆ అమ్మాయి పేరే ప్రియాంక వైశ్య.

రెండోసారి

రెండోసారి

ప్రియాంక వైశ్య ఇటీవల అండర్‌ 30 విభాగంలో స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. కిరీటాన్నీ అందుకుంది. పైగా ఈ గుర్తింపు రావడం ఆమెకిది రెండోసారి.

ఉద్యోగంలో సంతృప్తి లేదు

ఉద్యోగంలో సంతృప్తి లేదు

గతంలో ఈమె ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేది. కానీ ఆమెకు ఆ ఉద్యోగంలో అంతగా సంతృప్తి లభించేది కాదు. అందరి మాదిరిగా మూసధోరణిలో వెళ్లాలని ఆమె అనుకునేది కాదు. తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకోవాలని ఎప్పుడూ పరితపించేంది.

బాడీ బిల్డింగ్ రంగంలోకి

బాడీ బిల్డింగ్ రంగంలోకి

ప్రియాంక వైశ్యకు ఒక బాడీ బిల్డర్‌ పరిచయం అయ్యారు. అతని పేరు ప్రమోద్‌. ఆయనతో మాట్లాడాకే ప్రియాంకకు బాడీ బిల్డింగ్ రంగంలోకి రావాలని అనిపించింది. వెంటనే ఉద్యోగం మానేసింది.

రోజంతా జిమ్‌లోనే

రోజంతా జిమ్‌లోనే

ప్రియాంక భోపాల్‌ వెళ్లింది. అక్కడ బాడీబిల్డింగ్‌లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో ప్రియాంక రోజంతా జిమ్‌లోనే ఉండేది. ఎన్నో రకాల కసరత్తులు చేసేది. అలా తన బాడీ రూపరేఖలు మార్చేసుకుంది ప్రియాంక.

ఫస్ట్ టైమ్ మహిళలకు అవకాశం

ఫస్ట్ టైమ్ మహిళలకు అవకాశం

స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు మహిళలకు గతంలో అవకాశం ఉండేది కాదు. కానీ గతేడాది ఫస్ట్ టైమ్ మహిళలకు కూడా అవకాశం కల్పించారు. అందులో చాలా రకాలు విన్యాసాలు చేయాల్సి ఉంటుంది.

ఫస్ట్ టైటిల్

ఫస్ట్ టైటిల్

120 కిలోల బరువులెత్తడం, 40 కిలోల రాయిని మోయడం ఇలా చాలా రకాల పోటీలుంటాయి. వాటన్నింటినీ అలవోకగా చేసేసి ఫస్ట్ టైటిల్స్ గెలుచుకుంది ప్రియాంక.

రెండోసారి టైటిల్‌

రెండోసారి టైటిల్‌

గతేడాది కోల్‌కతాలో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ప్రియాంక మొదటి సారి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇక గత నెలలో ఢిల్లీలో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది.

పది గంటల పాటు జిమ్‌లో

పది గంటల పాటు జిమ్‌లో

ఇక ప్రియాంక దగ్గర చాలా మంది శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ప్రియాంక రోజూ తెల్లవారుజామున 4.30 గంటల నుంచి దాదాపు పది గంటల పాటు జిమ్‌లోనే కసరత్తులు చేస్తుందట.

లక్షల్లో జీతం

లక్షల్లో జీతం

తన ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు నెలకు లక్షల్లో జీతం తీసుకుంటారని ప్రియాంక పేర్కొంది. కానీ వారికి తన మాదిరిగా సిక్స్‌ ప్యాక్‌ ఆబ్స్‌ లేవు కదా, అందుకే నేను వాళ్లకన్నా బెటర్ గానే ఉన్నానని ఫీలవుతున్నా అంటోంది ప్రియాంక.

Image Source

English summary

priyanka vaishya a bhopal techie who turned into a powerwoman is an inspiration for all girls today

priyanka vaishya a bhopal techie who turned into a powerwoman is an inspiration for all girls today
Story first published: Tuesday, April 10, 2018, 15:00 [IST]