For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్సనల్ ఫొటోలు పంపి ట్రాప్ చేసింది.. రూమ్ కు వస్తానంది.. ఉన్నదంతా ఉడ్చేసింది - #mystory183

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆమె ఫోన్‌ నంబరు... ఆమెకు నగదు బదిలీ చేసిన ఖాతాలను పోలీసులు పరిశీలించారు. ఇదంతా నైజీరియన్‌ మోసం అని పోలీసులు తేల్చారు.

|

నేను బెంగళూరులో ఉంటాను. ఒక ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తాను. నాకు ఇన్ స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. తనది లాస్ ఏంజిల్స్. మొదట ఇన్ స్టాగ్రామ్ లో తనే నన్ను ఫాలో చెయ్యడం స్టార్ట్ చేసింది.

తర్వాత నేను తనని ఫాలో అయ్యాను. ఆ తర్వాత తను నాకు తన పర్సనల్ వీడియోలు, ఫొటోలు పంపేది. సెమీ న్యూడ్ గా ఉండే ఫొటోలు కూడా నాకు పంపేది. అవన్నీ తన ఒర్జినల్ ఫొటోలే అని నాకు తెలుసు. తను రోజుకు వందకు పైగా మెసేజ్ లు పంపేది. నన్ను ఎంతో ఇష్టపడుతున్నట్లుగా చెప్పేది.

బెంగళూరులో చాలా మంది ఫ్రెండ్స్

బెంగళూరులో చాలా మంది ఫ్రెండ్స్

తన ఆఫీసు విషయాలు, కుటుంబ విషయాలు, తన సమస్యలు.. తను ఇంట్లో వండే వంటకాలు ఇలా ప్రతి విషయం నాకు చెప్పేది. నేను కూడా తనతో గంటల తరబడి చాటింగ్ చేసేవాణ్ని. ఇలా ఇద్దరం కొన్ని రోజుల్లోనే క్లోజ్ అయ్యాం. తనకు బెంగళూరులో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని కొన్ని ఆఫీసుల్లో పరిచయాలున్నాయని చెప్పింది. తను చెప్పింది నిజమే అన్నట్లుగా ఇక్కడి వారితో దిగిన ఫొటోలు కూడా పంపింది.

బ్రాండెడ్ వస్తువులు తీసుకొచ్చాను

బ్రాండెడ్ వస్తువులు తీసుకొచ్చాను

మరో వారం రోజుల్లో నేను బెంగుళూరుకు వస్తానని చెప్పింది. చెప్పినట్లుగా తను ఒక రోజు బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఫోన్ చేసింది. ‘‘హాయ్‌ మనోజ్.. నీ కోసం ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంకా కొన్ని రకాల బ్రాండెడ్ వస్తువులు తీసుకొచ్చాను. సుమారు రెండు లక్షల విలువైన వస్తువులు నీకోసం లాస్ ఏంజిల్స్ నుంచి తెచ్చాను.

అమౌంట్ అడ్జెస్ట్ చెయ్

అమౌంట్ అడ్జెస్ట్ చెయ్

నేను బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నాను. అయితే నన్నుఇక్కడ కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. వీటన్నింటికీ ట్యాక్స్ చెల్లించాలని పట్టుబట్టారు. నా వద్ద మీ కరెన్సీ జస్ట్ 50వేలు మాత్రమే ఉంది. మిగతా అమౌంట్ నువ్వు అడ్జెస్ట్ చెయ్ మనోజ్ అంటూ ఫోన్ చేసింది.

మీ రూమ్ కు వచ్చేస్తాను

మీ రూమ్ కు వచ్చేస్తాను

నువ్వు అమౌంట్ నాకు కూడా పంపాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం ఉండూ అంటూ లైన్లోనే పెట్టి... కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడింది. ఇప్పుడే కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడాను.. వాళ్లు చెప్పిన ఖాతాలోనే డబ్బు జమ చేయి అంటూ కోరింది. తర్వాత డైరెక్ట్ గా నేను మీ రూమ్ కువచ్చేస్తాను అంది. సరే అని వెంటనే నేను ఆమె చెప్పిన అకౌంట్ కు డబ్బు పంపించాను.

