For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నిజజీవిత గాధ: ఐదడుగుల ఎత్తు ఉండే ఆమె ఎలా రెండు అడుగులకు మారింది?

  |

  మనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ముందుగా మనం బాగానే ఉన్నామా లేదా ఎక్కడైనా గాయాలు ఆయ్యాయేమోనని వెతుకుతాం. ఒకవేళ గాయలైనట్లైతే, అత్యంత నాణ్యమయిన చికిత్స చేయించుకుని వీలైనంత త్వరగా కోలుకోవాలని తాపాత్రయపడతాం.

  కానీ కొన్ని సందర్భాలలో, తీసుకున్న మందుల మన శరీరంపై జరిపే ప్రతిచర్యల వలన లేదా తప్పుడు మందులు తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాలు మనల్ని సాధారణ జీవితాన్ని కొనసాగించనివ్వక ఆటంకం కలిగిస్తాయి.

  అటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇక భారతీయ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుదైన పరిస్థితుల మూలంగా గత పాతికేళ్ళలో ఆమె ఎత్తును ఐదడుగుల నుండి రెండడుగులకు తగ్గిస్తూ వచ్చారు. శాంతా దేవి యొక్క దీనగాధ ద్వారా ఆ వివరాలను మనం తెలుసుకుందాం.

  Shanti Devi Whose Height Reduced From 5 Feet To 2 Feet

  ఈమె కాన్పూర్ కు చెందినది.

  అరవై ఏళ్ల శాంటా దేవి, కాన్పూర్లోని ధారు గ్రామానికి చెందినది. ప్రత్యేకమైన కారణాల వలన ఈమె అంతర్జాలంలో ఒక ప్రభంజనంగా మారింది. గత పాతికేళ్ల కాలంగా ఆమె ఎత్తు నిరంతరంగా తగ్గుతూ వస్తుంది. ఒక ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడిన గాయాలు తగ్గినప్పటికీ, ఆమె ఎత్తు మాత్రం ఐదడుగుల నుండి రెండడుగులకు తగ్గుతూ వచ్చింది.

  ప్రమాదానికి పూర్వం ఆమె కూడా సాధారణ జీవితం గడిపేది. ఆమె ఇంటి పైకప్పులోని కొంత భాగం ఆమెపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఆమె విపరీతంగా గాయపడింది. ఆమె భర్త అయిన గంగాచరణ్కుష్వాహా ఇంకొందరు కలసి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులకు ఆమె గాయాలన్ని మాని పూర్తిగా కోలకున్నాక ఇంటికి తిరిగి తీసుకువచ్చారు.

  ఆమె నొప్పులు పెడుతున్నాయని ఫిర్యాదులు చేసింది.

  చికిత్స పూర్తయ్యి, ఇంటికి వచ్చినప్పటినుండి ఆమె ఎముకలలో నొప్పిగా ఉంటుందని చెప్తుండేది. ఆమె కుమారుడు విమల్ష్ డాక్టర్ ను మళ్లీ సంప్రదించారు. డాక్టర్ మళ్లీ కొన్ని మందులను సిఫార్సు చేశారు. ఆ మందులను వాడటం మొదలు పెట్టినప్పటి నుండి ఆమె బరువు తగ్గనారంభించింది.

  నాలుగు నెలలలోనే గణనీయమైన మార్పులు కన్పించాయి...

  మందలు వాడటం మొదలుపెట్టిన నాలుగు నెలలలోనే ఆమె ఎత్తు అర అడుగు తగ్గింది. తరువాత వారు పలువురు డాక్టర్లను సంప్రదించారు. కానీ, అనే సమస్య పరిష్కారమవ్వలేదు. పాతికేళ్ల తరువాత ఇప్పుడు ఆమె ఎత్తు రెండు అడుగులు మాత్రమే!

  డాక్టర్లు తేల్చినదేమిటంటే.....!

  చివరిగా డాక్టర్లు చెప్పిందేమిటంటే, తొలిదశలలో ఆమెకు ఆస్టియోపోరాసిస్ ఉందని గుర్తించకపోవడం వలనే ఆమెకు ఈ పరిస్థితి కలిగింది.మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ కొరత వలన ఈ పరిస్థితి తలెత్తుతుందని తేల్చారు.

  ప్రజలు ఆమె సందర్శనకై తరలి వస్తున్నారు.

  పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు,ఆమె భాధాకరమైన పరిస్థితులలో కొట్టుమిట్టాడుతుంటే, ఆమెను సందర్శించడానికి దేశంలోని నాలుమూలల నుండి ప్రజలు వచ్చి, ఆమెతో ఫోటోలు తీసుకోవాలని అత్యుత్సాహం చూపిస్తున్నారు.

  ఈ కథను చదివాక మీకేమనిపిస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన కధనాల కొరకు, ఈ సెక్షన్ ను చూస్తూ ఉండండి.

  English summary

  Shanti Devi Whose Height Reduced From 5 Feet To 2 Feet

  Shanti Devi is a 60-year-old woman living in Dharu village of Kanpur. She has become an internet sensation for a unique reason. Since the past 25 years, her height has been continuously reducing. It is reported that after an accident, her wounds were filled but her height has now become 2 feet, which was recorded as 5 feet earlier.
  Story first published: Monday, May 28, 2018, 16:05 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more