For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విరాట్ కోహ్లీ వ్యాపారాలు చూస్తే దిమ్మదిరిగిపోతుంది.. ఎవరూ సరిరారు.. లోదుస్తులకు అంబాసిడర్ గా అడిగారు

|

విరాట్‌ కోహ్లీ ఆటలోనే కాదు మార్కెట్‌లోనూ ఒక బ్రాండ్ గా మారాడు. వందల కోట్ల విలువైన డీల్స్‌ విరాట్ కోహ్లీ పాదాక్రాంతమవుతునే ఉన్నాయి. గతంతో ప్యూమా కంపెనీతో ఒప్పందంతో విరాట్‌ కోహ్లీ రూ. 110 కోట్లు కోహ్లీ ఖాతాలో చేరిపోయాయి. గతేడాది జర్మనీకి చెందిన ఫుట్‌వేర్‌ సంస్థ 'ప్యూమా' కూడా విరాట్‌ కోహ్లీని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది.

ఎప్పుడో వెనక్కు నెట్టేసి

ఎప్పుడో వెనక్కు నెట్టేసి

సచిన్‌, ధోనీలను ఎప్పుడో వెనక్కు నెట్టేసిన విరాట్‌ ఎండార్స్‌మెంట్లతోపాటు వ్యాపార ఆర్జనలోనూ దూసుకుపోతున్నాడు. ఏ ఆటగాడైతే బాగా రాణిస్తున్నాడో.. కార్పొరేట్‌ కంపెనీలు వారివెంట పరుగులు పెట్టడం సహజం.

వారినే అంబాసిడర్ గా నియమించుకుని తమ ఉత్పత్తుల ను మార్కెట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి.

ఇప్పుడు కోహ్లీ

ఇప్పుడు కోహ్లీ

ఈ క్రమంలో ఫామ్‌, డిమాండ్‌ను బట్టి ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా రెడీ అయిపోతాయి. గతంలో సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌, ధోనీ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది. కాకపోతే అది కాస్త ఎక్కువ స్థాయిలో ఉంది.

కోహ్లీ మేనియా

కోహ్లీ మేనియా

క్రికెట్‌లో చాలా రోజులుగా కోహ్లీ మేనియా నడుస్తోంది. చాలా రోజులగగా కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మార్కెట్లో ధోనీ కన్నా విరాట్‌ ఎక్కువగా ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. దానికితోడు యూతలో విరాట్‌కు మంచి క్రేజ్‌ ఉంది. పైగా అతని దూకుడుతత్వాన్ని అందరూ ఇష్టపడతారు.

అంబాసిడర్‌గా

అంబాసిడర్‌గా

కాబట్టి ఇదే సరైన సమయం.. తమ బ్రాండ్‌కి కోహ్లీ ప్రచారం చేస్తే జనం ఎగబడి కొనేస్తారని భావించిన వ్యాపార సంస్థలు అతని వెంటపడుతున్నాయి. ప్రస్తుతం అతడు చాలా ఉత్పత్తులకు అంబాసిడర్‌గా ఉన్నాడు. మరికొన్ని సంస్థలు ఎండార్స్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

రూ.25 లక్షల ఒప్పందం

రూ.25 లక్షల ఒప్పందం

2008లో కోహ్లీ సారథ్యంలోని అండ ర్‌-19 భారత జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. దీంతో అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో టైటాన్‌ ఉత్పాదనల్లో ఒకటైన ఫాస్ట్‌ట్రాక్‌తో.. రూ.25 లక్షల ఒప్పందంతో మొదలైన కోహ్లీ మార్కెట్‌ మేని యా ఆ తర్వాత చాలా ‘ఫాస్ట్‌'గా సాగిపోయింది. ఎంఆర్‌ఎఫ్‌, పెప్సీ, మంచ్‌, టీవీఎస్‌ ఇలా అనేక కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

2014లో విరాట్‌ అతిపెద్ద డీల్‌

2014లో విరాట్‌ అతిపెద్ద డీల్‌

2014లో విరాట్‌ అతిపెద్ద డీల్‌ సాధించాడు. జర్మనీకి చెందిన ఆడిడాస్‌ ఏడాదికి పది కోట్లు చెల్లించేలా మూడేళ్ల కాలానికి ఎండార్స్‌ చేసుకుంది. స్పోర్ట్స్‌ ప్రొ అనే సంస్థ 2014లో అత్యంత మార్కెటబుల్‌ ప్లేయర్లలో రెండో వాడిగా కోహ్లీకి రేటింగ్‌ ఇచ్చింది.

రోజుకు రూ. 4 కోట్లకు పైగా

రోజుకు రూ. 4 కోట్లకు పైగా

కెరీర్‌ ఆరంభంలో లక్షలతో మొదలైన కోహ్లీ బ్రాండ్‌ వాల్యూ నేడు రోజుకు రూ. 4 కోట్లకు పైగా చేరుకుందని కోహ్లీ బ్రాండ్‌ పోర్ట్‌పోలియోను పర్యవేక్షిస్తున్న కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అధినేత బంటీ సజ్దే తెలిపాడు. ఇప్పుడు ఒక్కో బ్రాండ్‌ డీల్‌ ఖరీదు ఏడాదికి సగటున రూ. 10 కోట్లు ఉంది.

