For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజ జీవిత గాధలు : ఒక్క ఫోటోషూట్ ఈ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది: తప్పక చదవండి.

|

మనిషంటే చర్మం కాదు, మనిషంటే రూపం కాదు, మనిషంటే అసలు అర్ధం ఈవ్యాసం చదివాక మీకే అర్ధమవుతుంది.

చర్మపు రంగుని, మీరు ఉండే విధానాన్ని, మీ రూపుని ఎవరైనా అదేపనిగా అవమానించడం లేదా ఎగతాళి చేయడం వంటి చర్యలు ఆత్మవిశ్వాసం మీద దెబ్బ పడేలా చేస్తాయి. అవునా?

కేవలం ఇటువంటి అవమానాల కారణంగా నిరాశానిస్పృహలకు లోనై, ఆత్మవిశ్వాసం కోల్పోయి, మనుగడ సాగించడానికి భయపడి, ఆత్మహత్య చేసుకున్నవారిని కూడా మనం తరచుగా చూస్తుంటాము. నిజానికి ఇలా అవమానించే వారు కూడా హంతకులతో సమానం. సాటి మనిషి గుణగణాలను పరిగణనలోకి తీసుకోకుండా, రూపురేఖల గురించి మాట్లాడి వారిని ఆత్మన్యూనతకు గురయ్యేలా చేసేవారిని ఇంకేం అనాలో మీరే చెప్పండి?

She 	Was Shunned By People For Her Colour And Hair!

కొందరైతే ఆమెని ఫెయిర్నెస్ క్రీం వాడమని సలహా కూడా ఇచ్చారు:

ముంబాయిలోని కొందరు నెటిజన్లు ఫేస్బుక్ లో పంచుకున్న ఒక యువతి నిజ జీవిత గాధని మీతో పంచుకోబోతున్నాము. పెరుగుతున్న కొద్దీ, ఎన్నో అవమానాలు హేళనల మద్య సాగుతున్న జీవితం నుండి బయటపడే మార్గంలేక దాక్కొని గడపాల్సిన స్థితిని ఎదుర్కొంది ఆ మహిళ. కానీ, ఒక్క ఫోటోషూట్ తన జీవితాన్నే మార్చివేసింది. ఎవరైతే హేళన చేసారో వారే అవాక్కయ్యేలా.

తనను అవమానించిన మాటలను గుర్తుపెట్టుకుంది:

నిజమే, ఆప్యాయతలు ఎంతగా మనసులో ముద్ర పడుతాయో, అవమానాలు కూడా అంతే. తన చర్మపు రంగును, జుట్టు విధానాన్ని అవమానించిన వ్యక్తుల మాటలను మర్చిపోలేకపోతుంది. ఆ మాటలు మీరు కూడా చూడండి.

తన ముదురు రంగు చర్మంతో విదేశీ వనితను తలపించేలా కనిపిస్తున్నావని, ఏదైనా ఫెయిర్నెస్ క్రీం రాయొచ్చు కదా అని ఎంతోమంది నన్ను హేళన చేశారు. కొందరు నాతో నడవడమే ఇబ్బందిగా ఉందన్నారు. మరొక మహిళ ఏకంగా మరింత దిగజారి నన్ను చెప్పుతో కొట్టి, ఈ ప్లేగ్రౌండ్ లో ఉండుటకు నీకు అర్హత లేదు, వెళ్ళిపో అంది. కోపం దిగమింగుకుని, భాధతో అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఒకానొక సందర్భంలో నామీద నాకే అవమానంగా తోచింది. నా పుట్టుక తప్పా, నన్నిలా హేళన చేస్తున్న వీరిది తప్పా ? అన్న ఆలోచన నన్ను నిద్ర కూడా పోనివ్వలేదు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల సౌందర్య ప్రమాణాలను నేను పాటించలేకపోయానేమో అన్న భావన మనసు నిండా.

అప్పటిదాకా ఎన్నో భాధలు పడ్డ నాకు నాకళాశాల జీవితం, తెలియని మార్పులను జీవితంలో తీసుకురావడం ప్రారంభించింది. నా సీనియర్లు ఒక ఫోటో షూట్లో పాల్గొనమని సలహా ఇచ్చారు. నేను ఎటువంటి వ్యతిరేకత చూపకుండా అంగీకరించాను. కానీ నాకు తెలుసు అది రాగింగ్ అని. ఒక టవల్ కట్టుకుని ఒక భంగిమలో నిలబడి నవ్వమని చెప్పారు. కానీ ఆ ఫోటోలను చూసినప్పుడు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. వారు నన్ను తప్పుగా ఏం చిత్రీకరించలేదు. నాలో కూడా అందం ఉందని లోకానికి తెలియజేసారు. వాళ్లకు కృతజ్నతలు తెలుపుకోకుండా ఉండలేకపోయాను. మొదటిసారి నన్ను నేను చూసుకుని ఇష్టపడ్డాను.