తన రాక కోసం ఎదురు చూస్తూ

తన రాక కోసం ఎదురు చూస్తూ

ఇక తను వస్తుందని మా రూమ్ నేను స్పెషల్ గా తనకోసం వంటకాలు కూడా సిద్ధం చేయించాను. తన రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను. కొంత సేపటికి ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేసింది. నాకు అనుమానం వచ్చింది.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆమె ఫోన్‌ నంబరు... ఆమెకు నగదు బదిలీ చేసిన ఖాతాలను పోలీసులు పరిశీలించారు. ఇదంతా నైజీరియన్‌ మోసం అని పోలీసులు తేల్చారు. వాళ్లు నాకు చాలా విషయాలు తెలిపారు.

మోసాలకు పాల్పడుతున్నారట

మోసాలకు పాల్పడుతున్నారట

ఇలా ప్రస్తుతం కొందరు మోసాలకు పాల్పడుతున్నారట. దీంతో నాలాంటి అమాయికులంతా మోస పోతున్నారట. నైజీరియన్లు తరచూ మోసాల శైలి మార్చినా... విమానాశ్రయం... కస్టమ్స్‌... ఆదాయపు పన్ను అంశాలు మాత్రం కచ్చితంగా వాటిలో ఉంటాయట. ఇలాంటి కేసులు హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, ముంబయిలలో ఇటీవల బాగా పెరిగిపోయాయని నాకు తెలిసింది.

పెళ్లి ప్రస్తావన

పెళ్లి ప్రస్తావన

మొదట అందమైన యువతిగా పరిచయం చేసుకొంటున్నారట. తర్వాత గాఢమైన ప్రేమను, స్నేహాన్ని వలగా వేస్తారట. తర్వాత వ్యక్తిగత వివరాలు తెలుసుకుని ఆర్థిక సాయం కావాలి అడుగుతారట. కొందరు వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాక పెళ్లి ప్రస్తావన తెస్తున్నారట. ఇక మనం వారి మాటలు నమ్మితే చాలు వెంటనే వారి అస్త్రాన్ని మనపై వదులుతారట.

అమ్మాయిలను బుట్టలో వేసుకొని

అమ్మాయిలను బుట్టలో వేసుకొని

ఇక కొందరు నైజీరియన్‌ యువకులూ కూడా ఇలా స్నేహం పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకొని బురిడీ మాటలతో సొమ్ము కాజేస్తున్నారు. ఇక యువకులను మోసగించేందుకు ఓ నైజీరియన్‌ యువతి మొత్తం వ్యవహారాన్ని నడుపుతుందట.

ఇక్కడి నుంచే

ఇక్కడి నుంచే

ల్యాప్‌టాప్‌లో స్ఫూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా లండన్‌, అమెరికా, కెనడా నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మిస్తారు. మనకు వచ్చే ఫోన్ నంబర్లు కూడా అలాగే ఉంటాయి. కానీ వాళ్లంతా ఏ హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో మాట్లాడుతారు.

పర్సనల్ ఫొటోలు పంపుతూ

పర్సనల్ ఫొటోలు పంపుతూ

ఇక మనం వాళ్లు నిజమని నమ్మేంత వరకూ వాళ్ల పర్సనల్ ఫొటోలు పంపుతూ ఉంటారు. మనం నమ్మాం అని తెలిశాక ఆపేస్తారు. ఇద్దరు లేదా ముగ్గురు నైజీరియన్లు ముఠాగా ఏర్పడి ఇలాటి దందాలు చేస్తున్నారు. ఒక అమ్మాయి నీ కోసం బహుమానంగా బంగారు ఆభరణాలు, డాలర్లు తెచ్చానని చెబితే... మరో నైజీరియన్‌ తాను కస్టమ్స్‌ అధికారినని పరిచయం చేసుకొంటూ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాడు.

డబ్బులు లాగేస్తారు

డబ్బులు లాగేస్తారు

ఇంకో నైజీరియన్‌ బ్యాంకు అధికారిగా నటిస్తాడు. ఇలా మొత్తానికి అమాయికులను టార్గెట్ చేసి వారి నుంచి డబ్బులు లాగేస్తారు. మనం ఏదో ఆశించి విదేశి అమ్మాయిలు అనుకుని ఫ్రెండ్ షిప్ స్టార్ చేస్తే చివరకు మోసపోయేది మనమేనని నాకు తెలిసొచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వాటికి ఆకర్షన చెంది మోసపోకండి.

English summary

she cheated on me and i realised

she cheated on me and i realised
Desktop Bottom Promotion