లోదుస్తుల బ్రాండ్‌లు

లోదుస్తుల బ్రాండ్‌లు

గత కొన్నేళ్లుగా కోహ్లీని అనేక సంస్థలు సంప్రదించాయి. అందులో లోదుస్తుల బ్రాండ్‌లు, పాన్‌ మసాలా కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ విరాట్‌ వాటిని తోసిపుచ్చాడు. ఎండార్స్‌మెంట్ల ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్న కోహ్లీకి వ్యాపారం అంటే కూడా ఎంతో మక్కువ. అందుకే.. ఓ పక్క ఆట.. మరోపక్క బిజినెస్‌ యాడ్‌ షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నప్పటికీ వ్యాపారానికి తగినంత సమయం కేటాయిస్తున్నాడు.

విరాట్‌ పెట్టుబడులు

విరాట్‌ పెట్టుబడులు

ఫిట్‌నెస్‌ సెంటర్లు, బ్రాండెడ్‌ దుస్తులు, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ ఫ్రాంచైజీలు, ఆడియో ఎక్విప్‌మెంట్‌ వంటి సంస్థల్లో విరాట్‌ పెట్టుబడులు పెట్టాడు. కొన్నింటిని సొంతంగా, మరికొన్నిట్లో భాగస్వామిగా కొనసాగుతున్నాడు. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లడం కూడా కోహ్లీ సక్సె్‌సకు ప్రధాన కారణం. అందుకే క్రీడారంగం నుంచి సంపాదనలో అందరికంటే ముందున్నాడు. బాలీవుడ్‌ హీరోలకు కూడా గట్టి పోటీనిస్తున్నాడు.

చిసెల్‌

చిసెల్‌

ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ సెంటర్లు. ‘ఎ విరాట్‌ కోహ్లీ ఇన్నోవేటివ్‌' క్యాప్షన్‌తో ప్రత్యేకించి యువ ఐటీ ఉద్యోగుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ జిమ్‌లను నిర్వహిస్తున్నారు.

రాన్‌

రాన్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ మింత్ర భాగ స్వామ్యంతో రాన్‌ యూ త ఫ్యాషన్‌ బ్రాండెడ్‌ దుస్తులను విక్రయిస్తుంది.

స్పోర్ట్‌ కాన్వో

స్పోర్ట్‌ కాన్వో

ఇది ఒక సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌. స్పోర్ట్‌ కాన్వో పేరిట నిర్వహిస్తున్న ఈ వెబ్‌సైట్‌లో క్రీడలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచుతారు. అభిమానులు కూడా తమ అభిప్రాయాలను పోస్ట్‌ చేయవచ్చు.

ఎఫ్‌సీ గోవా

ఎఫ్‌సీ గోవా

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో ఎఫ్‌సీ గోవా ఫ్రాంచైజీకి కోహ్లీ సహ యజమానిగా ఉన్నా డు. ఈ ఫ్రాంచైజీలో బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధవన్‌కు కూడా వాటాలున్నాయి.

యూఏఈ రాయల్స్‌

యూఏఈ రాయల్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌)లోనూ కోహ్లీ వాటాలు కొనుగోలు చేసి సహ యజమానిగా ఉన్నాడు.

మ్యూవ్‌ అకౌస్టిక్స్‌

మ్యూవ్‌ అకౌస్టిక్స్‌

ఇదొక ఆడియో పరికరాల కంపెనీ. ఇది హెడ్‌ ఫోన్స్‌, ఇయర్‌ ఫోన్స్‌, బ్లూటూత స్పీకర్లు అమ్ముతుంది.

స్టెపాథ్లాన్‌

స్టెపాథ్లాన్‌

ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు స్టెపాథ్లాన్‌ లైఫ్‌స్టైల్‌ సంస్థతో కలిసి కోహ్లీ గతేడాది జూన్‌లో కొత్త వెంచర్‌ను మొదలుపెట్టాడు.

రాగన్‌

రాగన్‌

ఫ్యాషన్‌ వ్యాపార రంగంలోనూ కోహ్లీకి ప్రవేశం ఉంది. రాగన్‌ పేరుతో కోహ్లీకి ఓ బ్రాండ్‌ ఉంది. 2014లోనే కోహ్లీ ఈ వ్యాపారంలోకి వచ్చాడు. తొలుత ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ మింత్రాతో మొదలుపెట్టిన కోహ్లీ.. ఆ తర్వాత షాపర్‌స్టాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 ఆఫ్‌లైన్‌ స్టోర్‌లో కోహ్లీ బ్రాండ్‌ దుస్తులు అందుబాటులో ఉన్నాయి.

రెస్టారెంట్

రెస్టారెంట్

గతేడాది దిల్లీలోని ఆర్కే పురంలో న్యుయేవా పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఇందులో యురోపియన్‌, దక్షిణ అమెరికన్‌, పెరువియాన్‌ డిష్‌ ప్రత్యేకం. ఇటీవల ఐపీఎల్‌ సందర్భంగా బెంగళూరు ఆటగాళ్లు ఈ రెస్టారెంట్ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

English summary

run machine virat kohli is scoring big time on the business field one venture at a time

run machine virat kohli is scoring big time on the business field one venture at a time
Story first published: Monday, June 4, 2018, 17:00 [IST]