నేను వేరొక విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు, ఫోటోగ్రఫీని ఒక అభిరుచిగా తీసుకున్నాను. నా కెమెరా నాలో విశ్వాసం నింపింది ... అది నా అభద్రతాభావాలను ఓడించింది. నేను మరిన్ని ఫోటోలను చిత్రీకరించడం మొదలుపెట్టాను - జాగ్రత్త తీసుకున్నాను, వదులుగాఉన్న వస్త్రాలను పక్కన పెట్టి, బరువు కోల్పోవటానికి సిద్ధ పడ్డాను. 6 నెలల్లో 20 కిలోల బరువును కోల్పోయాను. గుండె నిండా తలచుకుంటే ఏదైనా సాధించగలను అన్న ఆత్మ విశ్వాసం పెరిగింది. నాలో నేను కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నాను.

వాస్తవానికి, నేను అనేక నీచమైన సవాళ్ళను సైతం ఎదుర్కొన్నాను. కళాశాలలో, ఒక రాత్రి నా ప్రొఫెసర్ తన గదిలో నన్ను లాక్ చేసి, నన్ను రేప్ చేశాడు. చాలా భాధపడ్డాను. ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయతను అనుభవించాను. మళ్ళీ నా జీవితం ఇంత దారుణంగా మారినందుకు చచ్చిపోవాలని కూడా అనిపించింది. కానీ, ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత తప్పు నాది కాదు అని అనిపించింది. ఆ పరిస్తితుల నుండి బయటపడే క్రమంలో ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టడానికి రెండుసార్లు కష్టపడ్డాను. భారతదేశంలో ఉత్తమ ఫోటోగ్రాఫర్గా కలలుగన్నాను. నా మార్గంలో వచ్చిన ప్రతి ప్రాజెక్టును చేపట్టాను, ఫోటోగ్రఫీకి సంబంధించిన అన్ని రకాల పరిశోధనలు చేశాను మరియు ఆ వృత్తికి అంకితమయ్యాను.

మూడు సంవత్సరాల తరువాత, ముంబైకి వచ్చినప్పుడు, నా సొంత సంస్థను ప్రారంభించాను. ఆ ఆనందం ఊహాతీతం. అంత సులభమైన విషయం కాదని నాకు తెలుసు. నన్ను తిరస్కరించి, తరిమిగొట్టి, చిన్న చూపు చూసిన మునుపటి అధికారులే నాకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులుగా భావించాను.

నేడు, నేను గొప్ప వ్యాపారాన్ని కలిగి ఉన్నాను. ఒక సొంత ఇల్లు ఉంది మరియు నా భాధలని, సంతోషాలను పంచుకునే అందమైన స్నేహితుడు ఉన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి ఒక మనిషి జీవితానికి అనిపిస్తుంది. దానికి కారణం నా చర్మంలోని అందమే కారణమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నేనొక మాస్టర్ పీస్ అని నాభావన ఇప్పుడు. నేను నాజీవితం మొత్తంలోని ప్రతి నీడను, ప్రతి మచ్చను, ప్రతి రంగును ప్రేమిస్తాను. " అని వివరించింది.

ఇటువంటి జీవిత కథలు అడుగడుగునా ఉన్నాయి. పొలిటికల్ ఆటిట్యూడ్ ప్రదర్శించే తెలిసినవారి నుండే సగం హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్న అనేక మంది మనసుపొరల్లో భాధలను దిగమింగుతూ బ్రతుకుతున్నారు. చర్మానికి, అందానికి అధికశాతం విలువనిచ్చే ఈలోకంలో మానవత్వపు చాయలు మరుగున పడుతున్నాయి అన్నది వాస్తవం.

మనిషిలో గుణగణాలు అనే కోణం ఉంటుంది. ఎప్పుడైతే వాటికి విలువివ్వడం ప్రారంభిస్తారో, ఆత్మన్యూనతతో ఆత్మహత్యలు అన్న శీర్షికలు రావడం తగ్గుముఖం పడుతాయి. తాము ఎలా ఉన్నామో ఆలోచన చేయకుండా, తమ లోపాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా ఇతరులను భాద పెట్టే వ్యక్తులు అడుగడుగునా తారసపడుతుంటారు. కానీ వారందరూ జీవితం అనే రైలు ప్రయాణీకులే, ఏదో ఒక స్టాప్లో దిగిపోతారు. చివరగా మీతో ఉండే వారే మీ శ్రేయోభిలాషులు. కావున హేళన చేసే వారిని పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఈ కథ చదువుతుంటే, సాటి మనిషిని మనిషిగా చూడలేని బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అనిపిస్తుంది కదా.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికరమైన అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

She Was Shunned By People For Her Colour And Hair!

The latest post shared by the Humans of Bombay on their Facebook page describes the life of a woman. She revealed that while growing up, she went into a shell after she was bullied for her looks and skin colour. She revealed how a single photoshoot changed her life in the post. Her post has gone viral for all good reasons!
Story first published: Thursday, July 12, 2018, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more